Wage payment
-
బెంగళూరులో ఎక్కువ వేతనాలు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేతన చెల్లింపులకు రాజధానిగా బెంగళూరు తన స్థానాన్ని కాపాడుకుంది. అలాగే, అత్యధిక పారితోషికాలు ఐటీ రంగంలో ఉన్నట్టు రాండ్‌స్టాడ్ ‘ఇన్సైట్స్ శాలరీ ట్రెండ్స్ 2019’ నివేదిక వెల్లడించింది. బెంగళూరులో జూనియర్ స్థాయి ఉద్యోగిపై కంపెనీ వార్షికంగా చేస్తున్న సగటు వ్యయం (సీటూసీ) రూ.5.27 లక్షలుగా ఉంటే, మధ్య స్థాయి ఉద్యోగిపై ఇది రూ.16.45 లక్షలు, సీనియర్ లెవల్ ఉద్యోగిపై రూ.35.45 లక్షలుగా ఉంది. ఈ సంస్థ రూపొందించిన 2018, 2017 నివేదికల్లోనూ అత్యధిక వేతనాలున్న నగరంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. జూనియర్ లెవల్ ఉద్యోగులకు అధికంగా చెల్లింపులున్న రెండో నగరంగా హైదరాబాద్ చోటు సంపాదించింది. ఇక్కడ సగటు సీటూసీ రూ.5లక్షలు. రూ.4.59 లక్షలతో మూడో స్థానంలో ముంబై నగరం ఉంది. మధ్య స్థాయి ఉద్యోగులకు అధికంగా చెల్లిస్తున్న నగరాల్లో ముంబై రూ.15.07 లక్షలతో రెండో స్థానంలో, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) రూ.14.5 లక్షలతో మూడో స్థానంలో ఉన్నాయి. -
నోట్ల రద్దు: కేంద్రం మరో కీలక నిర్ణయం
ఇక చెక్కులు లేదా బ్యాంకుల ద్వారానే జీతాల చెల్లింపు కీలక ఆర్డినెన్స్ జారీచేసిన కేంద్రం న్యూఢిల్లీ: నోట్ల రద్దు కష్టాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు బ్యాంకులు లేదా చెక్కుల ద్వారా నేరుగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు వీలుగా వేతనాల చెల్లింపు చట్టం-1936లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీచేసింది. పలు పరిశ్రమలు తమ ఉద్యోగులకు జీతాలు నేరుగా బ్యాంకులు లేదా, చెక్కుల ద్వారా చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి వేతనాల చెల్లింపు (సవరణ) బిల్లు -2016ను ఈ నెల 15న లోక్‌సభలో ప్రవేశపెట్టిందని, వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇది ఆమోదం పొందే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ రెండు నెలలు ఆగడం వల్ల ఉద్యోగులకు జీతాలు పొందడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశముండటంతో ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆ వర్గాలు చెప్పాయి. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ప్రభుత్వం అత్యవసర విషయాల్లో ఆర్డినెన్స్‌లు జారీచేసి.. వాటిని ఆరునెలల్లోపు పార్లమెంటులో ఆమోదింపజేసే విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ పద్ధతిలో నేరుగా ఉద్యోగుల ఖాతాలకు జీతాలు బదిలీ చేయడం లేదా చెక్కు ద్వారా జీతాలు అందించేందుకు వీలుగా వేతనాల చెల్లింపు చట్టంలోని సెక్షన్ 6లో ప్రభుత్వం సవరణలు తీసుకువస్తున్నది. -
కూలీ సొమ్ము కోసం ఆందోళనలు
పెదబయలు, న్యూస్‌లైన్: గత ఏడాది చేసిన పనులకు కూలీ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఉపాధి కూలీలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉపాధి కార్యాలయానికి తాళం వేసి సిబ్బందిని ఐదు గంటల పాటు నిర్బంధించారు. గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బొండా సన్నిబాబు మాట్లాడుతూ ఉపాధి పనులు చేసి 8 నెలలు గడుస్తున్నా సొమ్ము చెల్లించకపోవడం దారుణమన్నారు. కూలీ సొమ్ము కోసం ధర్నాలు, ర్యాలీలు చేయాల్సిన దుస్థితి నెలకొం దని ఆవేదన చెందారు. ఫినో సిబ్బంది ద్వారా సొమ్ము అందిస్తామని చెప్పిన అధికారులు కాలయాపన చేస్తున్నారని చెప్పారు. దీనిపై ఏపీవో ధనుంజయ్ స్పందిస్తూ కూలీలకు రూ.67 లక్షలు చెల్లించాల్సి ఉంద న్నారు. మూడు రోజుల్లో రూ.15 లక్షలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఉపాధి కూలీలు శాంతించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కిల్లో శరభన్న, కోమటి, పరశురాం తదితరులు పాల్గొన్నారు. అరకులోయలో... అరకు రూరల్: బకాయి ఉన్న ఉపాధి కూలీ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు శుక్రవారం భారీ ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలు వంతాల పూర్ణ (చినలబుడు సర్పంచ్), గొల్లూరి రాజు, సొనాయి కృష్ణారావు, సీపీఎం నేత పొద్దు బాలదేవ్ ల ఆధ్వర్యంలో కూలీలు ఉపాధి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఫినో సంస్థ మండల కో-ఆర్డినేటర్లు, ఉపాధి ఏపీఎంలను నిర్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఉపాధి కూలీలకు సుమారు రూ.కోటిన్నర చెల్లించాల్సి ఉందన్నారు. తక్షణం సొమ్ము పంపిణీ చేయాలని కోరుతూ ఫినో సంస్థ మండల కో-ఆర్డినేటర్లను నిలదీశారు. వారి వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కార్యాలయంలోనికి వెళ్లనివ్వకుండా నిర్బంధించారు. ఈ నెల 28లోగా బకాయి సొమ్ము మొత్తం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారిని విడిచిపెట్టారు.