అన్నిరంగాల్లో మహిళల పాత్ర కీలకం
ఉట్నూర్‌రూరల్: అన్నిరంగాల్లో మహిళల పాత్ర కీలకమని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు..ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారని తెలిపారు. అనంతరం మహిళా ఉద్యోగులకు లంచ్ బాక్స్‌లు అందజేశారు.
నారీశక్తి పురస్కారాల ప్రదానం
నిర్మల్‌ఖిల్లా: అన్నిరంగాల్లో మహిళలు రాణించడం శుభ పరిణామమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో సోమవారం ‘పాటే మా ప్రాణం’సంగీత ఆకాడమీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ’నారీశక్తి పురస్కారాలు ప్రదానం చేశారు. డాక్టర్లు రజిని, చంద్రిక, న్యాయవాది నివేదిత, సుగుణ, ఎస్సై రోహిణి, ఎఫ్‌ఆర్వో శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి రాణి, కేజీబీవీ ఎస్‌ఓ లతాదేవి, విజయలక్ష్మి, స్వాతి, లక్ష్మి, శ్రీలత, రాజ్యలక్ష్మి పురస్కార గ్రహీతలు ఉన్నారు. అనంతరం వారిని సన్మానించారు. కార్యక్రమంలో కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ ముత్యంరెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, ప్రముఖవైద్యులు యు.కృష్ణంరాజు, సంగీత అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ నవ్య, కార్యదర్శి శ్రీకాంత్ సభ్యులు వాణిశ్రీ, కవిత, మమత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
అన్నిరంగాల్లో మహిళల పాత్ర కీలకం
Comments
Please login to add a commentAdd a comment