శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
సీపీ సుధీర్‌బాబు
పోలీస్ క్రికెట్కప్–2016 ప్రారంభం
వరంగల్ : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో యువత.. పోలీసులకు ప్రతినిధులుగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు సహMýరించాలని పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రికెట్ కప్–2016 టోర్నమెంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.
హన్మకొండలోని పోలీసు మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలన్నారు. పోలీసులకు యువత చేరువ కావాలన్న ధ్యేయంతోనే ఈ క్రికెట్ కప్–2016ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్–ఏ, వరంగల్–బీ జట్ల మధ్య మ్యాచ్ జరగగా కమిషనర్ టాస్ వేయడంతో పాటు బౌలింగ్ చేయగా హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్ బ్యాటింగ్ చేశారు. కాగా, తొలుత ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో డీసీపీ యాదయ్య, ఏసీపీలు ఈశ్వర్రావు, శోభన్‌కుమార్, సురేంద్రనాథ్, రవీందర్రావు, సీఐలు సంపత్‌రావు, ఎస్ఎం.అలీ, కిషన్, రవికుమార్, శ్రీనివాస్, శివరామయ్య, రమేష్, వేణు, ప్రభాకర్‌రావు, సత్యనారాయణ, ఆర్ఐలు శ్రీనివాస్, నాగయ్య, సిటీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, క్రికెట్ కోచ్ జైపాల్ పాల్గొన్నారు. వరంగల్ – ఏ, వరంగల్ – బీ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ‘ఏ’ జట్టు విజయం సాధించింది.