ఉత్తమ పాఠశాల @ మన్నూర్ జెడ్పీఎస్‌ఎస్
● మల్టీజోన్–1 నుంచి ఎంపిక
గుడిహత్నూర్: మండలంలోని మన్నూర్ జెడ్పీ ఉ న్నత పాఠశాల మల్టీజోన్–1 నుంచి ఉత్తమ అవా ర్డుకు ఎంపికై ంది. జాబితాలో జిల్లా నుంచి ఇది ఒక్క టే ఉండడం గమనార్హం. ఈ పాఠశాలకు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాక ముందే అంటే 1937లోనే ఈ బడి ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకు విద్యా సేవలందిస్తూ ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దింది. విశాలమైన ఆట స్థలం, స రిపడా తరగతి గదులతో మూడు భాషల్లో విద్యాబో ధన కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ తెలుగు, మ రాఠీ, ఆంగ్ల మాధ్యమాలను నిర్వహిస్తున్నారు. మొ త్తం 410 మంది విద్యార్థులున్నారు. కార్పొరేట్‌కు ధీటుగా విద్యను అందించడంతో పాటు ఏటా పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఫలితాలను సాధి స్తుండడం గమనార్హం. అంతేకాకుండా ఇక్కడి వి ద్యార్థులు వాలీబాల్ క్రీడలో సత్తా చాటుతూ రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక కావడం విశేషం. వెరసి జోనల్‌స్థాయి ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడంతో ఎంఈవో ఉదయ్‌రావ్, హెచ్‌ఎం ఎస్.సంతోష్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment