World language
-
తెలుగును ప్రపంచ భాషగా మార్చాలి
తిరుపతి తుడా: తెలుగును ప్రపంచ భాషగా, ఆధునిక భాషగా మార్చితేనే మాతృభాషకు న్యాయం జరుగుతుందని కేంద్ర హిందీ అకాడమీ చైర్మన్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిప్రాయపడ్డారు. దీనికోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో హైదరాబాద్ ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, ఎస్వీయూ తెలుగు అధ్యయనశాఖ ఆధ్వర్యంలో ‘తెలుగులో లక్షణ గ్రంథాలు-సమీక్ష’ అనే అంశంపై రెండు రోజులు జాతీయ సదస్సు నిర్వహించారు. మంగళవారం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సంస్కృతం నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు తప్ప తెలుగు నేర్చుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. సంస్కృతం చదివితే నూటికి నూరు మార్కులు సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఉండడం సరికాదన్నారు. ఏ భాషలకూ మనం వ్యతిరేకం కాదన్నారు. అయితే ఆంగ్ల భాష వ్యామోహంలో తెలుగును విస్మరించకూడదన్నారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నారు. తెలుగును విస్మరిస్తే భవిష్యత్ తరాలు క్షమించవన్నారు. ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో మాతృభాష దాడికి గురవుతోందన్నారు. పవిత్ర పదాలతో భక్తి భావంగా పిలిచే అభిషేక అనంత దర్శనం, అర్చనానంత దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ, సర్వదర్శనం వంటి పదాలను మరుగున పడేసి ఏఏడీ, ఏడీ, ఎస్డీఎస్, టీఎంఎస్ వంటి పదాలతో పిలిచే దుస్థితిలో టీటీడీ ఉన్నతాధికారులు ఉండటం తెలుగు భాష దౌర్భాగ్యమన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, విలువలున్న మాతృభాషకు ధార్మిక సంస్థలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అకాడమి మాజీ అధ్యక్షులు, ఎస్వీయూ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో 1672 భాషలు ఉన్నాయన్నారు. సాహిత్య పరంగా తెలుగు భాష అగ్రస్థానంలో ఉందన్నారు. ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య మేడసాని దేవరాజులు నాయుడు మాట్లాడుతూ వర్సిటీ పరంగా తెలుగు అభివృద్ధికి సహకారం అందించేందుకు ముందుంటామన్నారు. 29 మంది విద్యర్థులు సెమినార్‌పై పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు శరత్‌జ్యోత్స్న, మునిరత్నమ్మ, విజయలక్ష్మి, పేటశ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
తెలుగు కోయిల... పడమటి పల్లవి...
సంగీతం ప్రపంచ భాష.. మదిలోని భావాలను వ్యక్తపరిచే సాధనం.. అయినా సంగీతంలో తేడాలున్నాయి. వెస్ట్రన్, ఈస్ట్రన్ అంటూ... అయితే కొంతమంది సంగీతకారులు ఈ ఎల్లలు చెరిపేస్తున్నారు. పాశ్చాత్య సంగీతపు గుబాళింపును, భారత సంగీత సౌరభాన్ని మిశ్రమం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే భావన రెడ్డిది కూడా. ఈ తెలుగు కోయిల ఎల్లలు దాటి హాలీవుడ్ స్థాయికి చేరింది. తను అభ్యసించింది భారత శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యాలే అయినా తను ఒక రాక్‌స్టార్‌లా రాణిస్తుండటమే గమ్మత్తు... నేర్చుకొన్నది శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం. కుటుంబ నేపథ్యం కూడా అలాంటిదే. అయితే వెస్ట్రన్ మ్యూజిక్‌లో వావ్ అనిపిస్తోంది. ‘జాయ్‌రైడ్-3’ అనే హాలీవుడ్ సినిమాలో పాడే ఛాన్స్‌ను సంపాదించింది. కామన్వె ల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ సమయంలో: భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, దేశానికి చెందిన అనేకమంది రాజకీయ, సామాజిక, క్రీడాప్రముఖులందరూ కొలువైనవేళ, మనదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ సమయంలో అద్భుతమైన తెలుగింటి కూచిపూడి నాట్యంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల మనసులను దోచుకొంది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో: భావన ఒక రాక్‌స్టార్. సొంతంగా పాట రాసుకొని, కంపోజ్ చేసుకొని, పాటలు పాడుతూ బ్యాండ్‌తో కలసి, సోలోగా ప్రదర్శనలిస్తూ ఉంటుంది. మ్యూజిక్ కాంపిటీషన్లలో భావన బ్యాండ్‌కు ఉన్న క్రేజే వేరు! ఇలా రెండు విభిన్నమైన ప్రాంతాల్లో, విభిన్నమైన కళల్లో, విభిన్నమైన గుర్తింపును సంపాదించుకొంది. కూచిపూడి నృత్యంలో ప్రపంచ ప్రసిద్ధులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలైన రాజారెడ్డి, రాధారెడ్డిల కూతురే ఈ భావన. తల్లిదండ్రుల శిష్యరికంలో కూచిపూడి నేర్చుకొని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలను ఇచ్చింది. అయితే ఇదే స్థాయిలో ఆమెకు సంగీతం మీద కూడా ఆసక్తి ఉంది. ఈ ఆసక్తి ఆమెను ఊరకుండనీయనలేదు. ఢిల్లీలో పుట్టి పెరిగిన భావన తన వెస్ట్రన్ మ్యూజిక్ గోల్‌ను రీచ్ కావడానికి లాస్ ఏంజెలెస్ వెళ్లింది. కర్ణాటక సంగీతంపై ఉన్న పట్టు కూడా ఆమెకు బాగా ఉపయోగపడింది. గ్రామీ నామినీలతో కలిసి పని చేసింది! సొంతంగా గీతాలు రాసుకొని ‘టాంగిల్డ్ ఎమోషన్స్’ అనే ఈపీ(ఎక్స్టెండ్ ప్లే)ని రూపొందించింది భావన. గ్రామీ అవార్డ్‌కు నామినేట్ అయిన వ్యక్తులతో కలసి పనిచేసి ఆ మ్యూజికల్ రికార్డ్‌ను విడుదలచేసింది. ఇందులోని భావన వాయిస్‌కు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. భావన స్వరాన్ని విన్న హాలీవుడ్ దర్శకుడు క్లౌడ్ఫోయిజ్ తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. దీంతో మన తెలుగమ్మాయికి అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఓ నిరాశాపూరిత ప్రేమికురాలి మనసు ఆవిష్కరణ... ‘‘ప్రేమ మిగిల్చిన విషాదంతో నిరాశలో కూరుకుపోయిన ఒక అమ్మాయి మనసు ధ్వనే ‘టాంగెల్డ్ ఇన్ లవ్’. గత ప్రేమ చేదు అనుభవంతో, మరొకరిని ప్రేమించలేక ఆమె పడే వేదననే అక్షర రూపంలోకి తీసుకొచ్చాను. దీన్ని రికార్డింగ్ రూపంలోకి తీసుకురావడానికి ఏడాది కాలం పట్టింది. ‘స్మెల్ లైక్ రెయిన్’ సాంగ్ నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా నేను తొలిసారి హాలీవుడ్ సినిమా కోసం పాడాను. ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ వారి సినిమాలోని ఓపెనింగ్ సాంగ్‌లో స్వరం వినబోతున్నారు. నాకు ఇది నిజంగా గ్రేట్ ఎక్సైట్మెంట్. నా సక్సెస్ విషయంలో మ్యూజిషియన్ల, స్నేహితుల సహకారం మరవలేనిది. - భావన -
భాషణం : అర్థం ఉంది... అనువాదమే లేదు!
భాష సముద్రమైతే అందులోని జీవ చరాలు పదాలు! సముద్రగర్భంలో వింతవింత ప్రాణులు ఉన్నట్లే ప్రపంచ భాషల్లోనూ మనకు తెలియని, మన వాడుకలో లేని పదాలు కోకొల్లలు. వాటి భావాలను ఇంగ్లిషు సహాయంతో తెలుసుకోగలం కానీ, మన భాషలోకి నేరుగా అనువదించుకోలేం. అలాంటి కొన్ని పదాలు ఈవారం ‘భాషణం’లో మీ కోసం. ఔత్సాహికులు ఎవరైనా ఈ పదాలకు తెలుగు అర్థాలను సృష్టించగలిగితే తెలుగు భాషకు అది గొప్ప ఉపకారం. Sobremesa (సొబెరెమేసా - స్పానిష్): లంచ్గానీ, డిన్నర్ గానీ అయ్యాక భుక్తాయాసం తీర్చుకుంటూ ఎవరితో అయితే కలిసి కూర్చుని భోంచేశామో వారితో మాట్లాడుతూ గడిపిన సమయం ‘సొబెరెమేసా’. Komorebi (కొమోరొబీ - జపనీస్): చెట్ల ఆకుల సందుల్లోంచి పడే సూర్యకాంతి ‘కొమోరొబీ’. Age-otri (ఎజాట్రి - జపనీస్): హెయిర్ కట్ చేయించుకున్నాక ముఖం వింతగా, వికారంగా కనిపించడం. Gigi (గిగిల్ - ఫిలిప్పినో): అందంగా ఉన్నదాన్ని గిల్లాలనిపించే కోరిక ‘గిగిల్’. Backpfeifengesich్ట (బ్యాక్ఫౌఫింగెసిస్ట్ - జర్మన్): పచ్చడి పచ్చడి చేసి తీరవలసిన ముఖం ‘బ్యాక్ఫౌఫింగెసిస్ట్’. L'esprt del'escalier (లెస్పార్టో డెస్క్లేయిర్ - ఫ్రెంచి): మాటకు మాట చెప్పలేక, ఆ తర్వాత... అరే ‘ఫలానా మాట అనివుంటే, ముఖం మీద కొట్టినట్టు ఉండేది కదా’ అని అదే పనిగా ఫీల్ అవడం ‘లెస్పార్టో డెస్క్లేయిర్’. Waldeinsamkei్ట (వాల్డ్ ఐమ్జంకైట్ - జర్మన్): చెట్ల మధ్య ఒంటరిగా ఉన్నపుడు కలిగే భయం లాంటిది ‘వాల్డ్ఐమ్జంకైట్’. Tretar (ట్రిటార్ - స్వీడిష్): ఇందులో టార్ అంటే కప్పులోని కాఫీ. స్వీడిష్‌లో patar (పాటార్) అంటే మళ్లీ ఒకసారి కప్పులో కాఫీ పోయడం. ఆ తర్వాత కూడా రెండోసారి, మూడోసారి (తాగేవాళ్లను బట్టి) నింపుతూ ఉండడం ‘ట్రిటార్’. Cualacino (క్యువలాకినో - ఇటాలియన్): చల్లటి ద్రవం ఉన్న గ్లాసు అడుగుభాగం, టేబుల్ మీద ఏర్పరిచే తడి గుర్తు ‘క్యువలాకినో’. Depaysement (డిపీజ్మెంట్ - ఫ్రెంచ్): సొంతదేశంలో లేనప్పుడు మగవాళ్లకు కలిగే ఒకలాంటి స్థిమితమైన భావన ‘డిపీజ్మెంట్’. Mangata (మాంగాటా - స్వీడిష్): సముద్రపు నీటి ఉపరితలం మీద చంద్రుని కాంతి ఏర్పరిచే వెలుగుదారి ‘మాంగాటా’. Pana po'o (పనపూ - హవాయియన్): మర్చిపోయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో బుర్రగోక్కోవడం ‘పనపూ’. Jayus (జాయెస్ - ఇండోనేషియన్): నవ్వురాని జోకు, నవ్వొచ్చే విధంగా చెప్పబడని జోకు, విధిలేక నవ్వవలసి వచ్చిన జోకు ‘జాయెస్’. Pochemuchka (పోకేమూకా - రష్యన్): నిర్విరామంగా ప్రశ్నలు అడుగుతుండే వ్యక్తి ‘పోకేమూకా’. Iktsuarpok (ఎట్సూఆర్పోక్ -ఇన్యూట్ (ఆర్కిటిక్ ప్రాంతం): మాటిమాటికే బయటికి చూస్తూ ఎవరైనా వస్తున్నారేమోనని అనుకోవడం ‘ఎట్సూఆర్పోక్’. Pisanzapra (పిసాన్ జప్రా - మాలే): అరటిపండు తినడానికి పట్టే సమయం ‘పిసాన్ జప్రా’. -
ఆమె పలుకే ‘బంగారం’!
నివాళి: ‘‘సాహిత్యం అంటే సమాజానికి హితవు చేసే రచన అని అర్థం. పద్యం, గద్యం ఆఖరికి సినిమా పాటల్లో కూడా ఒక ప్రయోజనం ఉండాలి. అదీ సాహిత్యం అంటే’’ - మాలతీ చందూర్ కొత్త కెరటం హొయలునీ, ఉధృతినీ స్వాగతిస్తూనే పాత కెరటాల పదునునీ, లోతునీ కూడా పలకరించడం ప్రవాహగమనం తెలి సిన వారే చేయగలరు. జలరాశి అనంతత్వం బోధపడేది కూడా అప్పుడే. అనంతమైన ఈ సాహితీ ప్రవాహాన్నీ, సృజనరాశినీ అలాంటి దృష్టితో చూసిన అరుదైన తెలుగు రచయిత్రి మాలతీ చందూర్ (1930-2013).‘ఆంధ్రప్రభ’ సచిత్రవారపత్రికలో ఐదు దశాబ్దాల పాటు నిరంతరాయంగా ఒకే శీర్షికను (ప్రమదావనం) నిర్వహించిన ఘనత ఆమె ఒక్కరి సొంతం. ప్రపంచ మహారచయితలందరి నవలలను మూడు దశాబ్దాల పాటు తెలుగు వారికి పరిచయం చేసిన మాలతీచందూర్‌కు తెలుగు పాఠకలోకం సదా రుణపడి ఉంటుం ది. దాదా పు 150 నవలా పరిచయాలు ఆమె కలం నుంచి జాలువారాయి. మాలతీచందూర్ కథకురాలు, నవలా రచయిత్రి, వ్యాసకర్త. అరుదైన కాలమిస్ట్. ‘రవ్వలడ్డూలు’పేరుతో మాలతీ చందూర్ తన తొలి కథను ‘ఆంధ్రవాణి’లో ప్రచు రించారు. ‘లజ్ కార్నర్’, ‘నీరజ’ కథలు ‘భారతి’లో అచ్చయ్యాయి. ‘‘సాహిత్యం అంటే సమాజానికి హితవు చేసే రచన అని అర్థం. పద్యం, గద్యం ఆఖరికి సినిమా పాటల్లో కూడా ఒక ప్రయోజనం ఉండాలి. అదీ సాహిత్యం అంటే’’ అని, ‘నన్ను అడగండి’ అనే మాలతీ చందూర్ నిర్వహించిన శీర్షిక కోసం పాఠకుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారామె. ఆమె ప్రతి రచన ఈ ఆశయాన్నే ప్రతిఫలిస్తుం ది. జాతీయోద్యమం, మధ్యతరగతి జీవితం, మహిళల దుస్థితి ఆమె నవలలకు ఇతివృత్తాలు. అలనాటి రచయిత్రులందరిలోనూ కని పించే మహిళా పక్షపాతం ఆమె రచనలలో కూడా గమనిస్తాం. శీర్షికల ద్వారా ఇచ్చిన సమాధానాలలో ఆమె తరచు ముగ్గురు మహి ళా నేతల జీవితాలను ప్రస్తావించేవారు. వారే ప్రపంచ రాజకీయాలలో విశిష్టంగా కనిపిం చిన సిరిమావో బండారునాయకే (శ్రీలంక), ఇందిరాగాంధీ (భారత్), గోల్డామీర్ (ఇజ్రాయెల్). చాలా సులభశైలిలో సవివరంగా ఆమె సమాధానాలు ఉండేవి. ‘రాముడత్తయ్య’ ప్రధాన పాత్రగా ఆమె రాసిన ‘హృదయనేత్రి’ నవల జాతీయోద్యమ నేపథ్యంలో సాగుతుంది. రాముడత్తయ్య రాట్నం వడుకుతుంది. పిల్లలు అడిగితే జాతీయోద్యమాన్ని కథలుగా చెబుతుంది. గాంధీజీ తెల్లవాళ్లను తరిమేసి దేశానికి స్వాతంత్య్రం తెస్తారని ఘంటాపథంగా చెప్పేదామె. రాముడత్తయ్యను ఖద్దరు చీరలో చూపారామె. ఈ నవలకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘శతాబ్ది సూరీడు’ నవలలో మారుతున్న కాలంలో మహిళలు సాధించిన పురోగతిని ఆవిష్కరించారు. బండెడు చాకిరిని మౌనంగా చేసే నాటి వితంతువుల దుస్థితితో మెదలుపెట్టి నాలుగుతరాల తరువాత అక్షరానికి నోచుకున్న మహిళ ప్రయాణం ఇందులో కని పిస్తుంది. సంసారంలో, సమాజంలో ఎవరిది తప్పయినా స్త్రీయే ఎందుకు సర్దుకుపోవాలి? స్త్రీపురుషుల ఘర్షణలో ఎప్పుడూ ఓటమి భావన స్త్రీకే ఎందుకు? వంటి ప్రశ్నలతో సాగే నవల ‘ఆలోచించు!’. ఇంకా ‘చంపకం’, ‘వైశాఖి’, ‘శిశిర వసంతం’, ‘ఎన్ని మెట్లెక్కినా...’, ‘భూమిపుత్రి’, ‘మనసులోని మనసు’ వంటి నవలలు రాశారు. పలువురి చరిత్రపురుషుల, మహిళల జీవిత చిత్రాలను కూడా మాలతి రాశారు. ‘వినదగు విషయాలు’ వంటి సాహిత్యేతర పుస్తకాలు కూడా వెలువరించారు. నవలా పరిచయానికి సాహితీ ప్రక్రియ గౌరవాన్ని తెచ్చిన రచయిత్రి మాలతీచందూర్. ఈ ప్రక్రియతో ఆధునిక ప్రపంచ నవలను తెలుగువారికి పరిచయం చేయడానికి ఆమె చేసిన కృషి అసాధారణమైనది. 1845 నాటి ‘ది కౌంట్ ఆఫ్ మాంటీ క్రిష్టో’ (అలెగ్జాండర్ డ్యూమాస్), 1859 నాటి ‘ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్’ (చార్లెస్ డికెన్స్) మొదలు, నిన్న మొన్న వచ్చిన ‘లజ్జ’ (తస్లీమా నస్రీన్) వరకు ఈ నవలా పరిచయాలు సాగాయి. ప్రపంచ భాషలతో పాటు కొన్ని భారతీయ భాషా నవలలను కూడా పరిచయం చేశారు. ‘పాత కెరటాలు’ శీర్షికతో వచ్చిన ఈ పరిచయాలే పాతకెరటాలు 1, 2; నవలా మంజరి 1, 2, 3, 4, 5 సంకలనాలుగా వెలువడ్డాయి.ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే (ఆస్కార్ వైల్డ్), పెయింటెడ్ వెయిల్, ఆఫ్ హ్యూమన్ బాం డేజ్ (మామ్), రాజశేఖర చరిత్రము (వీరేశలింగం), ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్ (హెమింగ్వే), సైలాస్ మారినర్ (జార్జి ఎలియెట్), ది ఫౌం టెన్ హెడ్ (అయ్న్ ర్యాండ్), చమ్మీన్ (తగళి శివశంకర్ పిళ్లై), డాక్టర్ ఝివాగో (బోరిస్ పాస్టర్నాక్), స్ప్రింగ్స్నో (యుకెయో మిషి మా), గుడ్ ఎర్త్, ది ఎగ్జయిల్ (పెర్ల్ ఎస్ బక్), ఎయిర్పోర్ట్ (ఆర్థర్ హెయిలీ), కొన్ని సమయాలలో కొందరు వ్యక్తులు (జయకాంతన్), అసురవిత్తు (ఎంటీ వాసుదేవన్ నాయర్), గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ (అరుంధతీ రాయ్); ఇంకా థామస్ హార్డీ, జేబీ ప్రీస్ట్లీ, మార్గరెట్ మిశ్చెల్, ఆనె ఫ్రాంక్, మేరియో పూజో, ఎలెక్స్ హెలీ, జెఫ్రీ ఆర్చర్ వంటి రచయిత నవలలు కూడా పరిచయం చేశారు. మాలతీ చందూర్ భర్త, ‘జగతి’ మాసపత్రిక సంపాదకుడు ఎన్ ఆర్ చందూర్ కొద్దికాలం క్రితమే కన్నుమూశారు.నూజీవీడు మామిడిపళ్లని నెహ్రూ బెర్నార్డ్‌షాకు కానుకగా ఇచ్చారట. మాలతీ చందూర్ అక్కడ పుట్టిన మావిచిగురే! - డా॥గోపరాజు నారాయణరావు