vk saraswath
-
బూతు సినిమాలు చూడటానికే ఇంటర్నెట్..
సాక్షి, ముంబై : జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని యువత దర్టీ మూవీస్ (బూతు సినిమాలు) చూడటానికే ఇంటర్నెట్ను ఉపయోగిస్తారని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో దేశానికి ఎలాంటి ఆర్థిక నష్టాలు లేవని అన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం అసలు విషయమే కాదు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో వచ్చే తేడా ఏమిటి? అక్కడ ఇంటర్నెట్లో ఏం చూస్తారు? బూతు సినిమాలు చూడటం తప్ప అక్కడ యువత ఏం చేస్తారు?’’ అని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వదంతులు వ్యాప్తి కాకుండా ఉండేందుకే అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని సారస్వత్ స్పష్టం చేశారు. (జమ్మూ కశ్మీర్లో మొబైల్ సేవల పునరుద్ధరణ) రాజకీయ నాయకులు కశ్మీర్లో ఢిల్లీ తరహా నిరసనలను సృష్టించి, వాటికి సోషల్ మీడియా ద్వారా మరింత ఆజ్యం పోయడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఆగస్ట్ 5 నుంచి కశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. సంఘ వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్ను దుర్వినియోగం చేస్తున్నాయని, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇంటర్నెట్ను వాడుతున్నాయని సమాచారం అందడంతో తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. అనంతరం పలువురు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. -
సైన్స్‌తోనే క్వాలిటీ లైఫ్!
ఉప్పల్ : సైన్స్ తో పాటు టెక్నాలజీని కూడా అభివృద్ధి చేసుకుంటేనే పరిశోధన సంస్థలు పేరు తెచ్చుకుంటాయని పద్మభూషణ్ వీకే సరస్వత్ అన్నారు. ఉప్పల్‌లోని భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) 55వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైన్స్ ద్వారానే క్వాలిటీ లైఫ్ అందుతుందన్నారు. పాత రాతి యుగం నుండి నేటి వరకు మానవుడు అంచెలంచెలుగా ఎదగడానికి సన్సే కారణమన్నారు. అయితే, సైన్స్‌తో పాటు మానవ మనుగడకు హాని కలిగించే అంశాలు కూడా సమాంతరంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నీటి సమస్యతో పాటు ఆహారోత్పత్తుల సమస్య కూడా పెరుగుతుందని, వీటిని అదిగమించడానికి సైన్స్ తోడ్పడేవిధంగా పరిశోధనలు జరగాలని సూచించారు. ప్రకృతి విపత్తుల వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని టెక్నాలజీ ద్వారానే అధిగమించవచ్చని సూచించారు. ప్రతి నిమిషంలో 30 మంది పట్టణాలకు వలస వస్తున్నారని దీని వల్ల పట్టణాలలో జనాభా అంతకంతకు పెరిగిపోతుందన్నారు. వీటన్నింటిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు మరిన్నీ పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంధన కొరతలను అధిగమించాలని సూచించారు. ఎన్జీఆర్ఐ డెరైక్టర్ వీఎం తివారీ మాట్లాడుతూ ఎన్జీఆర్ఐ జరిపిన పరిశోధన ఫలితాలను, అభివృద్ధిని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ సీహెచ్ మోహన్‌రావు, భాస్కర్‌రావు, సిస్మాలజీ హెచ్‌వోడీ సీనియర్ సైంటీస్ట్ నగేష్, షకీల్ ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు.