ఇలా కూడా పెళ్లి చేసుకోవచ్చా?
ఇలా కూడా పెళ్లి చేసుకోవచ్చా?
Published Sat, Nov 26 2016 2:53 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM
రెండు రోజుల క్రితం సూరత్‌లో ఒక జంట కేవలం 500 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు ఎక్కువ మొత్తంలో అందుబాటులో లేకపోవడం, నగదు విత్‌డ్రాలపై పలు రకాల పరిమితులు ఉండటంతో ఇప్పుడు పెళ్లిళ్ల వ్యవహారంపై సోషల్ మీడియాలో జోకులు పండుతున్నాయి.
తాము కూడా ఒక పెళ్లి చేయాలనుకుంటున్నామని.. దానికి వెడ్డింగ్ కార్డు తప్పకుండా ప్రింట్ చేసి, అందులో మాత్రం.. కింద నోట్ పెట్టి ఎవరి క్యారేజీలు వాళ్లే తెచ్చుకోవాలని చెబుతామని అంటూ ఒక మెసేజ్ ఫార్వర్డ్ అవుతోంది. తాము టేబుళ్లు, డిస్పోజబుల్ ప్లేట్లు, మంచినీళ్లు మాత్రం సరఫరా చేస్తామని.. అక్కడకు పదిమంది వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే అన్ని కూరలు అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి.. పెళ్లి భోజనం లాగే పది రకాల కూరలు ఉంటాయని చమత్కరించారు.
ఇక మరో సందేశం బాగా వైరల్ అయింది..
కేంద్రప్రభుత్వ తదుపరి సంచలనాత్మక నిర్ణయం. ఇది ఎప్పుడైనా అమలు కావచ్చు
1. ఈ రోజు అర్థరాత్రి 12 గంటల నుంచి అన్ని పాత వివాహలు రద్దవుతాయి. పాత భార్య రేపటి నుంచి చలామణిలో ఉండదు.
2. మీరు మీ పాత భార్యను డిసెంబర్ 30లోగా కోర్టులో లేదా వారి కన్నవారి ఇంట్లో జమచేయాలి
3. తరువాత రెండు రోజుల వరకు అన్ని కళ్యాణ మండపాలు, రిజిస్ట్రార్ ఆఫీసులు మరియు మందిరాలు మూతపడతాయి
4. నవంబర్ 30 వరకు ప్రతి రోజు 2 గంటలు కొత్త భార్యతొ గడపవచ్చు, నెమ్మదిగా ఈ సమయం పెంచబడును.
Advertisement
Advertisement