బాడీబిల్డింగ్ ఓవరాల్ చాంపియన్ వెంకటేశ్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాడీబిల్డంగ్ ఓవరాల్ చాంపియన్‌గా మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాలకు చెందిన మాసు వెంకటేశ్ నిలిచాడు. సీసీసీలో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ జూనియర్, సీనియర్, మాస్టర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. మాసు వెంకటేశ్ అన్ని కేజీల విభాగాల్లో మంచిర్యాల జిల్లా చాంపియన్‌గా నిలిచాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చాంపియన్ ఆఫ్ ద చాంపియన్ పోటీల్లోనూ విజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment