సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలి
● డీఈవో ప్రణీత
కై లాస్‌నగర్: విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈవో ప్రణీత అన్నారు. బయోలాజికల్ సైన్స్ ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో బుధవారం జిల్లాస్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. 16 మండలాల నుంచి 72 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ప్రతి భ కనబరిచిన వారిని విజేతలుగా ఎంపిక చేశారు. తెలుగు మీడియం విభాగంలో తాంసి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆర్.బిందుజ ప్రథమ స్థానంలో నిలువగా, జైనథ్ మండలం కూర జెడ్పీహైస్కూల్ విద్యార్థి ఏ.హరిప్రియ ద్వితీయ స్థానంలో నిలిచా రు. ఇంగ్లీష్ మీడియం విభాగంలో బోథ్ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యారి ఏ.స్నితికారెడ్డి ప్రథమ స్థానం, బంగారుగూడ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి బి.హర్షవర్ధన్ ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరికి డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ నిత్యజీవితంలో సైన్స్‌కు ఎంతో ప్రా ముఖ్యత ఉందన్నారు. విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఇందులో జి ల్లా సైన్స్ అధికారి రఘురమణ, ఎంఈవో సోమ య్య, డైట్ వైస్‌ప్రిన్సిపాల్ కిరణ్‌కుమార్, కంటె న ర్సయ్య, ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎస్.రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి పొచ్చారెడ్డి, జి.సత్యనారాయణ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment