Visakha Sarada Peetadipathi
-
విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస దీక్ష విరమణ
-
ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన విశాఖ శారదా పీఠాధిపతులు
-
పండుగల నిర్ణయంలో ఏకాభిప్రాయం ఉండాలి
పెందుర్తి: పండుగలను నిర్ణయించే విషయంలో పంచాంగకర్తలు ఏకాభిప్రాయానికి రావాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు. పండుగల విషయంలో పంచాయితీలు సరికాదన్నారు. భవిష్యత్‌లో జరగబోయే ప్రమాదాలను, ఉపద్రవాలను అంచనావేయడం వంటి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పంచాంగకర్తలు దృష్టి సారించాలన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడమీ తరఫున ఆదివారం దైవజ్ఞ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. పండుగల విషయంలో విభేదాలను పక్కనపెట్టి, పంచాంగకర్తలు అందరూ ఏకతాటిపై నిలవాలన్నారు. రాబోయే ప్లవ నామ సంవత్సరానికి సంబంధించి పండుగల విషయంలో ఏకాభిప్రాయంతో పంచాంగాలను ప్రచురించాలని కోరారు. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పంచాంగకర్తలందరితో పెద్దఎత్తున దైవజ్ఞ సమ్మేళనం నిర్వహించాలని సంకల్పించామని పేర్కొన్నారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ, దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, అర్చక ట్రైనింగ్ అకాడమి డైరెక్టర్ కృష్ణశర్మ, దేవాలయ పాలన సంస్థ డైరెక్టర్ ద్రోణంరాజు రామచంద్రరావు, పలువురు పంచాంగకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
చాతుర్మాస్య దీక్ష చేపడుతున్న విశాఖ శారదా పీఠాధిపతి
-
ఆర్టికల్ 370 రద్దు భారతావనికి వరం
పెందుర్తి: భారతదేశంలో జమ్మూకశ్మీర్ ఒక అవిచ్ఛిన్న అంతర్భాగమయ్యేలా, దేశం కల సాకారమయ్యేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అమోఘమని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రశంసించారు. ఆర్టికల్ 370 రద్దు దేశానికి అత్యంత ఆవశ్యకమన్నారు. దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రుషికేష్ గంగానదీ తీరంలోని శారదాపీఠంలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి చాతుర్మాస దీక్ష ఆచరిస్తున్న స్వామీజీ.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై స్పందించారు. కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా సోమవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా బిల్లును తీసుకురావడం సాహసమైన, సమర్థమైన నిర్ణయమన్నారు. మంచుకొండల కశ్మీరంలో చల్లనితల్లి సరస్వతి శక్తిపీఠం నెలకొని ఉందని, ఆ తల్లిని దర్శించుకునేందుకు దేశంలోని కోట్లాది మంది భక్తులకు మోదీ నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కశ్మీర్లో సరస్వతి పీఠం పునరుద్ధరణ జరగాల్సి ఉందని, ఇందుకు భారత సర్కారు పూనుకుని ముందుకొస్తే శారదాపీఠం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. రామజన్మభూమి విషయంలోనూ ప్రధాని చర్యలు తీసుకోవాలని సూచించారు. గో రక్షణకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గోవును భారతదేశ అధికార ఆధ్యాత్మిక చిహ్నంగా ప్రకటించాలని కోరారు. కశ్మీర్‌పై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభినందనలు తెలియజేస్తూ స్వామీజీ మంగళశాసనాలు అందజేశారు. -
బ్రాహ్మణుల్ని ప్రభుత్వం మోసం చేస్తోంది
విప్రోత్సవం సదస్సులో శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాహ్మణుల్ని మోసం చేస్తోందని, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి రూ.500 కోట్లు ఇస్తామని చెప్పి, కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చిందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆ నిధులు కూడా పేదలు, గ్రామాల్లో నివసించేవారికి అందడం లేదని, అధికార పక్ష కార్యకర్తలకే అందిస్తున్నారని విమర్శించారు. ఏపీలో బ్రాహ్మణ జాతిపై దాడి జరుగుతోందని, దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఈ స్వామి వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల ఆవరణలో ‘విప్రోత్సవం’ జరిగింది. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ అర్చకులకు రూ.10వేలు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్వర్వులు జిల్లాస్థాయిల్లో అమలుకావడం లేదన్నారు. దీనిపై త్వరలోనే విజయవాడలో ఒక సభను నిర్వహిస్తామని చెప్పారు. బ్రాహ్మణులు సోమరులు, బద్ధకస్తులని కొంతమంది దాడిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావు చేసిన సంస్కరణల వల్లే నేడు అన్ని రంగాలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. విశాఖ శారదా పీఠం ఆధ్వర్యాన డిసెంబరు లేదా జనవరిలో అమరావతిలో 5 లక్షల మంది బ్రాహ్మణులతో సభ నిర్వహిస్తామన్నారు. అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే పండిట్ భవర్లాల్ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణుల్ని విస్మరిస్తే ఏమీ జరుగుతుందో ఢిల్లీలో చూశారని గుర్తుచేశారు. సమాఖ్య ముఖ్య సలహాదారు శ్రీ కోటా శంకరశర్మ మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో 28 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలుంటే ప్రస్తుతం నవ్యాంధ్రలో కేవలం వైఎస్సార్సీపీ నుంచి కోన రఘపతి ఒక్కరే ఉన్నారని, తెలంగాణాలో ఇద్దరు ఉన్నారని గుర్తు చేశారు.