vv giri
-
ఆ రాష్ట్రపతి సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? కేసు పూర్వపరాలేమిటి?
ఆ రోజు సుప్రీం కోర్టులో ఆసక్తికర వాతావరణం నెలకొంది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ఏం జరగనున్నదోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ రోజు జరిగే ఒక ప్రత్యేక కేసు విచారణలో సాక్ష్యం చెప్పేందుకు ఒక ప్రముఖ వ్యక్తి హాజరుకావాల్సి ఉంది. ఆ ప్రముఖుని కోసం ఒక సోఫాను హాలులో ఏర్పాటు చేశారు. సాక్షి కోసం సుప్రీంకోర్టు డాక్లో సోఫాను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి, చివరిసారి. నిజానికి ఆ రోజు సుప్రీంకోర్టు నిర్ణయాలను రద్దు చేసే అధికారం కలిగిన వ్యక్తి స్వయంగా సాక్ష్యం చెప్పేందుకు రాబోతున్నారు. అతనే దేశ నాల్గవ రాష్ట్రపతి వివి గిరి... ఆరోజు ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మపూర్ బార్ కౌన్సిల్ సభ్యునిగా.. సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా దేశాధ్యక్ష్య పదవిలో ఉంటూ, ఆయనే స్వయంగా వాంగ్మూలం ఇవ్వడానికి రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆ తర్వాత సుప్రీంకోర్టులో మళ్లీ అలాంటి దృశ్యం కనిపించలేదు. అది 1970వ సంవత్సరం. చట్టపరమైన మినహాయింపు ఉన్నప్పటికీ, అప్పటి రాష్ట్రపతి వివి గిరి కోర్టుకు హాజరై, తన వాంగ్మూలాన్ని వినిపించారు. భారత నాల్గవ రాష్ట్రపతి అయిన వీవీ గిరి 1894 ఆగస్టు 10న ఒరిస్సాలోని బ్రహ్మపూర్‌లో జన్మించారు. అతని తండ్రి వివి జోగయ్య పంతులు న్యాయవాది. భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీల సభ్యుడు. వీవీ గిరి 1913లో న్యాయశాస్త్రం అభ్యసించేందుకు ఐర్లాండ్ వెళ్లారు. తరువాత్ భారత్ తిరిగివచ్చి బ్రహ్మపూర్ బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు. తాత్కాలిక రాష్ట్రపతిగా నియామకం దేశ నాల్గవ రాష్ట్రపతి వివి గిరి కార్మికనేతగానూ పేరుగాంచారు. 1928లో ఆయన నాయకత్వంలో రైల్వే కార్మికుల అహింసాయుత సమ్మె జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం, రైల్వే యాజమాన్యం కార్మికుల డిమాండ్లను అంగీకరించవలసి వచ్చింది. స్వాతంత్య్ర ఉద్యమంలో కార్మిక సంఘాలను భాగస్వాములను చేసిన ఘనత కూడా వివి గిరికి దక్కుతుంది. కాగా దేశ మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 1969 మే 13న మరణించారు. అనంతరం వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ సిండికేట్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందిరా గాంధీ వ్యతిరేకతను పట్టించుకోకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా నీలం సంజీవ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు సిండికేట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇందిరా గాంధీ.. వివి గిరికి మద్దతు ప్రకటించారు. 1969 ఆగస్టు 16న జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో నీలం సంజీవ రెడ్డి, వివి గిరి, ప్రతిపక్ష అభ్యర్థి సీడీ దేశ్‌ముఖ్ మధ్య పోటీ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో వివి గిరి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యతలో ఆయనకు 48 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఆయనకే మెజారిటీ వచ్చింది. అయితే వీవీ గిరి ఎన్నిక చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు తప్పుడు పద్ధతులను ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నారు. భారతరత్నతో సత్కారం ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్రపతి వీవీ గిరి స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై సాక్షిగా విచారణలో పాల్గొన్నారు. చివరకు సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించి, వీవీ గిరి ఎన్నికను సమర్థించింది. వీవీ గిరి 1969 ఆగస్టు 24 నుంచి 1974 ఆగస్టు 24 వరకూ రాష్ట్రపతి పదవిని చేపట్టారు ఆయన తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి అయ్యారు. 1975లో వీవీగిరి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. వీవీ గిరి తన 85 సంవత్సరాల వయస్సులో 1980 జూన్ 24న మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) మరణించారు. ఇది కూడా చదవండి: ఆ ఒక్క జవాను.. పాక్ ఆశలను పటాపంచలు చేశాడు! -
మహోజ్వల భారతి: విదేశం బహిష్కరించిన తెలుగు వీరుడు
తెలుగు వీరుడు: వి.వి.గిరిగా ప్రసిద్ధులైన వరాహగిరి వేంకటగిరి భారతదేశ నాల్గవ రాష్ట్రపతి. మన తెలుగువారు! నేడు ఆయన జయంతి. 1894 ఆగస్టు 10న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్‌లో జన్మించారు. వి.వి.గిరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య, తల్లి సుభద్రమ్మ. వెంకట జోగయ్య ప్రసిద్ధి చెందిన న్యాయవాది. తూర్పుగోదావరి జిల్లాలోని చింతల పూడి నుండి బరంపురానికి ఈ కుటుంబం వలస వెళ్లింది. వి.వి.గిరి 1913 ఐర్లండ్‌లోని డబ్లిన్ యూనివర్శిటీ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లారు. ఐర్లండ్‌లో ‘సీన్‌ఫెన్’ జాతీయోద్యమంలో పాల్గొని ఆ దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఆ ఉద్యమ కాలంలోనే ఆయనకు ఈమొన్ డి వలేరా, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్నీల్, జేమ్స్ కాన్నలీ వంటి రాజకీయ ఉద్యమనేతలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇండియా తిరిగి వచ్చాక ఇక్కడ క్రియాశీలకంగా ఉన్న కార్మిక ఉద్యమంలో పాల్గొన్నారు. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పని చేశారు. అనంతరం 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యారు. 1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచారు. 1937లో మద్రాసు ప్రావిన్స్‌లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1942లో దేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసిన ప్పుడు, వి.వి. గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్లారు. 1975లో వి.వి.గిరికి భారత ప్రభుత్వం ‘భారత రత్న’ అవార్డు ప్రదానం చేసింది. ప్రసన్న కవి ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ రచయిత. నేడు ఆయన జయంతి. 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించారు. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారు. భుక్తి కోసం ఎన్నో పనులు చేశారు. హోటలు సర్వరుగా, రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేశారు. ‘ఆంధ్ర పత్రిక’లో ప్రూఫ్ రీడర్‌గా, పాఠశాల ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా కూడా చేశారాయన. మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, ‘బలిదానం’ అనే కావ్యం రాశారు. అది ఎంతో మందిని కదిలించింది. కన్నీరు తెప్పించింది. సుందరాచారికి అమితమైన ఆత్మగౌరవం. దాని కోసం ఉద్యోగాలు కూడా వదులుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో నిర్లిప్త జీవితం గడిపారని అంటారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో సుందరాచారి జ్ఞాపకార్థం ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అని కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు. (చదవండి: స్వతంత్ర భారతి: మిస్ వరల్డ్ మానుషి) -
అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరో తెలుసా?
దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం.. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జ్ఞానీ జైల్ సింగ్ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. ఆర్. వెంకట్రామన్ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. శంకర్‌దయాళ్ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్‌గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. అంతకుముందు ఆమె రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్ హయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమైంది. దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అంతకుముందు బిహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!) -
మహోజ్వల భారతి: బొబ్బిలిపై గెలిచారు!
వి.వి.గిరిగా ప్రసిద్ధులైన వరాహగిరి వేంకటగిరి భారతదేశ నాల్గవ రాష్ట్రపతి. మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణంలోని వరాహగిరి వెంకట జోగయ్య, సుభద్రమ్మ దంపతులకు ఒక తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబములో 1894 ఆగస్టు 10 న జన్మించారు. తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధి చెందిన న్యాయవాది. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి బరంపురానికి వలస వెళ్లారు. వి.వి.గిరి 1913లో డబ్లిన్‌లోని యూనివర్శిటీ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లారు. కానీ ఐర్లండ్ లో సీన్‌ఫెన్ ఉద్యమంలో పాల్గొని దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఆ ఉద్యమకాలంలోనే ఆయనకు ఈమొన్ డి వలేరా, మైఖెల్ కోలిన్స్, పాట్రిక్ పియర్సె, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్నీల్, జేమ్స్ కాన్నలీ తదితర రాజకీయ ప్రముఖులతో సన్నిహితం ఏర్పడింది. భారతదేశం తిరిగివచ్చిన తర్వాత ఇక్కడి కార్మిక ఉద్యమాలలో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యారు. రెండుసార్లు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యారు. 1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచారు. 1937లో మద్రాసు ప్రావిన్స్‌లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1942లో కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినప్పుడు, గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్లారు. రాజమండ్రి జైలులో ఖైదీగా ఉన్నారు. 1969లో భారత రాష్ట్రపతి అయ్యేవరకు.. ఉపరాష్ట్రపతిగా, మైసూరు రాష్ట్ర గవర్నరుగా; కేరళ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్‌గా, మద్రాసు ప్రెసిడెన్సీలో కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రిగా ఆ పదవులకు వన్నె తెచ్చారు. 1980 జూన్ 24న 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. (చదవండి: చైతన్య భారతి: అనితా దేశాయి ) -
మధ్యంతర ఎన్నికల్లో ఇందిర ప్రభంజనం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో చీలిక తరువాత 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరా గాంధీ దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా ఆవిర్భవించారు. ఇందిరా గాంధీ హవా ఢిల్లీలోని ఏడు సీట్లపై పడింది. ఏడింటికి ఏడు స్థానాలను ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ గెలుచుకుంది. 1967 లోక్‌సభ ఎన్నికల నాటికి ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్‌ల మధ్య నాయకత్వం కోసం కొనసాగిన పోరు ఆ తరువాత జరిగిన రాష్ట్రపతి ఎన్నికల నాటికి పతాకస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ ఇందిరా గాంధీ మాత్రం అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న వీవీ గిరి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆత్మప్రబోధంతో ఓటు వేయాలని ఎంపీలను కోరారు. ఈ ఎన్నికల్లో వీవీ గిరి గెలిచారు. దీంతో కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ రెండుగా చీలిపోయింది. సీనియర్ కాంగ్రెస్ నేతలు పలువురు మొరార్జీ దేశాయ్ వెంట పాత కాంగ్రెస్‌లో ఉండిపోయారు. ఇందిరా గాంధీ నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ఏర్పాటైంది. గరీబీ హటావో నినాదంతో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికల శంఖారావం పూరించారు. ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 441 స్థానాల్లో పోటీచేయగా 342 సీట్లు గెలిచింది. పాత కాంగ్రెస్ 238 స్థానాలలో పోటీచేసి 16 సీట్లు మాత్రమే గెలుచుకుంది. రెండు కాంగ్రెస్‌ల మధ్య జరిగిన పోటీలో జన్‌సంఘ్ కూడా దెబ్బతింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలకు 64 మంది అభ్యర్థులు తలపడ్డారు. ఇందిరా గాంధీ నిలబెట్టిన అభ్యర్థులు ఆమె పేరు బలంపైనే గెలిచారు. ఢిల్లీలోని ఏడు స్థానాలలో సికిందర్ భఖ్త్, రాజేష్ శర్మ, శాంతిదేశాయ్, పి.కె. చందాలా వంటి నేతలు పాత కాంగ్రెస్‌లో ఉండిపోయారు. బ్రహ్మ ప్రకాశ్ రాజకీ యాలకు దూరంగా ఉండిపోయారు. కొత్త కాంగ్రెస్ నిలబెట్టిన కొత్త నేతలు అన్ని స్థానాలలో గెలిచి తొలిసారి ఎంపీలయ్యారు. ఈ ఎన్నికలలో ఢిల్లీ నుంచి ఇద్దరు మహిళలు పార్లమెంటు సభ్యులయ్యారు. సుభద్రా జోషీ చాందినీ చౌక్ నుంచి, ముకుల్ బెనర్జీ న్యూఢిల్లీ నుంచి గెలిచారు. అంతకు ముందు ఇతర చోట్ల నుంచి లోక్‌సభ ఎన్నికలలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సుభద్రా జోషీకి చాందినీ చౌక్ టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు వ్యతిరేకించినప్పటికీ ఆమె సికిందర్ భఖ్త్ వంటి సీనియర్ నేతను ఓడించి ఇందిరా ప్రభంజనాన్ని చాటిచెప్పారు. సౌత్ ఢిల్లీలో న్యాయవాది శశిభూషణ్ జన్‌సంఘ్ నేత బల్రాజ్ మధోక్ని ఓడించారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి హెచ్‌కేఎల్ భగత్ తొలిసారి ఎంపీగా గెలిచి తరువాతి రోజుల్లో ఢిల్లీలో బలమైన కాంగ్రెస్ నేతగా ఎదిగారు. సదర్ నుంచి అమర్నాథ్ చావ్లా, ఔటర్ ఢిల్లీ నుంచి దీలీప్ సింగ్, కరోల్ బాగ్ నుంచి టి. సోహన్‌లాల్ గెలిచారు.