wastage scrap
-
ప్రభుత్వ కార్యాలయాల్లోని ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు ఏర్పాట్లు
-
మిస్ థాయ్‌లాండ్ ధరించిన ఈ డ్రెస్ వేటితో తయారు చేశారో తెలుసా..?
అందాల పోటీ అంటేనే గుర్తొచ్చేది వారు ధరించే దుస్తులు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో మోడల్స్ రకరకాల దుస్తులు ధరిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనే యువతులు అందం, ప్రతిభ ఎంత ముఖ్యమో వస్త్రధారణ కూడా అంతే ముఖ్యం. జడ్జిలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా వీరి వస్త్రధారణ ఉంటుంది. కళ్లు చెదిరే డ్రెస్‌లతో సాక్షాత్తు దేవకన్యే దిగివచ్చిందా? అనేలా క్యాట్ చేస్తూ మైమరిపిస్తుంటారు. మిస్ యూనివర్స్ 2022 పోటీలు తాజాగా న్యూజెర్సీలో జరిగాయి. ఈ పోటీల్లో థాయ్‌లాండ్ తరపున పోటీలో నిలిచిన అన్నాసుయాంగమ్-ఐయామ్ (Anna Sueangam-Iam) పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఇటీవల జరిగిన ప్రాథమిక పోటీలో ఆమె ధరించిన వెరైటీ గౌను అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె కాస్టూమ్ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. టైటిల్ గెలవకుండానే అందరి దృష్టిని ఆకర్షించిన అన్నా గౌను అంత పాపులర్ కావడం వెనక ఓ బాధాకరమైన గతం ఉంది. వాడిపడేసిన కోక్ డబ్బా మూతలతో.. చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపించిన ఈ గౌను వాస్తవానికి వాడిపడేసిన డ్రింక్ డబ్బాల మూతలతో తయారు చేశారు. మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ ఇన్‌స్ట్రాగ్రామ్ పేజ్‌లో అన్నా గౌనుకి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రఖ్యాత థాయ్ డిజైనర్ అరిఫ్ జహవాంగ్ ఈ డ్రెస్సును రూపొందించాడు. అన్నా తన బాల్యం, గత జీవితాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఈ డ్రెస్సును తయారు చేయించింది ఈ క్రమంలో ఉపయోగించిన డ్రింక్ క్యాన్స్ మూతలతో (రిసైకిల్ వ్యర్థాలతో) దీనిని తీర్చిదిద్దేలా జాగ్రత్త పడింది. లుక్ కోసం ఆ మూతల మధ్యలో స్వరోవ్స్కీ డైమండ్స్ వచ్చేలా రెడీ చేసుకుంది. ఈ గౌనుతోనే అన్నా ప్రాథమిక పోటీల్లో పాల్గొంది. బాల్యమంతా చెత్తలోనే కాగా థాయ్‌లాండ్‌కు చెందిన అన్నా తండ్రి చెత్త సేకరిస్తూ, తల్లి వీదుల్లో చెత్త ఊడుస్తూ జీవనం సాగిస్తుంటారు. దీంతో ఆమె బాల్యమంతా చెత్తకుప్పలు, వాడి పడేసిన వస్తువుల మధ్యే సాగింది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటే ఎక్కువ గడపడంతో అన్నా తన నానన్మ దగ్గరే పెరిగింది. తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి కూతుర్ని చదివించారు. అందుకు తగ్గట్టే అన్నా కష్టపడి చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించింది. చదువుకునే రోజుల్లో కొందరు ఆమెను గార్బెజ్ బ్యూటీ క్వీన్‌గా ఎగతాళి చేసేవారు. అయినా అన్నా అవన్నీ పట్టించుకునేది కాదు. ఓవైపు చదువులో రాణిస్తూ మరోవైపు అందాల పోటీల్లో పాల్గొనేది. అలా మిస్ థాయ్‌లాండ్ 2020’ పోటీల్లో పాల్గొని ‘టాప్ 16’లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత జరిగిన ‘మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2022’ పోటీల్లో టైటిల్ సంపాదించి తన కలను సాకారం చేసుకుంది. తనను విమర్శించిన నోళ్లను మూయిస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. గతం ఎలా ఉన్నా కృషి పట్టుదల, నమ్మకంతో గొప్ప విజయాలను సాధించవచ్చని నిరూపించింది. View this post on Instagram A post shared by Miss Universe Thailand (@missuniverse.in.th) View this post on Instagram A post shared by Miss Universe Thailand (@missuniverse.in.th) తన డ్రెస్‌కు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఈ గౌనులో నా బాల్యం దాగుంది. నా తల్లిదండ్రులు చెత్తను సేకరించేవారు. నా బాల్యమంతా చెత్తకుప్పల మధ్యే సాగింది. అందుకే అందరూ వాడి పడేసిన కూల్‌డ్రింగ్ మూతలతో ఈ గౌన్‌ను డిజైన్ చేయించాను. పనికిరాని వస్తువులకు కూడా అందం, విలువ ఉంటాయని దీని ద్వారా ప్రపంచానికి చూపించాలనుకున్నాం. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చింది. మిస్ యూనివర్స్ 2022 టైటిల్ గెలుచుకున్న అమెరికా భామ మిస్ యూనివర్స్ 2021 కీరిటాన్ని భారతీయ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా 2022గానూ పోటీలు న్యూజెర్సీలో (జనవరి 14న) జరిగాయి. ఈ ఏడాది భారత్ తరపున కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల దివితా రాయ్ ప్రాతినిథ్యం వహించారు. గతేడాది మిస్ దివా యునివర్స్ టైటిల్‌ను ఈమె సొంతం చేసుకొని మిస్ యూనివర్స్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. అయితే అమెరికాకు చెందిన ఆర్ బోనీ గాబ్రియేల్ మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని దక్కించుకుంది. The new Miss Universe is USA!!! #MISSUNIVERSE pic.twitter.com/7vryvLV92Y — Miss Universe (@MissUniverse) January 15, 2023 -
సచివాలయ వ్యర్థాలు 62వేల మెట్రిక్ టన్నులు
సాక్షి, హైదరాబాద్: సచివాలయ కూల్చివేతల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పునర్వినియోగించనున్నారు. అందుకుగాను జీడిమెట్లలోని కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్‌డీ) వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 20 నుంచి 31వ తేదీ వరకు 62 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించా రు. మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతాయని అంచనా. కూల్చివేతల వ్యర్థాల తరలింపు సక్రమంగా జరుగుతున్నదీ లేని దీ జీహెచ్ఎంసీ అధికారులు నిత్యం పరిశీలి స్తున్నారు. కమిషనర్ ఆదేశాలకనుగుణంగా సంబంధిత అడిషనల్ కమిషనర్, ఇంజనీర్లు పరిశీలిస్తున్నారు. తరలింపు సందర్భంగా వాహనాలపై టార్పాలిన్లు కప్పడం, రహదారులపై వ్యర్థాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి సూచిస్తున్నారు. స్టీల్, వుడ్ వంటివి తరలింపునకు ముందే కూల్చివేతల ప్రాంతంలోనే వేరు చేస్తుండగా, జీడిమెట్లలోని ప్లాంట్‌కు తరలించాక కాంక్రీట్‌లో స్టీల్, తదితరమైనవి ఏవైనా ఉంటే వేరు చేస్తున్నారు. నగరంలో నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ జీడిమెట్లలో రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటుకు రాంకీ సంస్థకు అనుమతినిచ్చింది. ప్రస్తుత చార్జీల మేరకు మెట్రిక్ టన్నుకు రూ.367లు. ఈ లెక్కన రెండు లక్షల మెట్రిక్ టన్నులకు రూ.7 కోట్లకు పైగా కాంట్రాక్టు సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు వంద వాహనాలను వ్యర్థాల తరలింపునకు వినియోగిస్తుండగా, ఇప్పటివరకు 2,700 ట్రిప్పుల మేర తరలించినట్లు సమాచారం. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఇటుకలు, కెర్బ్‌లు, ఇసుక వంటివి తయారు చేస్తారు. -
చెత్త వేస్తే ఫైన్లు తప్పవు
సాక్షి, సంగారెడ్డి: రోడ్లపై చెత్త వేస్తే దుకాణాల యజమానులపై ఫైన్లు వేయకతప్పదని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సంగారెడ్డి పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న కొన్ని దుకాణ సముదాయాలను ఆయన తనిఖీ చేశారు. దుకాణాల ముందున్న చెత్తను చూసి అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను అపరిశుభ్ర పరిస్తే ఎంతటివారైనా సహించేది లేదని హెచ్చరించారు. కొంతమంది దుకాణదారులకు ఫైన్లు వేశారు. ప్రతీ ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హరితహారంలో భాగంగా దుకాణ సముదాయాల ముందు మొక్కలను నాటతామని, వాటిని దుకాణాల యజమానులు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పట్టణాన్ని జోన్లవారీగా విభజించి ప్రతి జోన్లో రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు కలెక్టర్ వివరించారు. పట్టణంలో పరిశుభ్రత స్థిరంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
అమెరికాలోనే తక్కువ!
జెనీవా: రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో యావత్ భారతదేశం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంటే యూరప్, పశ్చిమ దేశాలు అక్కడ పేరుకుపోయిన చెత్తను పునర్వినియోగంలోకి తెస్తూ క్లీన్ కంట్రీస్‌గా మారేందుకు శ్రమిస్తున్నాయి. పర్యావరణ హితం కోసం పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ యూనోమియా చెత్త నిర్వహణపై ఒక నివేదిక తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చెత్తను రీసైకిల్ చేస్తున్న దేశాల జాబితాను యూనోమియా ఇటీవల విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం.. చెత్త నిర్వహణ, పునర్వినియోగంలో జర్మనీ మొదటి స్థానంలో నిలవగా... ఆస్ట్రియా, దక్షిణ కొరియా, వేల్స్ దేశాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 52 నుంచి 56 శాతం చెత్తను రీసైకిల్ చేస్తూ దేశాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తమ దేశంలోని సగం చెత్తను రీసైకిల్ చేస్తూ స్విట్జర్లాండ్ అయిదో స్థానంలో ఉంది. స్థానిక ప్రభుత్వాలను, దేశ ప్రజలను చైతన్యం చేస్తూ ఆయా దేశాలు స్వచ్ఛత సాధిస్తున్నాయని రిపోర్టు వెల్లడించింది. ఒకే తరహా చెత్త సేకరణ విధానాలు అవలంభిస్తూ, ఈ దేశాలు చెత్త నిర్వహణకు తగినన్ని నిధులు కేటాయిస్తున్నాయని స్పష్టం చేసింది. కాగా, జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన వేల్స్ దేశం మిగతా వాటి కంటే ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతోందనీ, కొన్ని నెలల్లోనే అది ప్రథమ స్థానానికి చేరుకోవచ్చని రిపోర్టు వెల్లడించింది. 2050 వరకు జీరో వేస్టేజి దేశంగా అవతరించడానికి వేల్స్ ప్రణాళికలు రచించుకుంది. మరోవైపు, ఇప్పటివరకు ప్రపంచంలోని చాలా దేశాల్లోని ఇండస్ట్రియల్ చెత్తను దిగుమతి చేసుకుని రీసైకిల్ చేసే చైనా తన పంథా మార్చుకుంది. 24 రకాల చెత్తను రీసైకిల్ చేయబోమని ప్రకటించింది. దాంతో చెత్త నిర్వహణపై చైనాపై ఆధారపడ్డ ఆయా దేశాలపై మరింత పనిభారం పడింది. కాగా, ఐరోపా దేశాలు 30 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేస్తుండగా.. అమెరికా కేవలం 9 శాతమే రీసైకిల్ చేస్తోంది. -
పరిశ్రమలో అగ్నిప్రమాదం
మొయినాబాద్, న్యూస్‌లైన్: ఓ ఆర్కిటెక్చర్ మోల్డింగ్ కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వేస్టేజీ స్క్రాప్‌తో పాటు ఓ షెడ్డుకు మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలు అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో ఉన్న రాస్ పాలిబోర్డ్ ప్రొడక్స్ కంపెనీలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రాస్ పాలిబోర్డ్ కంపెనీలో ఇంటీరియర్ డెకరేషన్‌కు సంబంధించిన ఆర్కిటెక్చర్ మోల్డింగ్ షీట్లు తయారు చేస్తారు. కాగా ఏడాదిగా కంపెనీలో పని జరగడంలేదు. కార్మికుల కుటుంబాలు కంపెనీ ఆవరణలోనే ఉన్న గృహాల్లో నివాసముంటున్నారు. కంపెనీలో షీట్లు తయారు చేయగా మిగిలిన వేస్టేజీ స్క్రాప్‌ను కంపెనీ పక్కన ఓ షెడ్డులో వేశారు. షెడ్డుపక్కన సైతం వేస్టేజీ ఉంది. శుక్రవారం స్క్రాప్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కార్మికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. స్క్రాప్ ఉన్న షెడ్డుకు కూడా నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా పొగ కమ్ముకోవడంతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కార్మికుల సమాచారంతో చేవెళ్ల నుంచి ఫైరింజన్ వచ్చింది. ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొద్దిసేపటి తర్వాత లంగర్‌హౌస్ నుంచి మరో ఫైరింజన్ రావడంతో మంటలను పూర్తిగా ఆర్పేశారు. మంటలు చెలరేగిన షెడ్డుకు ఇరవై అడుగుల దూరంలోనే గోడౌన్ ఉంది. ఓ పక్క కంపెనీ, మరో పక్క గృహసముదాయం ఉంది. మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది.