Vivek Rae
-
భెల్, ఐవోసీలలో డిజిన్వెస్ట్మెంట్కు ఓకే
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు భెల్, ఐవోసీలలో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు సాధికార మంత్రుల కమిటీ(ఈజీవోఎం) ఆమోదముద్ర వేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఐవోసీలో 10%, భెల్‌లో 5% వాటాను ప్రభుత్వం విక్రయానికి పెట్టనుంది. తద్వారా రూ. 7,300 కోట్లు లభించగలవని ప్రభుత్వం ఆశిస్తోంది. ఐవోసీలో 10% వాటాను ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు 5% చొప్పున విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ధర రూ. 248 వద్ద ఐవోసీ(10%) వాటాకు రూ. 5,300 కోట్లు లభించే అవకాశమున్నట్లు డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి రవి మాథుర్ చెప్పారు. వాటా విక్రయాన్ని ఆఫ్‌మార్కెట్ ద్వారా ప్రభుత్వం చేపట్టనుంది. ఇక భెల్‌లో 5% వాటాను బ్లాక్‌డీల్ ద్వారా ఎల్ఐసీ కొనుగోలు చేయనుంది. ప్రస్తుత ధర రూ. 167 వద్ద భెల్ వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 2,045 కోట్లవరకూ సమకూరవచ్చు. ప్రస్తుతం భెల్‌లో ప్రభుత్వానికి 67.72% వాటా ఉంది. -
ఐఓసీలో 10 శాతం వాటా ఓఎన్జీసీ, ఓఐఎల్ చేతికి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటాల విక్రయం లక్ష్యానికి గడువు దగ్గరపడుతుండటంతో కేంద్రం తన అస్త్రాలకు పదునుపెడుతోంది. ఈ ఏడాది(2013-14) డిజిన్వెస్ట్మెంట్లో తొలిసారిగా బ్లాక్ డీల్ రూపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)లో వాటా విక్రయానికి ఓకే చెప్పింది. 10 శాతం వాటాను(24.27 కోట్ల షేర్లు) ఇతర పీఎస్‌యూ దిగ్గజాలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లకు విక్రయించే ప్రతిపాదనకు సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) గురువారం ఆమోదముద్ర వేసింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4,800-5,000 కోట్లు రావచ్చని అంచనా. ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలో జరిగిన ఈజీఓఎం భేటీలో ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ విలేకరులకు వెల్లడించారు. బ్లాక్ డీల్‌కు సంబంధించి విధివిధానాలను త్వరలోనే కొలిక్కి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఓఎన్జీసీ, ఓఐఎల్ డెరైక్టర్ల బోర్డుల ఆమోదం అనంతరం వచ్చే వారంలో ఐఓసీ వాటా విక్రయ బ్లాక్ డీల్ ఉండొచ్చని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రాయ్ పేర్కొన్నారు. గతేడాది జూన్ 30 నాటికి ఐఓసీలో కేంద్రానికి 78.92 శాతం వాటా ఉంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్లో ఐఓసీ షేరు ధర ఉండాల్సినదానికంటే చాలా తక్కువ స్థాయిలో ఉందని.. అందువల్ల ఇప్పుడు వాటా విక్రయం వల్ల అటు కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి నష్టమేనని పెట్రోలియం శాఖ విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలం(ఆఫర్ ఫర్ సేల్) రూపంలో 10% వాటా అమ్మకాన్ని వాయిదా వేశారు. అయితే, రూ.40 వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి మరో రెండున్నర నెలలే గడువు మిగిలింది. ఇప్పటిదాకా ఏడు పీఎస్‌యూల్లో వాటా విక్రయం ద్వారా రూ. 3,000 కోట్లే లభించాయి. దీంతో చివరకు ఐఓసీలో బ్లాక్ డీల్‌కు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు వివేక్ రాయ్ తెలిపారు. ఇప్పటికే తమకు ఐఓసీలో 8.77 శాతం వాటా ఉందని... ఇప్పుడు విక్రయించే 10% వాటాను ఓఐఎల్, తమ కంపెనీకి సమానంగా విభజించనున్నట్లు ఓఎన్జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవ చెప్పారు. గురువారం బీఎస్ఈలో ఐఓసీ షేరు ధర రూ.3.10(1.48%) లాభపడి రూ.212.05 వద్ద స్థిర పడింది. 52 వారాల గరిష్టస్థాయి రూ.375; కనిష్ట స్థాయి రూ. 186.20గా ఉంది. -
56 చమురు-గ్యాస్ బ్లాక్‌ల వేలం
న్యూఢిల్లీ: భారత్‌లో మళ్లీ పెద్దయెత్తున చమురు-గ్యాస్ బ్లాక్‌ల వేలానికి రంగం సిద్ధమైంది. కొత్త అన్వేషణ లెసైన్సింగ్ విధానం పదో విడత(నెల్ప్-10)లో కనీసం 56 బ్లాక్‌లను వేలం వేయనున్నట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి వివేక్ రే సోమవారమిక్కడ వెల్లడించారు. వచ్చే వారంలో జరగనున్న పెట్రోటెక్ సదస్సులో ఈ క్షేత్రాలకు సంబంధించిన వివరాలను తెలియజేయనున్నామని చెప్పారు. అయితే, వేలంలో బిడ్లకు ఆహ్వాన నోటీసులను ఫిబ్రవరి నెలలో జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకే... చమురు-గ్యాస్ బ్లాక్‌ల కాంట్రాక్టుల విషయంలో సమూలంగా మార్పులు చేసిన నిబంధనలతో ఈ నెల్ప్-10 వేలం ప్రక్రియను చేపడుతున్నట్లు వివేక్ తెలిపారు. ప్రధానంగా ఉత్పత్తి ప్రారంభించిన రోజునుంచే సంబంధిత చమురు-గ్యాస్ బ్లాక్‌ల నుంచి ఎంతపరిమాణంలో ప్రభుత్వానికి ఉత్పత్తిలో ఎంత వాటాను ఆఫర్ చేయనున్నారనేది వేలంలో పాల్గొనే కంపెనీలు తమ బిడ్డింగ్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. అత్యధిక మొత్తంలో చమురు-గ్యాస్ ఉత్పత్తి వాటాను ఆఫర్ చేసే కంపెనీకే బిడ్డింగ్‌లో బ్లాక్‌లు దక్కుతాయని వివేక్ రే వివరించారు. భవిష్యత్తులో చమురు-గ్యాస్ బ్లాక్‌ల కాంట్రాక్టులను అప్పగించే విషయంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి. రంగరాజన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకే ఈ కొత్త నిబంధనలను రూపొందించారు. కాగా, ఇప్పటిదాకా జరిగిన మొత్తం 9 విడతల నెల్ప్ బిడ్డింగ్‌లలో 254 బ్లాక్‌లను వివిధ కంపెనీలకు కేంద్రం కేటాయించింది. కాగ్ అక్షింతల ప్రభావం... ప్రస్తుత నిబంధనల ప్రకారం చమురు కంపెనీలు ప్రభుత్వంతో లాభాలను పంచుకోవడానికి ముందే తమ అన్వేషణ, ఉత్పాదక వ్యయాలను రికవరీ చేసుకునే వీలుంది. అయితే ఈ నిబంధనల వల్ల కంపెనీలు తమ పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచుకునేలా దారితీస్తోందని, ప్రభుత్వానికి రావాల్సిన లాభాల పంపకంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కేజీ-డీ6 క్షేత్రాల్లో ఆడిటింగ్ సందర్భంగా పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచిచూపిందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందంటూ కాగ్ తేల్చిచెప్పింది కూడా. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులకు పెట్రోలియం శాఖ నడుం బిగించింది. పారదర్శకత పెరుగుతుంది... ‘ఇక నుంచి ఉత్పత్తి పంపకం విధానాన్ని కాకుండా ఆదాయాల పంపకం విధానాన్ని అవలంభించాలని మేం ప్రతిపాదిస్తున్నాం. దీనివల్ల ఆదాయాలను ముందే రికవరీ చేసుకోవడం, పెట్టుబడులను పెంచిచూపడం వంటి అంశాలకు ఇక తావుండదు. నెల్ప్-10 నుంచే ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు త్వరలో కేబినెట్ ఆమోదముద్ర కోసం మేం కసరత్తు మొదలుపెట్టాం’ అని వివేక్ వెల్లడించారు. ఈ ఉత్పత్తి ఆధారిత చెల్లింపుల విధానం వల్ల మరింత పారదర్శకతతో పాటు కంపెనీల అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాల్లో తమ జోక్యం కూడా తగ్గుముఖం పట్టేందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విధానాన్ని కొన్ని కంపెనీలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. కొత్త నిబంధనల ఖరారుపై కేబినెట్‌దే తుది నిర్ణయమని వివేక్ పేర్కొన్నారు. -
రిలయన్స్‌పై చట్టబద్ధంగానే చర్యలు
న్యూఢిల్లీ: గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఇచ్చిన స్థలంలో కొంత భాగాన్ని వెనక్కి తీసుకునే అంశంపై చట్టబద్ధంగానే వ్యవహరిస్తామని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే బుధవారం తెలిపారు. ఈ విషయానికి సంబంధించి ఉత్పత్తి పంపక ఒప్పందం (పీఎస్సీ) నిబంధనలకి అనుగుణంగానే చర్యలు తీసుకుంటామన్నారు. సదరు స్థలంలో ఉండే గ్యాస్ నిక్షేపాలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా వెలికి తీయడం ద్వారా దిగుమతుల భారం తగ్గించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని రే చెప్పారు. రిలయన్స్ (ఆర్ఐఎల్), దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్‌తో సుమారు మూడున్నర గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం ఆయన ఈ విషయాలు వివరించారు. ఒకవైపు పీఎస్సీకి కట్టుబడి ఉండటం, మరోవైపు నిక్షేపాలను వెలికి తీసి ఆదాయం ఆర్జించడం ఎలా అన్న రెండు సవాళ్లు ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్నాయన్నారు. నిక్షేపాల అభివృద్ధి ప్రక్రియలో వివిధ దశల డెడ్లైన్లను పలుమార్లు ఉల్లంఘించిన రిలయన్స్ నుంచి స్థలాన్ని వెనక్కి తీసుకోవడమా.. లేక దానికే మరో అవకాశం ఇవ్వడమా అన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోగలదన్నారు. కేజీ-డీ6 బ్లాక్‌లో ఆర్‌ఐఎల్‌కి 7,645 చ.కి.మీ. కేటాయించగా.. అందులో నిక్షేపాలు వెలికితీయని 6,601 చ.కి.మీ. స్థలాన్ని కంపెనీ వెనక్కి ఇచ్చేయాలని డెరైక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) చెబుతోంది. అయితే, తమకు మరింత సమయం ఇవ్వాలని.. గ్యాస్, చమురు నిక్షేపాలు కనుగొన్న 3,412 చ.కి.మీ. స్థలాన్ని అట్టే పెట్టుకునేందుకు అనుమతించాలంటూ రిలయన్స్ కోరుతోంది. -
పెట్రోల్ ధరను రూ.1 నుంచి రూ.1.50 తగ్గించే అవకాశం