withdrawal shares
-
రుచీ సోయా ఎఫ్‌పీవో ఓకే, కేటుగాళ్లకు చెక్‌పెట్టిన సెబీ!
న్యూఢిల్లీ: వంట నూనెల దిగ్గజం రుచీ సోయా ఇండస్ట్రీస్ ఎఫ్‌పీవో పూర్తయ్యింది. ఇష్యూకి రూ. 650 ధరను ఖరారు చేసింది. అయితే 97 లక్షల బిడ్స్ ఉపసంహరణకు లోనయ్యాయి. షేరుకి రూ. 615–650 ధరలో రూ. 4,300 కోట్ల సమీకరణకు కంపెనీ ఎఫ్‌పీవో చేపట్టింది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అవసరమైతే ఇన్వెస్టర్లు బిడ్స్‌ను ఉపసంహరించేందుకు వీలు కల్పించమని కంపెనీని ఆదేశించింది. షేర్ల విక్రయంపై అయాచిత ఎస్ఎంఎస్లు సర్క్యులేట్కావడంతో సెబీ అనూహ్యంగా స్పందించింది. దీంతో ఈ నెల 28న ముగిసిన ఇష్యూలో భాగంగా 30వరకూ బిడ్స్ ఉపసంహరణకు రుచీ సోయా అవకాశమిచ్చింది. బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని రుచీ సోయా ఎఫ్‌పీవో కోసం 4.89 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 17.6 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. కాగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు సైతం రూ. 650 ధరను ఖరారు చేసింది. గత వారం ఈ సంస్థలకు 1.98 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ. 1,290 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మహాకోష్, సన్‌రిచ్, రుచీ గోల్డ్, న్యూట్రెలా బ్రాండ్లు పతంజలి గ్రూప్‌నకు చెందిన రుచీ సోయా సొంతం. రుచీ సోయా షేరు ఎన్ఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 937 వద్ద ముగిసింది. -
డిజిన్వెస్ట్‌మెంట్ @ రూ.72,500 కోట్లు
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా 72,500 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. డిజిన్వెస్ట్చేయదల్చిన పీఎస్‌యుల్లో 3 రైల్వే పిఎస్‌యులు( ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి, ఐఆర్‌సిఒఎన్) కూడా ఉన్నాయి. దీంతో పాటు ప్రపంచ స్థాయి పిఎస్యులతో పోటీపడేలా దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం కొన్నింటి విలీనం, కొన్నింటి కన్సాలిడేషన్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఎదురైన లోపాలను దృష్టిలో ఉంచుకొని ఇకపై పిఎస్‌యుల లిస్టింగ్‌ను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా, ఉపసంహరణ ప్రక్రియలో జవాబుదారీతనం పెరిగేలా, కంపెనీల వాస్తవ విలువ గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. గతేడాది తొలుత పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.56 వేల కోట్లుగా నిర్ణయించుకున్నా, చివరకు రూ. 45వేల కోట్లనే సమీకరించింది. 10 పిఎస్‌యుల షేర్లతో ఏర్పాటు చేసిన ఈటీఎఫ్‌కు మంచి స్పందన వచ్చిందని జైట్లీ చెప్పారు. ఈ ఏడాది మరో కొత్త ఈటీఎఫ్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు.