Vishnu Reddy
-
రెండున్నర దశాబ్దాలైనా.. వీడని ఎస్ఎస్సి బంధం
కరీంనగర్: ప్రతీ ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు… చేసే అల్లరి… వారితో కలిసి ఆడిన ఆటలు… చిన్న చిన్న గ్యాంగ్‌లు… అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 26 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ ప్రగతి ఉన్నత పాఠశాల పదవ తరగతి 1996-97 పూర్వ విద్యార్థులు. తిరిగి ఒకే గూటికి చేరిన జ్ఞాపకాలు.. ప్రగతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 26 సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో.. అదే తరగతి గదిలో.. అదే బెంచ్ పై కూర్చుని, వారు ఒకరినొకరు పలకరించుకుంటూ.. కలుసుకోవడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి అధ్యక్షతన జ్యోతి ప్రజల్వను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారి జీవితంలో సాధించిన విజయాలు, కష్టాల గురించి చర్చించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ మాట్లాడుతూ.. వారు చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకొని మరపురాని మధురమైన సంఘటనలను, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకున్నారు. గుర్తుకొస్తున్నాయి.. ఉన్నది కొద్ది గంటలైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ.. ఆనందభాష్పాలతో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నాడు పాఠశాలలో వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను కూడా గుర్తుకు తెచ్చుకొని సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారికి చదువు చెప్పిన గురువులకు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటో ప్రధానం చేశారు. పూర్వ విద్యార్థులను ఉద్దేశించి కరీంనగర్లో స్థిరపడిన అబు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. 26 సంవత్సరాల తర్వాత మనమందరం ఈ విధంగా మనం చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. గడిచిపోయిన కాలాన్ని ఎలాగూ మనం తెచ్చుకోలేమని ఇప్పటినుండి అయినా ఒకరినొకరు మొబైల్ ద్వారా మాట్లాడుకుంటూ.. వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ.. తమ తమ బాగోగుల గురించి మాట్లాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. మనకు చదువు చెప్పిన గురువులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశానికి మనమందరం ఈ విధంగా కలుసుకోవడం మనకు చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి, విద్యార్థులు అబు సత్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణు రెడ్డి, శ్రీనివాస్, అంజనీ ప్రసాద్, కుమార్, సురేష్, వనజ, కళాజ్యోతి, శ్రావణి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
రైడర్‌గా రైజ్..తెరపై క్రేజ్
చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి. నటుడు కావాలనే కోరిక. సినీ రంగంలోకి అడుగు పెట్టాలని, ఓవైపు చదువుకుంటూ మోడలింగ్‌పై దృష్టిసారించాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. బైక్ రైడర్‌గానూ గుర్తింపు పొంది, టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. రైడర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించి... హీరో, విలన్‌గా నటిస్తూ తెరపై దూసుకుపోతున్నాడు నగరవాసి విష్షురెడ్డి. హిమాయత్‌నగర్: విష్షురెడ్డికి చిన్నప్పటి నుంచి బైక్ రైడింగ్ అంటే పిచ్చి. బెంగళూర్‌లో మోడలింగ్ చేస్తుండగా బైక్ రైడింగ్ పోటీల్లో పాల్గొనేవాడు. 2009లో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘జోష్’ సినిమాకు మంచి బైక్ రైడర్ కావాలని వెతికిన డైరెక్టర్... విష్షురెడ్డి గురించి తెలుసుకొని అతనికి అవకాశం ఇచ్చాడు. సినిమా సెకండాఫ్‌లో హీరోతో విష్షురెడ్డి చేసిన బైక్ రైడింగ్ విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. అలా రైడర్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన విష్షురెడ్డి విభిన్న పాత్రలు పోషిస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు. త్వరలో ‘త్రయం’... ‘జోష్’ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించిన విష్షురెడ్డి.. లవ్‌చేస్తే, నీ జతలేక, త్రయం సినిమాల్లో హీరోగా నటించారు. ఇందులో త్రయం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులోనూ బైక్ రైడర్‌గా ప్రేక్షకులను అలరించనున్నాడు. డూప్ లేకుండా బైక్ రైడింగ్ విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ చేశానని చెప్పాడు విష్షురెడ్డి. ఆకాశ్‌తో విలన్‌గా... ఓవైపు హీరోగా నటిస్తూనే విలన్ పాత్రలకూ ఓటేస్తున్నాడు విష్షురెడ్డి. ఇందులో భాగంగా ‘పూరీ కనెక్ట్స్ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘మెహబూబా’ సినిమా నిర్మిస్తున్నాడు. ఇందులో ఆయన తనయుడు ఆకాష్ హీరో కాగా, విష్షురెడ్డి విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినమా దాదాపు పూర్తయిందని చెప్పాడు. అవకాశాలొస్తున్నాయి.. ఇప్పటివరకు చేసిన సినిమాలు నాకు సంతృప్తినిచ్చాయి. బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి. కథలను బట్టి అక్కడా సినిమాలు చేస్తాను. – విష్షురెడ్డి -
నువ్వు నడిచిన దారిలో...
విషురెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ ప్రసాద్ నల్లపాటి నిర్మిస్తున్న ‘నువ్వు నడిచిన దారిలో’ చిత్రం హైదరాబాద్ లోని సాయిబాబా మందిరంలో ప్రారంభమైంది. జరుగుల రామారావు దర్శకుడు. తొలి సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘రెండు విధాలుగా ప్రవర్తించే రెండు ప్రేమ జంటల కథ ఇది. వారి ప్రవర్తన తాలూకు పర్యవసనాలేమిటి? అనేది ప్రధానాంశం. వినోదంతో పాటు చిన్న సందేశం ఉన్న చిత్రం’’ అన్నారు. పల్లె, పట్టణ, నగర ప్రేక్షకులతో పాటు ప్రవాసాంధ్రులను కూడా మెప్పించే విధంగా ఈ చిత్రం ఉంటుందని, మంచి చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం కావడం ఆనందంగా ఉందని ప్రసాద్ తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లోహిత్ మాట్లాడుతూ - ‘‘నిర్మాణ బాధ్యతలు మాత్రమే కాకుండా ఇందులో ఓ మంచి పాత్ర చేస్తున్నాను. బాధ్యతతో కూడిన ప్రేమ, బాధ్యతారహితమైన ప్రేమకు మధ్య గల వ్యత్యాసాన్ని చూపించే చిత్రం’’ అన్నారు. నందు, ఆదర్శ్, ప్రియ, సందీప్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తిరుపతిరెడ్డి, సంగీతం: గణేష్-రాజ్.