ఆర్థిక నేరాల నియంత్రణకు కృషి చేయాలి
● ఎస్పీ గౌస్ ఆలం ● మావల పోలీస్‌స్టేషన్ తనిఖీ
ఆదిలాబాద్‌రూరల్: ఆర్థిక నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మావల పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. నమోదైన కేసుల వివరాలు తెలుసుకొని పెండింగ్ వాటిపై దృష్టి సారించాలన్నారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఆవరణలో పూల మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక నేరాలు నమోదవుతున్న ప్రాంతాల్లో గస్తీ పెంచాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు, ఆసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ఖచ్చితమైన నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐ కె.ఫణిధర్, మావల ఎస్‌హెచ్‌వో విష్ణువర్ధన్, ఎస్సై పవర్ గౌతమ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment