96 మంది విద్యార్థులు.. ఒక్కరే టీచర్!
నార్నూర్: సమస్యల పరిష్కారం కోసం సీఆర్టీలు ఈనెల 16 నుంచి సమ్మె బాట పట్టిన విషయం విది తమే. అయితే ఏజెన్సీ ప్రాంతంలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యాబోధనలో సీఆర్టీలే కీలకం. ప్ర స్తుతం వారు సమ్మెలో ఉండడంతో మూడు రోజు లుగా బోధించేవారు లేక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. మండలంలోని భీంపూర్ ఆశ్రమ పాఠశాలలో మొత్తం 222మంది విద్యార్థులున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 96 మంది విద్యార్థులుండగా.. ముగ్గురు సీఆర్టీలు, ఒకరు రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు బోధన చేస్తున్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు 126 మంది విద్యార్థులు ఈ వసతి గృహంలోనే ఉంటూ సమీపంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో ఉన్న ముగ్గురు సీఆర్టీలు సమ్మె బాట పట్టడంతో ప్రధానోపాధ్యాయురాలు మేస్రం తిరుమల ఒక్కరే వసతి గృహ నిర్వహణతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులను చూసుకోవాల్సిన పరిస్థితి. మూడు రోజులుగా విద్యా బోధన నిలిచిపోవడంతో విద్యార్థులు ఆటపాటలతో కాలం విలదీస్తున్నారు. ఐటీడీఏ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment