viral messages
-
UIDAI Factcheck: ఆధార్ జిరాక్స్‌లు ఇవ్వకూడదా?
ఆధార్ కార్డ్ ప్రస్తుతం అందరికీ అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. ఏ ప్రభుత్వ పథకానికైనా ఇది కావాల్సిందే. ఎందుకంటే ఇందులో మీ పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలతోపాటు మీ బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది. దీంతో దీని ద్వారా అనేక మోసాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ.. కార్డుదారులకు ఎప్పటికప్పుడు పలు సూచనలు ఇస్తుంటుంది. ప్రస్తుతం యూఐడీఏఐ పేరుతో సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. యూఐడీఏఐ పేరుతో వైరల్ అవుతున్న ఆ మెసేజ్‌లో ఆధార్ కార్డుదారులు తమ ఆధార్ సంబంధిత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని, ప్రభుత్వ పథకం కోసం అయినా సరే తమ ఆధార్ కార్డు జిరాక్స్‌లు సైతం ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అందులో ఉంది. Beware! Fake Message Alert! Please Ignore. pic.twitter.com/RNEyzebJ5R — Aadhaar (@UIDAI) February 21, 2023 అయితే ఆ మెసేజ్‌పై యూఐడీఏఐ క్లారిటీ ఇచ్చింది. అది పూర్తిగా ఫేక్ అని నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని, అందులో ఇచ్చిన యూఐడీఏఐ లింక్ కూడా తప్పు అని పేర్కొంది. (ఇదీ చదవండి: ఉద్యోగికి యాపిల్ అపూర్వ బహుమతి! స్వయంగా టిమ్‌కుక్...) -
కర్ణాటకలో అల్లర్లు.. సోషల్ మీడియా పోస్టుతో రగడ
హుబ్బళ్లి: కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక సోషల్ మీడియా పోస్టు భారీ విధ్వంసానికి కారణమైంది. కోపోద్రిక్తులైన ఒక వర్గం విధ్వంసానికి పాల్పడడంతో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆస్పత్రి, ఆలయం కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది. ‘నగరంలో ఈ నెల 20 దాకా 144 సెక్షన్ విధించాం. 40 మందికిపైగా అరెస్టు చేశాం. 12 మంది పోలీసులు గాయపడ్డారు’ అని హుబ్బళ్లి–ధార్వాడ్ పోలీసు కమిషనర్ లభురామ్ చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు పెట్టిన పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరికొందరు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై ఒకరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. అయితే ఇంతటితో తృప్తిపడని కొందరు ప్రజలు పోలీసు స్టేషన్ వద్ద గుమిగూడారని, వారిని చెదరగొట్టడం జరిగిందని వివరించారు. అనంతరం అర్థరాత్రి సమయంలో మరలా చాలామంది గుమిగూడడంతో వారి నాయకులను పిలిపించి సదరు కేసులో తీసుకున్న చర్యలను వివరించామన్నారు. అయితే ఎంత నచ్చజెప్పినా వినకుండా ఈ మూక విధ్వంసానికి పాల్పడిందని లభురామ్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా రాళ్లు పడి ఉండడాన్ని గమనించిన పోలీసులు ముందుగానే ట్రక్కు నిండా రాళ్లు, ఇటుకలు తెప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే హుబ్బళ్లిలో దాడి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే చేశారని కర్ణాటక సీఎం బొమ్మై అభిప్రాయపడ్డారు. ఇలాంటివి సహించబోమని దీని వెనకున్నవారు గ్రహించాలని హెచ్చరించారు. దాడుల వెనక ఉన్నవారందరినీ అరెస్టు చేస్తామన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులుమవద్దని ప్రజలను కోరారు. స్టేషన్ ముందు ఒక్కమారుగా భారీగా జనాలు మూగారంటే అది ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిన ఘటనగా భావించాలన్నారు. గాయపడిన పోలీసుల్లో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర చెప్పారు. ఘటనకు సంబంధించి కొందరిని అరెస్టు చేశామని, దేవర జీవనహళ్లి, కడుగొండహళ్లి లాంటి చోట్ల జరిగిన విధ్వంసాన్ని ఇక్కడా చేయాలని కొందరు భావించారని చెప్పారు. విధ్వంసకారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంఎల్ఏలు డిమాండ్ చేశారు. ఘటనను మాజీ సీఎం కుమారస్వామి ఖండించారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. -
పెళ్లి కావాల్సిన వారికి ఆ పరీక్షపెట్టండి: కేంద్ర మంత్రి సలహా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో విభిన్న అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా శుక్రవారం చేసిన ఓ పోస్టులు తెగ వైరలయ్యాయి. తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. పెళ్లి కావాల్సిన వారికి సలహాలు ఇచ్చారు. ఆంటీ ఇచ్చే సలహా అంటూ తనకు తాను ఆంటీగా అభివర్ణించుకోవడం స్మృతి ఇరానీకే చెల్లింది. ఎవరైనా ఆంటీ అంటే ఊరుకోరు కానీ స్మృతి ఇరానీ ఆంటీ అనిపించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఆమె పోస్టులు ఇలా ఉన్నాయి. ‘ఏ వ్యక్తికైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా (స్లో) ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాలి. దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవచ్చు’ అని ఓ పోస్టు చేశారు. అనంతరం మరో పోస్ట్ చేశారు. ‘ఆంటీ సలహా.. ఏ పదార్థం పరిపూర్ణం.. లోపం లేనిది (పర్ఫెక్ట్)గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మార్చుకోవాలి’ అని సలహాలు ఇస్తూ పోస్టు చేశారు. ఈ పోస్టులపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ ఉన్న విషయం తెలిసిందే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో స్మృతిని కొనసాగించారు. -
సోషల్ డిస్టెన్స్ అంటే ఇలా కాదురా అబ్బాయిలు!
న్యూఢిల్లీ: ఆనంద్ మహీంద్ర.. పరిచయం అక్కర్లేని పేరు. దేశీ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న వ్యాపార దిగ్గజం. ఆయన ఇతర వ్యాపార ప్రముఖుల కంటే భిన్నంగా ఆలోచిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు తగ్గట్లు సమయం, సందర్భాన్ని బట్టి నెటిజన్లతో తన అభిప్రాయాల్ని పంచుకుంటుంటారు. అభిప్రాయల్ని పంచుకోవడమే కాదు ఆపన్న హస్తం అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు కరోనా నిబంధల్ని పాటించాలని ప్రచారం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో శానిటైజర్లను వినియోగించడం, మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు. తాజాగా కరోనా పరిస్థితులకు ఆపాదిస్తూ 2017 నాటి ఓ ఫోటోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ఆ ఫోటోలో ఇద్దరు ద్విచక్ర వాహన దారులు నిచ్చెన రెండు చివర్లలో తలల్ని దూర్చి దాన్ని తరలిస్తున్నారు. ఆఫోటోను నెటిజన్లతో పంచుకున్న ఆనంద్ మహీంద్ర .. 'ఈ ఫోటో నవ్వుతెప్పిస్తుంది. సామాజిక దూరం అంటే ఇలా ప్రమాదకరమైన స్టంట్లు కాదు. ఇలాంటి అనుకోని ప్రమాదాల్ని తెచ్చి పెడుతుంటాయి జాగ్రత్త’ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నా సంగతి తెలిసిందే. సిలిండర్ల కొరతను అధిగమించేందుకు ఆనంద్ మహింద్రా తన వంతుగా పలు సేవా కార్యక్రమాల్ని ప్రారంభించారు. 'ఆక్సిజన్ వీల్స్' పేరుతో ప్రధాన నగరాలకు చెందిన 13 ఆస్పత్రులకు 61 జంబో సిలిండర్లను మహీంద్రా వాహనాల్లో తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు ఆనంద్ మహీంద్ర ఇటీవల తెలిపారు. -
ఆ క్రేజ్ ఇంతింత కాదయా
స్టార్స్ అప్లోడ్ చేసిన ఫొటోలన్నిటికీ ప్రశంసలు వస్తాయంటే పొరపాటే. అప్పడప్పుడు విమర్శలు కూడా వస్తాయి. కత్రినాకైఫ్, ఫాతిమా సనా షేక్ లాంటి వారు ఆ అనుభవాన్ని చవి చూసినవారిలో కొందరు. వాళ్లు పెట్టిన ఫొటోలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. వెయ్యి మాటల్లో చెప్పలేనిది ఒక్క ఫొటో చెబుతుందంటారు. అందుకే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సెల్ఫీల ట్రెండ్ కూడా పెరిగింది. ఇక సోషల్ మీడియాలో అయితే రోజుకో ఫొటో అయినా అప్లోడ్ చేయనిదే కునుకు తీయని నెటిజన్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. వివాదం అయినా, విశేషం అయినా ఒకే ట్వీట్‌తోనే, ఇన్‌స్టా స్టోరీతోనే.. ఏదో ఒక సోషల్‌మీడియా యాప్ ద్వారానో తమ అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో సోషల్ మీడియా ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయబడిన కొన్ని ఫొటోలను నెటిజన్లు విపరీతంగా వైరల్ చేశారు. దాన్ని బట్టే ఆ ఫొటోల క్రేజ్ ‘ఇంతింత కాదయా’ అనొచ్చు. వాటిలో కొన్నింటిపై లుక్కేద్దాం. ఒకే ఫ్రేమ్‌లోకి బోనీ కుటుంబం ఈ ఏడాది ఫిబ్రవరిలో అతిలోకసుందరి శ్రీదేవి మరణించినప్పుడు సినీలోకం కన్నీరు కార్చింది. బోనీకపూర్ రెండో భార్య శ్రీదేవి అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1983లో మోనా కపూర్‌ను వివాహం చేసుకున్నారు బోనీ కపూర్. 1996లో బోనీ–మోనా విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరిద్దరికీ ఓ బాబు పుట్టాడు. అతనే ఇప్పటి బాలీవుడ్ హీరో అర్జున్‌కపూర్. మోనా నుంచి విడాకులు తీసుకుని 1996లోనే శ్రీదేవిని వివాహం చేసుకున్నారు బోనీ కపూర్. శ్రీదేవికి–బోనీకి జాన్వీ, ఖుషీ అని ఇద్దరు కుమార్తెలు సంతానం. అయితే మొదటి భార్య కుటుంబానికీ, రెండో భార్య కుటుంబానికీ పెద్దగా అనుబంధం ఉండేది కాదు. కానీ శ్రీదేవి చనిపోయాక రెండు కుటుంబాలూ కలిశాయి. జాన్వీ, ఖుషీలకు అర్జున్‌కపూర్ అండగా ఉంటున్నారు. ఈ ఏడాది ఏడడుగులు వేసిన సోనమ్ కపూర్ పెళ్లి రిసెప్షన్ ముంబైలో జరిగినప్పుడు బోనీ ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఆ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఇది హ్యాపీ మూమెంట్ అయితే విషాద సంఘటన శ్రీదేవి అంత్యక్రియల తాలూకు ఓ ఫొటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అభిమాన తార చివరి ఫొటోను అభిమానులు పదే పదే చూశారు. చిన్నోడు.. చిన్నారి.. క్రేజ్ బోలెడు బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్–కరీనాకపూర్ ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్, షాహిద్ కపూర్–మీరా రాజ్‌పుత్ దంపతుల కుమార్తె మిషా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చూస్తుంటాం. ఈ ఏడాది ఆగస్టు 2న రెండేళ్లు పూర్తి చేసుకుంది బేబీ మిషా కపూర్. ఈ బర్త్‌డే వేడుకలకు ముందు ముద్దుల కూతురు మిషాతో ఓ ఫొటోషూట్ చేయించుకున్నారు మీరా రాజ్‌పుత్. ఆ ఫొటోలు ఫుల్‌గా వైరల్ అయ్యాయి. చిన్నోడు తైముర్, చిన్నారి మిషాలకు బోల్డంత క్రేజ్. ఈ ఏడాది బాలీవుడ్లో పెళ్లి సన్నాయి బాగా వినిపించింది. అందులో సోనమ్ కపూర్–ఆనంద్ ఆహుజాల పెళ్లి ఒకటి. దాదాపు రెండు సంవత్సరాలు డేటింగ్ చేసుకున్న తర్వాత సోనమ్–ఆనంద్ ఈ ఏడాది మేలో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ఓ ఈవెంట్‌కి వెళ్లినప్పుడు క్లిక్‌మన్న ఫొటో నెటిజన్లను బాగా మెప్పించింది. నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా పెళ్లివేడుక సంబరాలు సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేశాయి. ఈ నెల 1,2 తేదీల్లో జో«ద్‌పూర్‌లో ఈ జంట రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలకు మొబైల్స్, కెమెరాల అనుమతి లేకపోవడంతో నిక్–ప్రియాంకా ఫొటోలు వారు రిలీజ్ చేసే వరకు బయటకు రాలేదు. ఆ తర్వాత కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నిక్ అండ్ ప్రియాంకా చోప్రా. ఇన్స్టాగ్రామ్ లిస్ట్‌లో ట్వీటర్ అకౌంట్ ఉన్నప్పటికీ కొందరు స్టార్స్ కూడా ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమిర్ ఖాన్, కమల్‌హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కత్రినా కైఫ్, ఐశ్వర్యారాయ్... ఈ ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్ తెరిచిన కొందరు స్టార్స్. ∙ మీరా రాజ్‌పుత్, మిషా ఆనంద్, సోనమ్ నిక్ జోనస్, ప్రియాంక -
ఉచిత టిక్కెట్లు : జెట్ ఎయిర్వేస్ క్లారిటీ
