బడ్జెట్ విషయంలో నిహారిక లిమిట్స్ పెట్టలేదు : యదు వంశీ
‘‘కమిటీ కుర్రోళ్ళు’ కథ రాసుకుని ఐదారు ప్రొడక్షన్ హౌసెస్‌లో ప్రీప్రొడక్షన్ పనులు చేశాను. కానీ నేను అనుకున్నట్లుగా తీయలేనేమోనన్న భయంతో బయటికొచ్చేశాను. ఆ తర్వాత నిహారికగారికి కథ చెప్పాను. సెట్స్‌లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారామె’’ అన్నారు దర్శకుడు యదు వంశీ. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ పతాకాలపై నిహారిక కొణిదెల సమర్పణలో నూతన నటీనటులు నటించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో యదు వంశీ మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ‘కమిటీ కుర్రోళ్ళు’లో చూపించాం. ఓ గ్రామంలో మరుసటి రోజు పంచాయితీ ఎన్నికలనగా, అక్కడ ముందు రోజు పొలిటికల్‌గా ఏం జరిగింది? ఆ ఊర్లో జరిగిన జాతరకు, రాజకీయాలకు ఉన్న లింక్ ఏంటి? అన్న అంశాలనే కాస్త వ్యంగ్యంగా చూపించా. నిహారికగారు మా కంటెంట్‌ను నమ్మారు. బడ్జెట్ విషయంలో లిమిట్స్ పెట్టకుండా.. సినిమాకు ఏం కావాలో అది చేశారు. ఇందులో మదర్ సెంటిమెంట్ ఓ హైలైట్ పాయింట్. చెప్పాలంటే ఇది ప్రతి కుర్రాడి బయోపిక్’’ అని చెప్పుకొచ్చారు. ‘కమిటీ కుర్రోళ్ళు’