World stock markets
-
యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్‌లు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆరి్థక వ్యవస్థలకు... చినికి చినికి ‘మిసైళ్ల’వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. తాజాగా ఇరాన్ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. క్రూడ్ ధరలు భగ్గుమనడం (10% పైగా జంప్) మనలాంటి వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 4,422 పాయింట్లు, నిఫ్టీ 1,383 పాయింట్లు, అంటే 5.3% చొప్పున పతనమయ్యాయి. గడిచిన రెండేళ్లలో వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలనేది విశ్లేషకుల మాట!! నాన్‌స్టాప్‌గా దౌడు తీస్తున్న బుల్‌కు పశి్చమాసియా యుద్ధ ప్రకంపనలు బ్రేకులేశాయి. రోజుకో కొత్త ఆల్‌టైమ్ రికార్డులతో చెలరేగిన దేశీ స్టాక్ మార్కెట్లో ఎట్టకేలకు కరెక్షన్ మొదలైంది. సూచీలు 5 శాతం పైగా క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.26 లక్షల కోట్లు ఆవిరైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటిదాకా మార్కెట్‌ను పరుగులు పెట్టించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో రివర్స్‌గేర్ వేశారు. మరోపక్క, చైనా ఉద్దీపక ప్యాకేజీ ప్రభావంతో మన మార్కెట్ నుంచి వైదొలగి అక్కడికి క్యూ కడుతున్నారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు ఇది మంచి చాన్సని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో మార్కెట్లు స్వల్పకాలానికి భారీగా పడటం లేదంటే దిద్దుబాటుకు లోనైనప్పటికీ... మళ్లీ కొద్ది వారాలు, నెలల్లోనే పుంజుకున్నాయని, భారీగా లాభాలను పంచాయని గణాంకాలతో సహా వారు ఉటంకిస్తున్నారు.క్వాలిటీ స్టాక్స్.. మంచి చాయిస్! స్వల్పకాలిక తీవ్ర ఒడిదుడుకుల ఆధారంగా ఇన్వెస్టర్లు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదని.. గతంలో మంచి పనితీరు కనబరిచి తక్కువ ధరల్లో (వేల్యుయేషన్లు) దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఎంచుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పెట్టుబడులకు పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, మంచి డివిడెండ్ రాబడులను అందించే స్టాక్స్ కూడా ఈ పతనంలో కొనుగోలుకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్ అనేది వారి అభిప్రాయం. ఊరించే వేల్యుయేషన్లు... ‘పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను నిరి్మంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని రైట్ రీసెర్చ్ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ చెప్పారు. భారీ పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్) నిష్పత్తితో కూడిన అధిక వేల్యుయేషన్ స్టాక్స్.. ఈ కరెక్షన్లో మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో చేతిలో క్యాష్ పుష్కలంగా ఉన్న మదుపరులు... తక్కువ ధరల్లో ఇలాంటి ఊరించే షేర్లను కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు మార్కెట్ పరిశీలకులు.‘మార్కెట్లో ఈ కుదుపులు సద్దుమణిగి, పరుగులంకించుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు భారీ లాభాలను అందించే అవకాశం ఉంటుంది’ అని వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వాప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవలి బుల్ రన్‌కు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు దన్నుగా నిలిచాయి, తాజా కరెక్షన్లో ఇవే భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక దృష్టితో లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకోవడం తెలివైన ఆప్షన్ అనేది నిపుణుల సలహా!ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. తమ లాంగ్ పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మరో 5 శాతం క్షీణించే అవకాశం ఉంది. – రాజేశ్ పలి్వయా, వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ సెక్యూరిటీస్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
గణాంకాలు, ఫలితాల ప్రభావం
ద్రవ్యోల్బణ గణాంకాలు ♦ చివరి బ్యాచ్ క్యూ3 ఫలితాలు ♦ యూపీ ఎన్నికల సరళి ♦ ఈ వారం మార్కెట్ ప్రభావిత అంశాలు ఇవే.. న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ సరళి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు ఈ వారం వెలువడే కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ. తదితర అంశాలు స్టాక్ సూచీల కదలికలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, చివరి బ్యాచ్ క్యూ3 ఫలితాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. నేడు(సోమవారం) మార్కెట్ ముగిసిన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, మంగళవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతాయి. ఇక ఈ వారంలో హిందాల్కో, ఎన్ఎండీసీ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, హెచ్‌పీసీఎల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదానీ ఎంటర్ప్రైజెస్, డీఎల్ఎఫ్, వేదాంత, నాల్కో, పవర్ ఫైనాన్స్ వంటి కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు వెలువడతాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ సరళిని బట్టి మార్కెట్ చలిస్తుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అబ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వారంలో మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. సోమవారం నాటి ట్రేడింగ్ ప్రారంభంలో గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం ఉంటుంది. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 94 పాయింట్లు లాభపడి 28,334 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 8,794 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. విదేశీ కొనుగోళ్ల జోరు.. నాలుగు నెలలుగా సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు ఫిబ్రవరిలో అడ్డుకట్ట పడింది. విదేశీ ఇన్వెస్టర్లపై పన్నుల విషయమై స్పష్టత రావడంతో ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.5,827 కోట్లు పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.2,088 కోట్లు, డెట్ సెగ్మెంట్లో రూ.3,739 కోట్లు చొప్పున పెట్టుబడలు పెట్టారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.80,310 కోట్లు విలువైన పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. -
తొలుత -170, ఆపై +170
- చివరికి 116 పాయింట్లు ప్లస్ - 27,207 వద్ద ముగిసిన సెన్సెక్స్ - 2 వారాల గరిష్టానికి మార్కెట్లు మార్కెట్ అప్డేట్ ప్రపంచ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రధాన సూచీలు 340 పాయింట్లస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఆసియా మార్కెట్ల నష్టాల కారణంగా సెన్సెక్స్ తొలుత నష్టాలతో మొదలైంది. 26,919 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ఆపై మిడ్ సెషన్ నుంచీ సెంటిమెంట్ బలపడటంతో నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. గరిష్టంగా 27,255కు చేరింది. చివరికి 116 పాయింట్ల లాభంతో 27,207 వద్ద స్థిరపడింది. ఇది రెండు వారాల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా తొలుత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ 25 పాయింట్లు బలపడి 8,146 వద్ద ముగిసింది. ప్రధానంగా టాటా మోటార్స్(4%), ఓఎన్జీసీ(3.5%), ఐటీసీ(3%), హీరో మోటో(1.5%), ఎస్బీఐ(1.5%) వంటి దిగ్గజాలు ప్రధాన సూచీలకు అండగా నిలిచాయి. వినియోగ వస్తు సూచీ 3% అప్ బీఎస్ఈలో వినియోగ వస్తువుల సూచీ అత్యధికంగా 3% పుంజుకోగా, ఎఫ్ఎంసీజీ 2%, ఆటో 1% చొప్పున లాభపడ్డాయి. మెటల్స్ 1%పైగా నష్టపోయింది. వినియోగ షేర్లలో పీసీ జ్యువెలర్స్ 20% జంప్‌చేయగా, సింఫనీ, వీఐపీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, వర్ల్‌పూల్, టైటన్, బ్లూస్టార్ 9-2% మధ్య పెరిగాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా, భెల్, టాటా స్టీల్, హిందాల్కో, ఇన్ఫీ 2.5-1.5% మధ్య క్షీణించాయి. న్యూలాండ్ ల్యాబొరేటరీస్: రైట్స్ ఇష్యూ సెప్టెంబరు 29న ప్రారంభమై అక్టోబరు 16న ముగుస్తుంది. ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ.25 కోట్లు సమీకరించనుంది. రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకు రూ.194 ప్రీమియం నిర్ణయించారు. ప్రతి 25 షేర్లకుగాను నాలుగు షేర్లు కేటాయిస్తారు.