
● గాడి తప్పుతున్న బాల్యం ● చెడు వ్యసనాల బారిన విద్యార్థ
● ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని ఓ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇటీవల పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత విద్యార్థి కుటుంబీకులకు విషయాన్ని తెలిపాడు. దీంతో వారు పోలీసు స్టేషన్‌లో ఫి ర్యాదు చేయగా, ఆ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. కోర్టులో హాజరుపర్చి పునరావాస కేంద్రానికి తరలించారు.
● మావల మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయురాళ్ల గురించి గోడలపై అసభ్యకర రాతలు రాశారు. ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ రాతలను చూసి ఖంగు తిన్నారు. ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు మనోవేదనకు గురై కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
● ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే ఓ విద్యార్థి ఇంటి నుంచి స్కూల్ బ్యాగ్‌లో కత్తి తీసుకువచ్చాడు. పాఠశాల ముందు ఉండే గుప్‌చుప్ బండి నిర్వాహకుడిని గుప్‌చుప్ ఇవ్వాలని కత్తితో బెదిరించాడు. అదే పాఠశాలకు చెందిన విద్యార్థులు బాలికల విషయంలో రెండు గ్రూప్‌లుగా ఏర్పడి దాడులకు పాల్పడ్డారు.
● ఇటీవల జిల్లాలో పలువురు మైనర్ అమ్మాయిలు యువకులతో ప్రేమలో పడుతున్నారు. కుటుంబీకులను వదిలేసి వారితో వెళ్లిపోతున్నారు. దీంతో సదరు యువకులపై పోక్సో, రేప్ కేసులు నమోదవుతున్నాయి. విలువైన జీవితా లను నాశనం చేసుకుంటున్నారు. సమాజంలో ఉన్న గుర్తింపును పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
ఆదిలాబాద్‌టౌన్: బాల్యం గాడి తప్పుతోంది. వి ద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడుతూ తమ వి లువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మంచిని పెడచెవిన పెడుతూ చెడు వైపు ఆకర్షితులవుతున్నారు. తెలిసీ తెలియని వయసులో తప్పులు చేసి చదువుకు దూరమవుతున్నారు. కొంత మంది విద్యార్థులు సిగరేట్లు, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఈ మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. గొడవలు పడటం, అమ్మాయిలను వేధించడం, ఇత ర వాటికి పాల్పడుతున్నారు. కేసుల్లో ఇరుక్కొని వా రితో పాటు వారి తల్లిదండ్రులు చెడు పేరును తీసుకొస్తున్నారు. కౌమర దశలోనే విద్యార్థులు నేరాల వైపు అడుగులు వేస్తున్నారు. కొంతమంది బాలలు దొంగతనాలకు సైతం అలవాటు పడుతున్నారు. గాడిన పెట్టేందుకు టీచర్లు ప్రయత్నిస్తే వారికే ఎదురు తిరుగుతున్నారు. ఉపాధ్యాయులు దండిస్తే కొంత మంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. బెదిరింపులకు పాల్ప డడంతో పాటు పోలీసు స్టేషన్‌లో కేసులు పెడుతున్నారు. దీంతో గురువులు చూసీ చూడనట్లుగా ఉండడంతో విద్యార్థుల బాల్యం నాశనమవుతోంది.
గురువులంటే
గౌరవం లేదు..
ఒకప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కనిపిస్తే వారికి కనిపించకుండా విద్యార్థులు పరుగులు తీసేవారు. పాఠశాలకు వచ్చిన తర్వాత దండిస్తారనే భయం వారిలో ఉండేది. ఉపాధ్యాయులు క్రమశిక్షణ చెబుతూ దండించడంతోనే తాము ప్రయోజకులమయ్యామని అప్పటి విద్యార్థులు చెబుతుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు, పెద్దలంటే చాలా మంది విద్యార్థులకు గౌరవం లేకుండా పోయింది. ఇందుకు కొంత మంది తల్లిదండ్రుల తీరే కారణమని తెలుస్తోంది. విద్యార్థులు చదవకపోతే దండించినా పాఠశాలకు వెళ్లి వారిని బెదిరించడం, కేసులు నమోదు చేయించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇచ్చోడ మండలంలో ఇలాంటి సంఘటనే జరిగింది. అయితే చాలా మంది ఉపాధ్యాయులు క్రమశిక్షణ కోసం విద్యార్థులను దండించకుండా చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. చిన్న మాట అన్న కొందరు విద్యార్థులు ఎదురుతిరగడం, తల్లిదండ్రులకు చెప్పడం పరిపాటిగా మారింది.
చెడువ్యసనాల వైపు..
విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. కొంత మంది యువకులు మైనర్ అమ్మాయిలను ప్రేమ పేరిట వేధిస్తూ వారిని బయటకు తీసుకెళ్తున్నారు. దీంతో వారిపై పోక్సో కేసులు నమోదవుతున్నాయి. అమ్మాయిలు చదువుపైనే దృష్టి సారించాలి. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. కేసుల్లో ఇరుక్కొని విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.
– ఎల్.జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ
పుస్తకాల బ్యాగు భుజంపై వేసుకొని స్కూల్‌కు వెళ్లాల్సిన విద్యార్థులు చెడు వ్యసనాలకు బానినవుతున్నారు. గంజాయి, సిగరేట్ మత్తులో తూగుతున్నారు. తరగతులకు ఎగనామం పెడుతున్నారు. ఇంట్లో బడికి, కళాశాలకు వెళ్తున్నామని చెప్పి సినిమాలు, పార్కుల బాట పడుతున్నారు. తోటి వారితో జల్సాలు చేస్తూ చిన్న చిన్న నేరాలకు పాల్పడుతున్నారు. కేసులు నమోదైన తర్వాత ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకరిద్దరు కుమారులు ఉండడంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు వారిని ఏమనలేక పోతున్నారు. చాలా మంది విద్యార్థులకు పేరెంట్స్ అటే భయం లేకపోవడం, పాఠాలు చెప్పే గురువులంటే కనీస మర్యాద లేకపోవడంతో దారి తప్పుతున్నారు. సెల్‌ఫోన్లలో రీల్స్ చేయడం, యూట్యూట్, ఇన్‌స్ట్రాగామ్‌లు చూస్తూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అయితే కొంత మంది తల్లిదండ్రులకు విషయం తెలిసినప్పటికీ దండిస్తే పిల్లలు అఘాయిత్యానికి పాల్పడతారనే భయంతో చూసీచూడనట్లుగా ఉంటున్నారు.

● గాడి తప్పుతున్న బాల్యం ● చెడు వ్యసనాల బారిన విద్యార్థ
Comments
Please login to add a commentAdd a comment