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాల్లో నిజాలెంత ఉంటాయో? అబద్ధాలు కూడా అంతే. ఇటీవల జెట్ ఎయిర్వేస్ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత విమాన టిక్కెట్లు ఇస్తుందంటూ మెసేజ్‌లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ మెసేజ్‌లో నిజమెంత ఉందో, అబద్ధమెంతో జెట్ ఎయిర్వేస్ తేల్చేసింది. తాము ఎటువంటి ఉచిత టిక్కెట్లు ఇవ్వడం లేదని, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాలన్నీ పూర్తిగా అవాస్తవమేనని జెట్ ఎయిర్వేస్ బుధవారం స్పష్టంచేసింది. ఇది 100 శాతం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. అధికారిక ఖాతాలను నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కస్టమర్లకు సూచించింది. ‘25 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జెట్ ఎయిర్వేస్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ రెండు టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వస్తోన్న సందేశాలన్నీ పూర్తిగా అవాస్తవం. అది అధికారిక సమాచారం కాదు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే ఎయిర్వేస్ అధికారిక ఖాతాల్లోనే ఉంచుతాం. దానికి బ్లూ టిక్ మార్క్ ఉంటుంది’ అని జెట్ ఎయిర్వేస్ ట్వీట్ చేసింది. 25వ వార్షికోత్సవ సందర్భంగా జెట్‌ఎయిర్‌వేస్ ప్రతి ఒక్కరికీ రెండు ఉచిత టిక్కెట్లు ఇస్తోందని, ఆ లింక్‌ను మరో 20 మందికి షేర్ చెయ్యాలని, దాంతో 48 గంటల్లో యూజర్ మెయిల్ ఐడీకి టికెట్లు అందుతాయని ఆ మెసేజ్‌లో ఉంది. అయితే అదంతా పూర్తిగా అవాస్తవమని జెట్ ఎయిర్వేస్ తేల్చేసింది. ఈ వైరల్ మెసేజ్‌పై బుధవారం క్లారిటీ ఇచ్చింది. ఎయిర్‌లైన్ ప్రకటనపై స్పందించిన చాలామంది ట్విటర్ యూజర్లు తాము ఈ మెసేజ్‌ను పొందామని, క్లిక్ కూడా చేసినట్టు పేర్కొన్నారు. #FakeAlert There's a fake link being circulated regarding ticket giveaways for our 25th Anniversary. This is not an official contest/giveaway and we advise caution. Genuine contests & giveaways are hosted only on our verified social media accounts, indicated with a blue tick. pic.twitter.com/NvJrFaq3aL — Jet Airways (@jetairways) May 23, 2018 -
ఇలా కూడా పెళ్లి చేసుకోవచ్చా?
రెండు రోజుల క్రితం సూరత్‌లో ఒక జంట కేవలం 500 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు ఎక్కువ మొత్తంలో అందుబాటులో లేకపోవడం, నగదు విత్‌డ్రాలపై పలు రకాల పరిమితులు ఉండటంతో ఇప్పుడు పెళ్లిళ్ల వ్యవహారంపై సోషల్ మీడియాలో జోకులు పండుతున్నాయి. తాము కూడా ఒక పెళ్లి చేయాలనుకుంటున్నామని.. దానికి వెడ్డింగ్ కార్డు తప్పకుండా ప్రింట్ చేసి, అందులో మాత్రం.. కింద నోట్ పెట్టి ఎవరి క్యారేజీలు వాళ్లే తెచ్చుకోవాలని చెబుతామని అంటూ ఒక మెసేజ్ ఫార్వర్డ్ అవుతోంది. తాము టేబుళ్లు, డిస్పోజబుల్ ప్లేట్లు, మంచినీళ్లు మాత్రం సరఫరా చేస్తామని.. అక్కడకు పదిమంది వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే అన్ని కూరలు అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి.. పెళ్లి భోజనం లాగే పది రకాల కూరలు ఉంటాయని చమత్కరించారు. ఇక మరో సందేశం బాగా వైరల్ అయింది.. కేంద్రప్రభుత్వ తదుపరి సంచలనాత్మక నిర్ణయం. ఇది ఎప్పుడైనా అమలు కావచ్చు 1. ఈ రోజు అర్థరాత్రి 12 గంటల నుంచి అన్ని పాత వివాహలు రద్దవుతాయి. పాత భార్య రేపటి నుంచి చలామణిలో ఉండదు. 2. మీరు మీ పాత భార్యను డిసెంబర్ 30లోగా కోర్టులో లేదా వారి కన్నవారి ఇంట్లో జమచేయాలి 3. తరువాత రెండు రోజుల వరకు అన్ని కళ్యాణ మండపాలు, రిజిస్ట్రార్ ఆఫీసులు మరియు మందిరాలు మూతపడతాయి 4. నవంబర్ 30 వరకు ప్రతి రోజు 2 గంటలు కొత్త భార్యతొ గడపవచ్చు, నెమ్మదిగా ఈ సమయం పెంచబడును.