women Software Engineer Killed
-
నేడు అనూహ్య అంత్యక్రియలు
ముంబైలో దారుణహత్యకు గురైన అనూహ్య ఈస్తర్ మృతదేహం మచిలీపట్నానికి చేరుకుంది. శనివారం ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న అనూహ్య.. క్రిస్మస్ సెలవలకు వచ్చి, తిరిగి వెళ్లి.. ఇంటికి చేరుకోకుండానే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అనూహ్యను బలమైన ఆయుధంతోనే కొట్టి చంపినట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు. ఆమె దేహంపై పలు చోట్ల గాయాలున్నాయని, మర్మావయవాలపైనా గాయాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అత్యాచారం జరిగిందా లేదా అనేది మాత్రం ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే తెలుస్తుందంటున్నారు. ముంబై పోలీసులు కేసు దర్యాప్తులో తీవ్ర అలసత్వం ప్రదర్శించారని అనూహ్య తండ్రి ప్రసాద్ చెప్పారు. ఎంతసేపూ ఆమెకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారే తప్ప.. ఎవరైనా దుండగులు ఆమెపై దాడి చేశారా అనే కోణంలో ఆలోచించలేదని ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే ఈ కోణంలో దర్యాప్తు చేసి ఉంటే తమ కుమార్తె తమకు దక్కి ఉండేదని, ఇప్పుడిలా మృతదేహంలా చూసుకోవాల్సి వస్తోందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. -
నేడు అనూహ్య అంత్యక్రియలు
-
అనూహ్యను చంపింది క్యాబ్ డ్రైవరేనా?
ముంబైలో హత్యకు గురైన మచిలీపట్నం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విషయమై డీజీపీ బి. ప్రసాదరావు ముంబై పోలీసులను సంప్రదించారు. అక్కడ జరిగిన విషయాలు, ఆ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనూహ్య రైలు దిగిన తర్వాత క్యాబ్‌లో తన హాస్టల్‌కు బయల్దేరి ఉంటుందని, బహుశా క్యాబ్ డ్రైవరే ఆమెను హత్యచేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మచిలీపట్నానికి చెందిన ఈస్తర్ అనూహ్య (23) ముంబైలో టీసీఎస్‌లో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. క్రిస్మస్ సెలవులు కావటంతో సొంత ఊరికి వచ్చిన అనూహ్య.... ముంబై వెళ్లేందుకు ఈ నెల 4న విజయవాడలో విశాఖపట్నం-ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. ఆ రోజు రాత్రి పది గంటలకు తండ్రికి ఫోన్ చేసిన అనూహ్య... ఆ తరువాత... హాస్టల్‌కు వెళ్లాక మాట్లాడుతానంటూ ఫోన్ కట్ చేసింది. ఆ తరువాత అనూహ్య నుంచి ఫోన్ రాలేదు. దాంతో ఆమె తండ్రి ప్రసాద్.... అనూహ్యకు ఎన్నికాల్స్ చేసినా సమాధానం లేదు. అనంతరం ఆయన అంథేరీ హాస్టల్లోని అనూహ్య స్నేహితురాలికి ఫోన్ చేసినా అక్కడ నుంచి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ప్రసాద్ ఈ నెల 5వ తేదీన అనూహ్య కన్పించటం లేదంటూ విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి 11 రోజుల తరువాత... కంజుమార్గ్‌లోని కాలిన గాయాలతో కుళ్లిన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమె చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా మృతదేహం అనూహ్యదిగా ఆమె తండ్రి గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
9తేదీ వరకూ అనూహ్య ఫోన్‌కు సిగ్నల్స్
ముంబయిలో దారుణ హత్యకు గురైన సాప్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య కేసు దర్యాప్తులో రైల్వే పోలీసుల నిర్లక్ష్యం లేదని రైల్వే ఎస్పీ శ్యాంప్రసాద్ స్ఫష్టం చేశారు. ఈ నెల 5న ఆమె ముంబయి లోకమాన్య తిలక్ రైల్వేస్టేషన్లో దిగినట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లో కేసు దర్యాప్తు వివరాలు కనుగొని ముంబయి పోలీసులకు సమాచారం అందించామన్నారు. మహారాష్ట్ర నుంచి 9వ తేదీ వరకూ అనూహ్య ఫోన్‌కు సిగ్నల్స్ ఉన్నట్లు సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన 23 ఏళ్ల సాప్ట్వేర్ ఇంజనీర్ ఈస్తర్ అనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. -
మహిళా సాప్ట్వేర్ ఇంజనీర్ హత్య