గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ
తాంసి: గ్రూప్–1 ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఇందులో పలువురుయువకులు ప్రతిభ కనబర్చారు. కొందరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. పరీక్ష రాసి ఉత్తమ మార్కులు సాధించారు. తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్‌కు చెందిన సురుకుంటి సచిన్.. 454.5 మార్కులు సాధించాడు. ఈయన వార్డు ఆఫీసర్‌గా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామానికి చెందిన ఎల్టి కార్తీక్‌రెడ్డి..443 మార్కులు సాధించాడు. బోథ్ మండలం ధనోర గ్రామానికి చెందిన నల్ల లావణ్యరెడ్డి..తాంసి మండలం హస్నాపూర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాయగా 441.5 మార్కులు సాధించింది. తాంసికి చెందిన జానకొండ అశోక్ పంచాయతీ కార్యదర్శిగా జైనథ్ మండలం సుందరగిరిలో విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాశాడు. 398.50 మార్కులు సాధించాడు.
గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ
గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ
గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment