Welfare Gurukul school
-
గురుకుల సీటుకు సిఫారసు కట్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురు కుల విద్యాసంస్థల్లో సిఫారసు లేఖలకు కాలం చెల్లింది. గురు కులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగి శాక మిగులు సీట్ల భర్తీలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫా రసు లేఖలను ఏమాత్రం పరిగణ నలోకి తీసుకో రాదని... కేవలం మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. గత నెలలో ప్రవే శాల ప్రక్రియను ప్రారంభించిన గురుకుల సొసై టీలు తొలివిడత కౌన్సెలింగ్ చేపట్టి సీట్లు పొందిన విద్యార్థులకు గడువులోగా నిర్దేశిత విద్యాసంస్థల్లో రిపోర్టు చేయాల్సిందిగా స్పష్టం చేశాయి. మెజారిటీ విద్యార్థులు ఆయా సంస్థల్లో చేరగా మిగులు సీట్లకు సంబంధించి మరో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారని ఆశావహులు భావించారు. కానీ గురుకుల సొసైటీలు మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేయలేదు. మరోవైపు అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమవగా బోధన సైతం వేగంగా కొనసాగుతోంది. మెరిట్‌కే పరిమితం...: రాష్ట్రంలో ఐదు గురుకుల విద్యాసంస్థల సొసైటీలు న్నాయి. మహాత్మా జ్యోతిభాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు సంబంధిత సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ మాత్రం పాఠశాల విద్యాశాఖ పరిధిలో కొనసాగుతోంది. ఐదు సొసైటీల పరిధిలో 1005 పాఠశాలలు, కళాశాలలున్నాయి. వాటిలో ఐదో తరగతి అడ్మిషన్లతోపాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు, ఇంటర్ ఫస్టియర్, డిగ్రీ ఫస్టియర్‌కు ఏటా అడ్మిషన్లు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల పరిధిలో ఐదో తరగతికి ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. మిగతా తరగతులకు మాత్రం సొసైటీలు వేరువేరుగా ప్రకటనలు జారీ చేసి అర్హత పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తాయి. -
గురుకుల కొలువులు 9,231
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. వివిధ కేటగిరీల్లో ఏకంగా 9,231 ఉద్యోగాల భర్తీకోసం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏకకాలంలో తొమ్మిది నోటిఫికేషన్లను జారీచేసింది. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్ (http://treirb.telangana.gov.in)లో అందుబాటులో ఉంచింది. ఆయా పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లను ప్రకటనలో నిర్దేశించిన తేదీల్లో విడుదల చేస్తామని బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. దాదాపు ఏడాదిపాటు కసరత్తు చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ఎట్టకేలకు ప్రకటన జారీచేయడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గురుకులాల్లో పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నెల రోజులు గడువుతో.. గురుకుల బోర్డు జారీచేసిన నోటిఫికేషన్లు ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. పోస్టుల వారీగా దరఖాస్తుల తేదీ ప్రారంభం, ముగింపు, పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఎప్పుడు పెడతారన్న వివరాలను వాటిలో వెల్లడించారు. కొన్నిరకాల పోస్టులకు ఈనెల 17వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. మరికొన్నింటికి ఈ నెల 24న, 28న మొదలుకానున్నాయి. అన్ని కేటగిరీల పోస్టులకు దరఖాస్తులు మొదలైన నాటి నుంచి నెలరోజుల పాటు గడువు ఉంటుంది. దాదాపు అన్ని పోస్టులకు మే నెలలో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. గడువు ముగిశాక నెలన్నర నుంచి రెండు నెలల పాటు సన్నద్ధతకు అవకాశం ఉంటుందని.. తర్వాత అందుబాటులో ఉన్న తేదీల్లో పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రస్థాయిలో ఇతర నియామక బోర్డులతో సమన్వయం చేసుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌లను పూర్తిగా పరిశీలించి.. ఇబ్బందిలేని రోజుల్లో పరీక్షల నిర్వహణను ఖరారు చేయనున్నట్టు వెల్లడించాయి. సైలెంట్‌గా ప్రకటన విడుదల గురుకుల పోస్టుల భర్తీ నోటిఫికేషన్లను టీఆర్‌ఈఐఆర్‌బీ గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఉద్యోగ నియామక ప్రకటనలను సదరు నియామక సంస్థ విడుదల చేయడం, మీడియా సమావేశం పెట్టి వెల్లడించడం జరుగుతుంది. గతంలో గురుకుల నియామకాల బోర్డు ఏర్పాటు చేసిన సమయంలో అప్పటి బోర్డు చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేశారు. కానీ ఇప్పుడు భారీగా గురుకుల ఉద్యోగాల భర్తీ చేపడుతున్నా.. కేవలం ఒకట్రెండు పత్రికల్లో యాడ్ (అడ్వర్టైజ్మెంట్) రూపంలో ఇవ్వడం గమనార్హం. ఓటీఆర్ ఉంటేనే దరఖాస్తు... తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మాదిరిగానే గురుకుల నియామకాల బోర్డు కూడా ఓటీఆర్ (వన్‌టైమ్ రిజిస్ట్రేషన్) విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఐదేళ్ల క్రితం కేవలం డిగ్రీ లెక్చరర్ కేటగిరీకి మాత్రమే ఓటీఆర్‌ను అనుసరించగా.. ఇప్పుడు ప్రతి దరఖాస్తుకు ఓటీఆర్ తప్పనిసరి చేసినట్టు నోటిఫికేషన్లో ప్రకటించింది. ఓటీఆర్ ప్రక్రియ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ముందుగా ఓటీఆర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాకే గురుకుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్ విధానానికి అనుగుణంగా ఓటీఆర్ ఆప్షన్లను సిద్ధం చేశారు. ప్రతి అభ్యర్థి విద్యార్హతలు, బోనఫైడ్లు, కుల ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓటీఆర్ ప్రక్రియతో వెబ్‌సైట్‌పై తీవ్ర ఒత్తిడి పడేఅవకాశం ఉండడంతో.. దరఖాస్తులకు ఐదు రోజుల ముందుగానే ప్రారంభించినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. గురుకుల కొలువుల దరఖాస్తు ఫీజు గతంలో రూ.600గా ఉండేది. ఇప్పుడు కూడా అంతేస్థాయిలో ఫీజు నిర్ధారించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు గురుకుల విద్యాసంస్థల్లో దాదాపు 12వేల ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 9వేల ఉద్యోగాల భర్తీకి గతేడాది జూన్‌లోనే అనుమతులు వచ్చాయి. 2022–23 విద్యా సంవత్సరంలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో మరిన్ని విద్యాసంస్థలు తెరవడంతో.. వాటిలోని పోస్టులను కూడా ఒకేదఫాలో భర్తీ చేయాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ల జారీ కోసం బోర్డు వేచిచూసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం మరో 2,225 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. అయితే తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లలో 9వేలకుపైగా ఉద్యోగాలనే ప్రకటించారు. మిగతా కొలువులకు సంబంధించి త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. ప్రధానంగా వ్యవసాయ డిగ్రీ కళాశాలలు, ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీలు, ఇతర సాంకేతిక కాలేజీల్లో పోస్టులు మంజూరైనా.. వాటికి సంబంధించిన సర్వీసు నిబంధనలు ఖరారు కాలేదు. దీనిపై స్పష్టత రాగానే ఉద్యోగ ప్రకటనలు రానున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. -
గురుకులం.. ఇక కొలువుల కోలాహలం!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల జాతరకు వేళ అయింది. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రక్రియ పట్టాలెక్కింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల సొసైటీల పరిధిలో బోధన సిబ్బంది కేటగిరీలో 9,096 ఉద్యోగ నియామకాలకు గతవారం ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యం లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనల రూపకల్పనలో సొసైటీలు తలమునకలయ్యాయి. అనుమతించిన పోస్టులు, జోన్లవారీగా విభజన, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లకు సంబంధించి మరోమారు పరిశీలన చేపట్టాయి. ఒకట్రెండు రోజుల్లో వీటిని నిర్ధారణ చేసుకున్న తర్వాత గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం బీసీ గురుకుల విద్యాసంస్థలు 261, ఎస్సీ 230, ఎస్టీ 105, మైనారిటీ విద్యాసంస్థలు 207 ఉన్నాయి. బీసీ గురుకులాల్లో అత్యధిక పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. విద్యాసంస్థల మంజూరు సమయంలోనే శాశ్వత ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. ఏటా 25 శాతం చొప్పున నాలుగేళ్లలో అన్ని సొసైటీల్లో రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. నియామకాల కోసం ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ)ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయగా, తాజాగా మరో 9,096 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న కొలువుల్లో అత్యధికం బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధికంగా 238 బీసీ గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీసీ గురుకులాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. బీసీ గురుకుల సొసైటీకి 3,870, ఎస్సీ 2,267, ఎస్టీ 1,514, మైనార్టీ సొసైటీలో 1,445 చొప్పున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. సొసైటీలవారీగా ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత గురుకుల నియామకాల బోర్డు వాటిని అన్నివిధాలా పరిశీలించి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనుంది. -
జూన్‌లో గురుకుల అడ్మిషన్లు?
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ జూన్‌లో నిర్వహించాలని గురుకుల విద్యా సంస్థల సొసైటీలు భావిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే ప్రవేశ పరీక్షలు నిర్వహించి, మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటించాలి. కానీ కరోనా దృష్ట్యా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. పదో తరగతి పరీక్షలు పూర్తికాకపోవడంతో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియపై స్పష్టత లేదు. ఏటా ఏప్రిల్ నెల చివరి వారంలో ఇంటర్ ఫలితాలు వెలువడేవి. అనంతరం గురు కుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు మార్గం సుగమమయ్యేది. ఇప్పటివరకు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం సైతం సందిగ్ధంలో పడింది. దీంతో గురుకు లాల్లో అన్ని కేటగిరీల్లో ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. లాక్డౌన్ తర్వాతే... రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. ఆ తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయకుండా సడలింపుల ద్వారా ఒక్కో రంగానికి అనుమతులిస్తారు. ఎక్కువ మంది సమూహంగా ఏర్పడే కార్యక్రమాలకు అనుమతి ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రవేశ పరీక్షలను మేలో నిర్వహించే అవకాశం లేదనిపిస్తోంది. లాక్డౌన్ సడలింపులతో అన్ని రకాల సెట్లకు సంబంధించి దర ఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల (టీజీసెట్)పై స్పష్టత రానున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖా స్తులు స్వీకరించారు. ప్రవేశ పరీక్షను జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. లాక్డౌన్ తర్వాత మరోసారి దరఖాస్తుకు గడువు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై సొసైటీలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి. ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుకు కూడా మరోసారి అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును మే 10వ తేదీ వరకు పొడిగించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉంది. అయితే లాక్డౌన్ సడలింపులపై స్పష్టత వచ్చాక అన్ని సొసైటీలు వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
నేటి నుంచి కొత్త బీసీ గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: 2019–20 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం మంజూరు చేసిన 119 బీసీ గురుకులాలను నేడు (17న) ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ గురుకులాలన్నింటినీ సోమవారం ఏకకాలంలో ప్రారంభించాలని నిర్ణయించింది. వీటి ప్రారంభంతో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో పాఠశాలల సంఖ్య 257కు చేరనుంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతంలో కేవలం 19 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ మిషన్ కింద గురుకుల పాఠశాలలను తెరుస్తూ వచ్చింది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. అయితే జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు ఆ ఏడాది ప్రారంభించిన గురుకులాల సంఖ్య తక్కువే. గురుకులాలకు డిమాండ్ అధికంగా ఉండటం... పాఠశాలల్లో సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన ప్రభుత్వం గతేడాది మరో 119 గురుకుల పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని 2019–20 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో చర్యలు చేపట్టిన బీసీ గురుకుల సొసైటీ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసింది. సవాళ్లను అధిగమించి... కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటులో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ పలు సవాళ్లను ఎదుర్కొం ది. గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 400 గురుకులాలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో కొత్తగా మరో 119 మంజురు చేయగా... వాటి ఏర్పాటుకు భవనాల గుర్తింపు పెను సవాలుగా మారింది. అందుబాటులో ఉన్న దాదాపు అన్ని భవనాలు అప్పటికే గురుకులాల ఏర్పాటు కోసం అద్దెకు తీసుకోవడంతో భవనాల కొరత విపరీతమైంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. భవనాల లభ్యత లేకపోవడంతో అధికారులు సైతం తలపట్టుకున్నారు. దాదాపు ఏడాది పాటు భవనాల కోసం పరిశీలించారు. పలుచోట్ల యజమానులతో దఫాల వారీగా చర్చలు జరిపి, మరమ్మతులకు ఒప్పించి మొత్తంగా అవసరమైన మేర అద్దె భవనాలను గుర్తించారు. కొన్ని చోట్ల మాత్రం అనువైన భవనాలు లేని కారణంగా ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలల్లోనే ఏర్పాట్లకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాల, బాలికల బీసీ గురుకుల పాఠశాలలున్నాయి. 2017–18లో ప్రారంభించిన 119 గురుకులాలను డిమాండ్‌ను బట్టి బాల బాలికలుగా విభజించినప్పటికీ... తాజాగా ప్రారంభిస్తున్న గురుకులాలతో బ్యాలెన్సింగ్ పద్ధతితో బాలబాలికల పాఠశాలలను ఏర్పాటు చేశారు. మొత్తం 257 బీసీ గురుకులాల్లో 94,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మరో రెండేళ్లలో ఈ విద్యార్థుల సంఖ్య లక్ష దాటనుంది. గురుకులాల్లో జూనియర్ కాలేజీలు సైతం ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుంది. కొత్త గురుకులాల ప్రారంభంతో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ అతి పెద్ద గురుకుల సొసైటీగా అవతరించింది. ఇప్పటివరకు 238 గురుకుల పాఠశాలలతో పెద్ద సొసైటీగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) రికార్డును బీసీ గురుకుల సొసైటీ అధిగమించింది. వచ్చే ఐదేళ్లలో అత్యధిక విద్యార్థులున్న విద్యా సంస్థగా బీసీ గురుకుల సొసైటీ రూపుదాల్చనుంది. -
ప్రతి నియోజకవర్గంలో రెండేసి గురుకులాలు!
* ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జనాభా ప్రాతిపదికన స్కూళ్ల ఏర్పాటు * అన్ని గురుకులాలకు ఒకే సర్వీసు రూల్స్, విద్యా విధానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కనీసం రెండేసి సంక్షేమ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏ ప్రాంతంలో ఏ వర్గం ఎక్కువగా ఉంటే తదనుగుణంగా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకు అవసరమైన ఆయా వర్గాల జనాభా వివరాలను మండలాల వారీగా సరి చూసుకుని, వారి జనాభాకు తగ్గట్లుగా ఇంగ్లిష్ మీడియంలో ఈ పాఠశాలలను ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఏర్పాటు చేయబోయే మొత్తం 221 గురుకుల (100 ఎస్సీ, 71 మైనారిటీ, 50 ఎస్టీ గురుకులాలు) పాఠశాలల్లో ఒకే రకమైన విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో ఆయా సొసైటీ గైడ్లైన్లు విడివిడిగా ఉండడంతోపాటు టీచర్ల నియామకానికి సంబంధించిన నియమ, నిబంధనలు, సర్వీసు రూల్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయి. ప్రస్తుతం చేపట్టబోయే టీచర్ల రిక్రూట్మెంట్కు ఒకే విధానం, సర్వీస్‌రూల్స్‌ను పెట్టాలని మంగళవారం ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. అన్ని గురుకులాల్లో ఒకే విధంగా టీచర్ల నియామకానికి బీఈడీని అర్హతగా తీసుకోనున్నారు. వచ్చే జూన్ చివరికల్లా జనాభాప్రాతిపదికన 221 ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో 5, 6 తరగతులను ప్రారంభించేందుకు ఆయా సంక్షేమ శాఖలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఈ స్కూళ్లలోనే జూనియర్ కాలేజీల నిర్వహణకు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. బాలికల కోసం 25, బాలుర కోసం 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ గురుకులాల శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఏడాది సమయం పట్టనున్నందున, అప్పటివరకు అందుబాటులో ఉన్న వివిధ శాఖల ప్రభుత్వ భవనాలు, అద్దెభవనాల్లో గురుకులాలను ప్రారంభించనున్నారు.