వర్షంలోనూ ఫ్యాషన్ సాధ్యమే
వాన రాకడ ఫ్యాషన్ పోకడ.. రెండూ అనూహ్యమే. ఎప్పుడు కురుస్తుందో.. ఎప్పుడు మెరుస్తుందో.. తెలియని పరిస్థితుల్లో.. సిటీలోని ఫ్యాషన్ లవర్స్ ఎలాంటి ఫ్యాషన్ అనుసరించాలో తెలియక సిటీలోని ఫ్యాషన్ లవర్స్‌ని అయోమయపు మబ్బులు కమ్మేస్తుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నగరవాసుల కోసం మాన్సూన్ ఫ్యాషన్ తొలకరి చినుకులు కురిపిస్తోంది.. ⇒ సీజన్‌కు అనుగుణంగా మార్పు చేర్పులు⇒ అందుబాటులో వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్⇒ తేమను విడగొట్టే పాలియెస్టర్ బ్లెండ్స్⇒ జాయ్‌ఫుల్‌గా ఉంచే బ్రైట్‌కలర్స్⇒ ఫుట్ వేర్ కూడా ఫ్యాషనబుల్‌గా మహిళలు వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవాలి. నైలాన్, పాలియెస్టర్ మేళవింపు ఫ్యాబ్రిక్స్, అలాగే ట్రీటెడ్ కాటన్..వంటివి బెస్ట్. అనుకోని వర్షం కలిగించే ఇబ్బందులను తగ్గిస్తూ మనల్ని పొడిగా ఉంచుతాయి. లైట్ వెయిట్‌తో, గాలి పీల్చుకోవడానికి అనువుగా ఉండే లినెన్ లేదా కాటన్ అయితే త్వరగా పొడిగా మారతాయి. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను స్వీకరించేందుకు లేయరింగ్ స్టైల్ (ఒక దాని మీద మరొకటి ధరించడం) ఉపకరిస్తుంది. బ్రైట్కలర్స్తో ప్రయోగాలు చేయాలి. ఎల్లో, గ్రీన్, బ్లూ కలర్స్ మబ్బు పట్టిన వాతావరణంలో సైతం మూడ్స్‌ని జాయ్‌ఫుల్‌గా ఉంచుతాయి. అలాగే ట్రెంచ్ కోట్స్, పార్కాస్, స్టైలిష్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్. వంటి.స్టైలిష్ రెయిన్ వేర్ వినియోగించాలి. ఠిమగవాళ్లు బోర్ కొట్టించే రెయిన్ కోట్స్‌ను విడిచిపెట్టి లైట్ వెయిట్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్, హుడీస్ – విండ్ బ్రేకర్స్ వినియోగించాలి. తేలికపాటి డిజైన్స్‌ను ఎంచుకోవాలి. తేమను విడగొట్టే పాలియెస్టర్ బ్లెండ్స్ లాంటి ఫ్యాబ్రిక్స్‌ను వినియోగించాలి. ఇవి త్వరగా పొడిగా మారతాయి. రోజంతా సౌకర్యవంతంగా ఉంచుతాయి. నేవీ, చార్కోల్, ఆలివ్ రంగులు వంటివి నప్పుతాయి. ఇవి మరకలి్న, బురద తుంపర్లని దాచే వీలు కలి్పస్తాయి. ట్రౌజర్స్, షర్ట్స్, అవుటర్ వేర్లో ఈ షేడ్స్ పాలిషి లుక్ అందిస్తాయి. చినోస్, జీన్స్ క్యాజువల్ ట్రౌజర్స్‌ను లైట్ వెయిట్ స్వెటర్స్, గాలి బాగా తగిలేలా చేసే షర్ట్స్‌తో కాంబినేషన్‌గా వాడవచ్చు. ఇవి అటు కంఫర్ట్ ను, ఇటు స్టైల్‌నూ అందిస్తాయి. పాదరక్షలిలా... మహిళలు పాదాలను పొడిగా ఉంచుతూనే ఫ్యాషనబుల్‌గా ఉండేలా ఫుట్ వేర్‌ను ఎంచుకోవాలి. రబ్బర్ బూట్స్, వాటర్ ప్రూఫ్ స్నీకర్స్, డ్యూరబుల్ ఫ్లాట్స్.. వంటివి బెస్ట్. మగవాళ్లు మంచి మెటీరియల్‌తో తయారైన వాటర్ ప్రూఫ్ బూట్స్, స్టర్డీ లోఫర్స్ ఫుట్‌వేర్‌గా ఎంచుకోవాలి. కాన్వాస్ షూస్, స్యూడ్లు వాడవద్దు.. యాక్సెసరీస్ ఇలా.. ఠిమహిళలు కనీసస్థాయికి జ్యుయలరీ తగ్గించి, వాటర్ ప్రూఫ్ యాక్సెసరీస్ వినియోగించాలి. వాటర్ ప్రూఫ్, స్లీక్గా ఉండే బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ క్యారీ చేస్తే మొబైల్స్ వంటి ముఖ్యమైనవి భధ్రపరచుకోవచ్చు. మగవాళ్లు.. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ ఉన్న యాక్సెసరీస్ బెస్ట్. లెదర్, సింథటిక్ల కలయికతో రూపొందిన వాచ్‌లు, బ్యాగ్స్ వాడాలి. ⇒ తడిసిన పరిస్థితిలో సైతం మ్యానేజ్ చేయగలిగేలా హెయిర్‌స్టైల్ మార్చుకోవాలి. జుట్టు బిగుసుకుపోకుండా నియంత్రించే యాంటీ ఫ్రీజ్ ఉత్పత్తులు వాడాలి లేదా జుట్టును పూర్తిగా వెనక్కి సెట్ చేసి ఉంచాలి. ⇒ కలర్ఫుల్గా ఉండే నాణ్యమైన బ్రాండెడ్ గొడుగును వెంట తీసుకెళ్లాలి. వర్షాకాలంలో వాన నుంచి రక్షణగా మాత్రమే కాదు మన స్టైల్‌కి చిహ్నంగా కూడా కనిపించాలి. రెయిన్లోనూ ఫ్యాషైన్ సాధ్యమే.. వానలు పడుతున్నంత మాత్రాన ఫ్యాషన్స్‌ను విడిచిపెట్టనక్కర్లేదు. అయితే సీజన్‌కి అనుగుణంగా కొన్ని మార్పు చేర్పులు తప్పనిసరి. వాటర్ ప్రూఫ్ అనేది దుస్తులకైనా యాక్సెసరీస్కైనా ఒక రూల్‌గా పెట్టుకోవాలి. ఇదే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రెయినీ సీజన్‌ను స్టైల్‌గా ఎంజాయ్ చేయవచ్చు... –చారోల్, హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్.