
సీఎంను కలిసిన బోథ్ ఎమ్మెల్యే..
● నియోజకవర్గ సమస్యలను విన్నవించిన అనిల్ జాదవ్
బోథ్: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ని యోజకవర్గ సమస్యలు, ప్రజల ఆకాంక్షలను ము ఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా బోథ్ రె వెన్యూ డివిజన్ అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే బోథ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. నేరడిగొండ మండలంలో కుప్టి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాలని, పిప్పల్‌కోటి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించాలని, ఇచ్చోడలో పోలీస్ సబ్‌డివిజన్ ఏర్పాటు చేయాలని కోరా రు. అలాగే బరంపూర్ నుంచి మోర్కండి రోడ్డు ని ర్మాణానికి అటవీ అనుమతులు ఇచ్చి రహదారిని పూర్తి చేయాలన్నారు. సిరిచెల్మలోని పురాతన మల్లి కార్జున ఆలయం, బరంపూర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విన్నవించారు. ఈ మేరకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే
విద్యార్థుల సమస్యలపై ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ బు ధవారం అసెంబ్లీలో మాట్లాడారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందక గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలా గే మూడేళ్లుగా డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment