భెల్, ఐవోసీలలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఓకే | Government clears IOC, Bhel stake sale; to get over Rs 7300 crore | Sakshi
Sakshi News home page

భెల్, ఐవోసీలలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఓకే

Published Sat, Mar 1 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

భెల్, ఐవోసీలలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఓకే

భెల్, ఐవోసీలలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఓకే

న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు భెల్, ఐవోసీలలో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు సాధికార మంత్రుల కమిటీ(ఈజీవోఎం) ఆమోదముద్ర వేసింది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ఐవోసీలో 10%, భెల్‌లో 5% వాటాను ప్రభుత్వం విక్రయానికి పెట్టనుంది. తద్వారా రూ. 7,300 కోట్లు లభించగలవని ప్రభుత్వం ఆశిస్తోంది. ఐవోసీలో 10% వాటాను ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలకు 5% చొప్పున విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ధర రూ. 248 వద్ద ఐవోసీ(10%) వాటాకు రూ. 5,300 కోట్లు లభించే అవకాశమున్నట్లు డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి రవి మాథుర్ చెప్పారు.

 వాటా విక్రయాన్ని ఆఫ్‌మార్కెట్ ద్వారా ప్రభుత్వం చేపట్టనుంది.  ఇక భెల్‌లో 5% వాటాను బ్లాక్‌డీల్ ద్వారా ఎల్‌ఐసీ కొనుగోలు చేయనుంది. ప్రస్తుత ధర రూ. 167 వద్ద భెల్ వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 2,045 కోట్లవరకూ సమకూరవచ్చు. ప్రస్తుతం భెల్‌లో ప్రభుత్వానికి 67.72% వాటా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement