Waking
-
చలికాలంలో ఎందుకంత నిద్రమత్తు? నిపుణులు చెప్పే సమాధానం ఇదే..
చల్లగా ఉండే శీతాకాలంలో వెచ్చగా దుప్పటి కప్పుకుని మరింతసేపు పడుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. అటువంటప్పుడు బద్ధకం ఎక్కువై ఉదయాన్నే నిద్ర లేవడం కష్టమవుతుంది. ఇది దినచర్యను ప్రభావితం చేస్తుంది. అయితే చలికాలంలో మనం ఎందుకు ఎక్కువసేపు నిద్రపోతామో మీకు తెలుసా? ఎందుకు ఇలా బద్ధకం ముంచుకొస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీనికి కారణం చల్లని వాతావరణమే కారణం అనుకుంటే.. అదొక్కటే సరైన కారణం కాదు.డి విటమిన్ లోపంశీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువసేపు ఉంటుంది. పగటి సమయం తక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఫలితంగా బద్ధకంతో పాటు అధిక నిద్ర మొదలవుతుంది. ఇవేకాకుండా శీతాకాలంలో అధిక నిద్రకు అనేక కారణాలున్నాయి.మెలటోనిన్ హార్మోన్ పెరుగుదలశీతాకాలపు రాత్రులలో తగినంతగా నిద్ర పోయిన తరువాత కూడా బద్ధకం ఆవరిస్తుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం శీతాకాలంలో శరీరంలో మెలటోనిన్ హార్మోన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఈ మెలటోనిన్ అధిక సమయం నిద్రకు కారణంగా నిలుస్తుంది. మెలటోనిన్ హార్మోన్ అధికంగా పెరగడం వల్ల మన నిద్రలో ఆటంకాలు ఏర్పడతాయి. ఈ కారణంగా కొంతమందికి రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది.మెలటోనిన్ హార్మోన్ శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. దీనివలన నిద్ర వస్తుంది. బయటి కాంతి తగ్గినప్పుడు ఇది నిద్రపోయే సమయం అనే సంకేతాన్ని మెదడుకు అందిస్తుంది. శీతాకాలంలో తక్కువ కాంతి కారణంగా మెలటోనిన్ ప్రభావం చాలాసేపు కొనసాగుతుంది. అందుకే చలికాలంలో ఉదయంపూట అధిక సమయం నిద్రపోతుంటాం.బాడీ టైమ్ టేబుల్ అస్తవ్యస్తంమనిషికి నిద్ర అలవాటు సిర్కాడియన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సిర్కాడియన్ ప్రక్రియ అంటే మన శరీరానికి సంబంధించిన అంతర్గత సమయ పట్టిక. ప్రతి కణం నియమిత తీరులో దాని పనిని అది చేస్తుంటుంది. కొన్ని అంశాలు మన సిర్కాడియన్ను అంటే మన జీవ గడియారాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో పర్యావరణం, ఉష్ణోగ్రత, సూర్యకాంతి వంటి మొదలైన అంశాలు ఉన్నాయి. మారుతున్న వాతావరణం కూడా సర్కాడియన్ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మన జీవ గడియారంలో స్వల్ప మార్పులు ప్రారంభమవుతాయి. శీతాకాలంలో నిద్రపోయే సమయాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మనకు ఎక్కువసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది.శరీరానికి వెచ్చదనాన్ని అందించడంచలి పెరిగినప్పుడు వెచ్చగా ఉండటానికి మనం ఉన్ని దుస్తులను ధరిస్తాం. చాలా చల్లని లేదా చాలా వేడి ఉష్ణోగ్రతలు శరీరంపు సహజ నిద్ర ప్రక్రియకు అంతరాయం కలిగిస్తాయి. వెచ్చదనాన్ని అందించే దుస్తులు నిద్ర ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా మరింతసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది.అతిగా ఆహారం తీసుకోవడంచలికాలంలో చాలామంది అతిగా ఆహారాన్ని తీసుకుంటారు. ఇది జీర్ణ వ్యవస్థ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా బద్దకంగా అనిపించి, మరింత సేపు నిద్రపోతుంటాం. శీతాకాలంలో వెచ్చదనం కోసం చాలామంది నాన్ వెజ్ తింటుంటారు. ఈ నాన్‌వెజ్‌ను జీర్ణం చేసుకునేందుకు జీర్ణవ్యవస్థ ఇబ్బంది పడుతుంది. చలికాలంలో అధికంగా తినడం పలు అనారోగ్యం సమస్యలకు దారితీస్తుంది.అధిక నిద్రను ఎలా నివారించాలి?చలికాలంలో వ్యాయామం చేయకపోవడం, వేపుడు పదార్థాలు తినడం, అస్తవ్యస్తమైన జీవనశైలి, బలహీనమైన రోగనిరోధక శక్తి, జలుబు, ఫ్లూ వంటివి కూడా అధిక నిద్రకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. అధిక నిద్రను నివారించడానికి పగటిపూట వీలైనంత ఎక్కువ సమయం సూర్యరశ్మిలో ఉండే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట నిద్రపోకుండా ఉండటానికి నిత్యం బిజీగా ఉండేందుకు ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు.చలికాలంలో రాత్రి భోజనంలో అధికంగా తినడం మానుకోవాలని, ఆకు కూరలు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవద్దని చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు నీరు తాగితే, ఉదయం నిద్ర లేవడం సులభం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం- మేల్కొనడం వల్ల శరీర గడియారం క్రమపద్ధతికి అలవాటు పడుతుంది. నిద్రలేచిన వెంటనే స్నానం చేయండి. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిచడంతో పాటు చురుకుదనాన్ని అందిస్తుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
అర్థరాత్రుళ్లు.. ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా? దీనివల్లే కావొచ్చు
కొంతమందికి ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంది. మరికొందరికి ఎంత ప్రయత్నించినా ఓ పట్టాన నిద్రపట్టదు. మరికొందరు నిద్రలేమి సమస్యతో తెగ ఇబ్బంది పడతారు. ఇంకొందరు అర్థరాత్రుళ్లు 1-4 గంటల మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు మేలుకుంటారు. ఆ తర్వాత ఎంత నిద్రపోదాం అని ప్రయత్నించినా నిద్రపట్టదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. రాత్రి పడుకున్నామంటే తెల్లారే వరకు లేవకూడదు. అలా అయితేనే మంచి నిద్ర పట్టినట్లు. నిద్రలో పదేపదే మెలకువ వస్తే వారు జాగ్రత్త పడాల్సిందే. అర్థరాత్రుళ్లు మనం లేచే సమయాన్ని బట్టి మనం ఏ విషయం గురించి ఆందోళన చెందుతున్నామో ఇట్టే తెలుసుకోవచ్చట. అర్థరాత్రి 1 గంటలకు.. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో సాధారణంగా గాఢ నిద్రలో ఉంటారు. కానీ ఆ సమయంలో నిద్రలేస్తున్నారంటే.. మీరు మానసికంగా చాలా స్ట్రెస్‌లో ఉన్నట్లు అర్థం. 2 గంటలకు.. ఈ సమయంలో నిద్రలేస్తున్నారంటే.. మీ శరీరం చాలా అలిసిపోతుందని, దానికి కాస్త రెస్ట్ అవసరమని గ్రహించాలి. దీనికోసం ఎక్సర్సైజ్, మంచి డైట్ వంటివి రెగ్యులర్ రొటీన్లో అలవాటు చేసుకోవాలి. 