గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన ‘మంజీర’ పథకానికి టెండర్ల ప్రక్రియలో నెలకొన్న జాప్యం శాపంగా పరిణమించింది. ఈ పథకానికి ఏడాదిన్నర క్రితం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ(నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్) పథకం కింద రూ.40 కోట్లు మంజూరుకాగా ఇందులో రెండు నెలల క్రితం రూ.10 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా రూ.30 కోట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో జాప్యం నెలకొంది. ఇటీవల టెండర్లు నిర్వహించినా.. సాంకేతిక కారణాలతో దానిని నిలిపివేశారు. మరోసారి టెండర్ నిర్వహించడానికి హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ చీఫ్ కార్యాలయ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. గజ్వేల్‌తోపాటు జిల్లాలోని నర్సాపూర్, దుబ్బాక, మెదక్ నియోజకవర్గాల్లో 20 వుండలాల పరిధిలోని 960 గ్రావూలకు నీరందించే లక్ష్యంతో ‘మంజీర’ పథకం పనులు 2007లో ప్రారంభవుయ్యూరుు.
సాలీనా వుంజీరానది నుంచి 0.7 టీఎంసీల నీటిని ఈ పథకం కోసం వాడుకోవాలని నిర్ణయించారు. తర్వాత దీనిని 0.77కి పెంచారు. ఈ క్రమంలోనే గజ్వేల్ నియోజకవర్గంలో ఈ పథకానికి సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో ‘మంజీర’ పథకం పనులు పూర్తిచేయడానికి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకం ద్వారా ఏడాదిన్నర క్రితం రూ.40 కోట్లు మంజూరు కాగా ఈ నిధులతో నియోజకవర్గంలోని తూప్రాన్, వర్గల్, ములుగు, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లోని 129 గ్రామాల్లో పైప్‌లైన్ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉన్నది. అంతేగాకుండా పలుచోట్ల ఓహెచ్‌బీఆర్ ట్యాంకుల నిర్మాణం జరగనుంది. కానీ కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం స్టేట్ టెక్నికల్ కమిటీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉండగా ఈ ప్రక్రియలో నెలల తరబడి జాప్యం నెలకొంది.
ఫలితంగా ప్రభుత్వం మంజూరుచేసిన రూ.40 కోట్లల్లో కేవలం రూ.10 కోట్లకు సంబంధించి మాత్రమే ఈ ప్రక్రియ పనులు సాగుతున్నాయి. మిగిలిన రూ.30 కోట్ల వినియోగానికి కూడా ప్రభుత్వం ఆమోదం పలికింది. ఇందుకు సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లోని ఈఎన్‌సీ కార్యాలయ వర్గాలు టెండర్లను నిర్వహించినా సాంకేతికలోపాల కారణంగా దీనిని నిలిపివేశారు. మరోసారి టెండర్‌ను నిర్వహించడానికి ఆ కార్యాలయ వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే పనులు ముందుకు సాగవనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే నిజమైతే వేసవిలో గ్రామాలకు ‘మంజీర’ నీరందక దాహార్తి తప్పదనే ఆందోళన ఇక్కడి ప్రజల్లో నెలకొంది.
‘మంజీర ’.. పారేనా బిరబిర
Published Sat, Jan 4 2014 12:05 AM | Last Updated on Tue, Oct 9 2018 4:44 PM
Advertisement
Advertisement