works not completed
-
డిపో ఎప్పుడో?
నర్సాపూర్: నర్సాపూర్‌లో ఆర్టీసీ డిపో నిర్మాణం నత్తనడకన సా...గుతోంది. మూడు నెలలుగా పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు చేపట్టిన వాటికి నిధులు విడుదల కానందునే సదరు కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడని సమాచారం. 20 ఏళ్లక్రితం డిపో ఏర్పాటుకు అప్పట్లో రవాణ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు ముందుకు సాగింది లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం.. సీఎం కేసీఆర్ కావడంతో ఇక్కడ డిపో ఏర్పాటవుతుందని ప్రజలు ఆశించారు. ఈ మేరకు గత ఏడాది డిపో ఏర్పాటుకు ఒక రూపం వచ్చింది. గత ఏడాది మే 9న మెదక్‌లో జరిగిన సమావేశంలో నర్సాపూర్‌కు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే నెలలో డిపో ఏర్పాటుకు రూ.పది కోట్లు మంజూరయ్యాయి. జూన్‌లో టెండర్లు పూర్తి చేయగా జూలై 26న అప్పటి మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మ, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులతో కలిసి డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ డిపో నిర్మాణానికి హామీ ఇవ్వడంతో పాటు రూ.పది కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆ నిధులతో ఆరు నెలల్లో డిపో నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామని ప్రకటించారు. 26 బస్సులతో పాటు 150 మంది సిబ్బందిని నియమించి సేవలందిస్తామని హామీ ఇచ్చారు. పదకొండు నెలలు కావస్తున్నా .. మంత్రి ప్రకటించి 11 నెలలు కావస్తున్నా పనులు ఇంకా పునాది స్థాయిలో ఉండడం గమనార్హం. జూలైలో శంకుస్థాపన చేయగా ఆగస్టులో డిపో నిర్మాణ పనులు ప్రారంభించారు. షెడ్డు కోసం ఐరన్ రాడ్స్ ఫ్రేంలు ఏర్పాటు చేసినా వాటికి పైకప్పు వేసే పనులతో పాటు ఇతర పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. మరో భవన నిర్మాణం కోసం పునాదులు తీసి వదిలేశారు. ప్రహరీ నిర్మాణ పనులు సైతం అసంపూర్తిగానే ఉన్నాయి. డిపో ఆవరణలో పెట్రోలుబంక్ ఏర్పాటు చేసి అద్దెకివ్వాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా బంకు నిర్మాణ పనులు హైదరాబాద్ రోడ్డును ఆనుకుని చేపట్టగా తుది దశకు చేరాయి. పెట్రోలు బంకు పనులు చివరి దశకు వచ్చినా డిపో పనులు మాత్రం ఇంకా పునాది స్థాయిలోనే ఉండడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల కానందునే..? ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కానందునే డిపో నిర్మాణ పనులు ఆగాయని తెలిసింది. డిపో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పది కోట్ల రూపాయలు మంజూరు చేయగా టెండరు పూర్తి చేయడం, శంకుస్థాపన, నిర్మాణ పనులు చేపట్టడం వరుసగా పూర్తి చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత నిధులు విడుదల చేయనందునే పనులకు బ్రేక్ పడినట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు రూ.కోటి విలువ చేసే పనులను సదరు కాంట్రాక్టరు చేపట్టగా అతనికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కానందున పనులను ఆపి వేశాడని తెలిసింది. ఇప్పటికైనా డిపో నిర్మాణం విషయంలో అధికారులు, ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. -
నిర్లక్ష్యం చేస్తే చర్యలు
వంగూరు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న మిషన్ కాకతీయ చెరువు మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేయిస్తానని ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ అన్నారు. మంగళవారం వంగూరు మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మిషన్ కాకతీయ పనులు వంగూరు మండలంలో వేగవంతంగా జరగకపోవడం, ఫేస్–1, ఫేస్–2లో ఐదు చెరువులు పూర్తికాకపోవడం, మూడు, నాలుగు దశల్లో మంజూరైన చెరువుల పనులను పూర్తి చేయకపోవడం కొన్నింటిని ప్రారంభించకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం.. గొలుసుకట్టు చెరువుల ద్వారా రైతులకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయలను కేటాయిస్తుంటే అధికారులు, కాంట్రాక్టర్లు కమీషన్ల కోసం కక్కుర్తిపడి పనులు ఆలస్యం చేస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల అన్నారు. అవసరమూతే సంబంధిత అధికారులు చెరువుల వద్దే ఉండి పనులు చేయించాలని ఇరిగేషన్ ఏఈ తిరుపతయ్యను ఆదేశించారు. చర్యలు తీసుకోవాలి అలాగే సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన హార్టికల్చర్, ఆర్టీసీ, ఎక్సైజ్, సోషల్ వెల్ఫేర్, ఆర్అండ్బీ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంపీడీఓను ఆదేశించారు. మూడు నెలలకోసారి జరిగే సర్వసభ్య సమావేశానికి కూడా హాజరు కావడానికి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారుల తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. సమస్యలు పరిష్కరించాలి సభలో చౌదర్పల్లి సర్పంచ్ అంజన్‌రెడ్డి, పోతారెడ్డిపల్లి సర్పంచ్ శంకర్, గాజర సర్పంచ్ చంద్రయ్య తదితరులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారులు అధ్యయనం చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సర్పంచ్‌లకు సన్మానం ఉమ్మడి వంగూరు మండలంలోని 24 గ్రామపంచాయతీల సర్పంచ్‌లకు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పదవీ కాలాన్ని పూర్తిచేసుకోవడం, ప్రస్తుత సర్పంచ్‌లకు చివరి సర్వసభ్యసమావేశం ఇదే కావడంతో వారికి శాలువాలు, దండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు మాట్లాడుతూ ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి కోసం వారు కష్టపడిన తీరు, గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యే, అధికారులు సహకరించిన విధానం తదితర అంశాలను నెమరు వేసుకున్నారు. తమ పదవీకాలం పూర్తయినప్పటికీ గ్రామాల్లో తాము చేపట్టిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ భీముడు నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ సుశీల్‌కుమార్, ఎంపీడీఓ హిమబిందు, కోఆప్షన్ సభ్యుడు హమీద్, ఎంఈఓ శంకర్‌నాయక్, వ్యవసాయాధికారిణి తనూజారాజు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘మంజీర ’.. పారేనా బిరబిర
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన ‘మంజీర’ పథకానికి టెండర్ల ప్రక్రియలో నెలకొన్న జాప్యం శాపంగా పరిణమించింది. ఈ పథకానికి ఏడాదిన్నర క్రితం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ(నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్) పథకం కింద రూ.40 కోట్లు మంజూరుకాగా ఇందులో రెండు నెలల క్రితం రూ.10 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా రూ.30 కోట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో జాప్యం నెలకొంది. ఇటీవల టెండర్లు నిర్వహించినా.. సాంకేతిక కారణాలతో దానిని నిలిపివేశారు. మరోసారి టెండర్ నిర్వహించడానికి హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ చీఫ్ కార్యాలయ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. గజ్వేల్‌తోపాటు జిల్లాలోని నర్సాపూర్, దుబ్బాక, మెదక్ నియోజకవర్గాల్లో 20 వుండలాల పరిధిలోని 960 గ్రావూలకు నీరందించే లక్ష్యంతో ‘మంజీర’ పథకం పనులు 2007లో ప్రారంభవుయ్యూరుు. సాలీనా వుంజీరానది నుంచి 0.7 టీఎంసీల నీటిని ఈ పథకం కోసం వాడుకోవాలని నిర్ణయించారు. తర్వాత దీనిని 0.77కి పెంచారు. ఈ క్రమంలోనే గజ్వేల్ నియోజకవర్గంలో ఈ పథకానికి సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో ‘మంజీర’ పథకం పనులు పూర్తిచేయడానికి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకం ద్వారా ఏడాదిన్నర క్రితం రూ.40 కోట్లు మంజూరు కాగా ఈ నిధులతో నియోజకవర్గంలోని తూప్రాన్, వర్గల్, ములుగు, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లోని 129 గ్రామాల్లో పైప్‌లైన్ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉన్నది. అంతేగాకుండా పలుచోట్ల ఓహెచ్‌బీఆర్ ట్యాంకుల నిర్మాణం జరగనుంది. కానీ కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం స్టేట్ టెక్నికల్ కమిటీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉండగా ఈ ప్రక్రియలో నెలల తరబడి జాప్యం నెలకొంది. ఫలితంగా ప్రభుత్వం మంజూరుచేసిన రూ.40 కోట్లల్లో కేవలం రూ.10 కోట్లకు సంబంధించి మాత్రమే ఈ ప్రక్రియ పనులు సాగుతున్నాయి. మిగిలిన రూ.30 కోట్ల వినియోగానికి కూడా ప్రభుత్వం ఆమోదం పలికింది. ఇందుకు సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లోని ఈఎన్సీ కార్యాలయ వర్గాలు టెండర్లను నిర్వహించినా సాంకేతికలోపాల కారణంగా దీనిని నిలిపివేశారు. మరోసారి టెండర్‌ను నిర్వహించడానికి ఆ కార్యాలయ వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే పనులు ముందుకు సాగవనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే నిజమైతే వేసవిలో గ్రామాలకు ‘మంజీర’ నీరందక దాహార్తి తప్పదనే ఆందోళన ఇక్కడి ప్రజల్లో నెలకొంది.