3 గంటలకు.. తెల్లవారుజామున 3 గంటలకు మెలవకువ వస్తుందంటే కాస్త భయానకంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయాన్ని డెవిల్స్ అవర్ అని పిలుస్తారు. ఈ సమయంలో ఆత్మలు కలలోకి వస్తాయని కొందరి విశ్వాసం. అయితే మరికొందరు పరిశోధకులు మాత్రం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేవడం మంచిదని సూచిస్తున్నారు. ఇది ధ్యానం చేయడానికి సరైన సమయంగా చెబుతున్నారు. ఎంత త్వరగా పడుకుంటే అంత త్వరగా నిద్రలేవొచ్చు అని, కాబట్టి ఇది ఒక రకంగా మంచిదే అంటున్నారు. రాత్రి 3.30 నిమిషాలు ఈ సమయంలో నిద్ర లేస్తున్నారంటే మీరు మంచి అభివృద్ది పథంలో కొనసాగుతున్నట్లు అర్థమట. ఈ సమయంలో దేవతలు సంచరిస్తుంటారనే విశ్వాసం కూడా ఉంది. తెల్లవారుజామున 4గంటలకు.. తెల్లవారుజామున 4 గంటలకు ఉలిక్కి పడి లేస్తున్నారంటే మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు అర్థం. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, చాలా నిరాశతో ఉన్నట్లు ఈ సమయం సూచిస్తుందట. ఉదయం 4.30 గంటలకు.. ఈ సమయంలో మీరు మేల్కొనడం మంచిదే అని పరిశోధనల్లో వెల్లడైంది. చాలా పాజిటివ్ మైండ్‌తో జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలకు విశ్వం మీకు మార్గనిర్దేశం చేస్తుందని కొందరి నమ్మకం. ఉదయం 5గంటలకు.. అకస్మాత్తుగా 5 గంటలకు తరచూ లేస్తున్నారంటే జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్యల వల్ల కావొచ్చట. సాయంత్రం వేళల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఇందుకు కారణం. అంతుకే నైట్ టైం లైట్ ఫుడ్‌ను తీసుకోవాలి. ఇలాంటి వాళ్లు రాత్రి 7 గంటలు లేదా అంతకంటే ముందే భోజనాన్ని తినేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. -
కారు దిగి కాలినడకన..
అరకిలోమీటరు దూరం నడిచిన డీఐజీ రైలు గేటు పడడంతో ఎస్పీ కార్యాలయం దారిలో వాకింగ్.. సాక్షి, కామారెడ్డి : డీఐజీ అకున్ సబర్వాల్.. కామారెడ్డిలో సుమారు అరకిలోమీటరు దూరం వాకింగ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించడానికి మంగళవారం ఆయన జిల్లాకు వచ్చారు. ఆయన రాక నేపథ్యంలో పట్టణ శివారు నుంచే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఎస్పీ కార్యాలయం దారిలో రైలు వస్తుండడంతో గేట్‌మన్ గేటు వేశారు. గేటు తీయడానికి పది నిమిషాల వరకు సమయం పట్టే అవకాశం ఉండడంతో డీఐజీ కారు దిగి నడవడం ప్రారంభించారు. పట్టాలు దాటిన తర్వాత అవతలి వైపు ఉన్న ఎస్సై ఒకరు తన బుల్లెట్ వాహనాన్ని ఇవ్వబోగా వారించి కాలినడకనే ముందుకు సాగారు. సుమారు అర కిలోమీటరు నడిచిన తర్వాత రైల్వేగేటు ఎత్తడంతో డీఐజీ కారు వచ్చింది. దానిలో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. -
ఉదయాన్నే కాఫీ అంత మంచిది కాదు..
కొత్త పరిశోధన మనలో చాలామందికి కాఫీతో దినచర్య మొదలుపెట్టే అలవాటు ఉంటుంది. పొద్దున్న నిద్రలేవగానే కాఫీ పడకుంటే బండి కదలదనేంతగా ఆ అలవాటు ఉంటుంది. కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నా, ఉదయాన్నే కాఫీ తీసుకోవడం మాత్రం అంత మంచిది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాఫీ తీసుకోవడానికి ఉదయం అంత సానుకూలమైన సమయం కాదని, పొద్దున్నే ఏదైనా కడుపులో పడేసుకున్న తర్వాత కాసేపటికి కాఫీ తీసుకుంటే ఫర్వాలేదని అంటున్నారు. యూట్యూబ్ సైన్స్ చానల్ ‘ఏఎస్ఏపీ సైన్స్’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కాఫీ తీసుకునేందుకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు తగిన సమయమని తేల్చారు. ఉదయం నిద్రలేస్తూనే శరీరంలో కార్టిసాల్ విడుదల అధిక స్థాయిలో ఉంటుందని, అలాంటి సమయంలో కాఫీకి దూరంగా ఉండటమే మేలని ఈ నిపుణులు చెబుతున్నారు.