
పది దాటనిదే రారు.. పన్నెండైందంటే ఉండరు
● రిమ్స్‌లో చాలా మంది వైద్యుల తీరిది ● లక్షల్లో వేతనం ఉన్నా సమయపాలన పాటించరు ● వైద్యుల రాక కోసం రోగులకు తప్పని నిరీక్షణ ● సిబ్బంది తీరూ అదే పరిస్థితి
గురువారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
కంటి విభాగం వద్ద వేచి చూస్తున్న రోగులు
వైద్యుల రాక కోసం నిరీక్షిస్తున్న రోగులు, ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు
డెంటల్ విభాగం వద్ద నిరీక్షిస్తున్న పేషెంట్లు
ఆంగ్లంతో ఉజ్వల భవిష్యత్
కై లాస్‌నగర్: విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఆ దిశగా ఉపాధ్యాయులు వారికి ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఇటీవల ఇంగ్లిష్ లాంగ్వేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి ఇంగ్లిష్ ఒలింపియాడ్ నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన మన్నూర్ పాఠశాల, బంగారుగూడ మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. కలెక్టర్ రాజర్షితో పాటు డీఈవో ప్రణీతను విద్యార్థులు బుధవారం కలిశారు. విద్యార్థులతో పాటు గైడ్ టీచర్లు సవితాదేవి, అజయ్‌ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
రిమ్స్‌లో కొంత మంది వైద్యుల తీరు మార డం లేదు. ఇందులో పనిచేసే చాలా మంది డాక్టర్లకు జిల్లా కేంద్రంలో ప్రైవేట్ క్లినిక్‌లు ఉన్నాయి. ఉదయం అక్కడ రోగులను పరీ క్షించిన తర్వాత రిమ్స్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మళ్లీ క్లినిక్‌లోనే దర్శనమిస్తారు. ఇలా వారు రెండు చే తుల సంపాదిస్తున్నారే తప్ప సర్కారు దవా ఖానాకు వచ్చే పేదలకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు. ఎమర్జెన్సీ ఉంటే తప్పా అక్కడికి రావడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో కొంత మంది రోగులు మృత్యువాత పడుతున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. సమయపాలన పాటించని వైద్యులపై అధికారులు చర్యలు చేపట్టకపోవడంతోనే వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉదయం బయోమెట్రిక్ హాజరు పెట్టిన తర్వాత మధ్యాహ్నం కనిపించకుండా పోతారు. ఒకేసారి హాజరు ఉండడంతో విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు వీరిపై దృష్టి సారిస్తే తప్పా రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందే పరిస్థితి లేదని పలువురు పేర్కొంటున్నారు.
పోషకాహారంతో రక్తహీనత నియంత్రణ
కై లాస్‌నగర్: సంపూర్ణ పోషకాహారంతో రక్తహీనత నియంత్రించవచ్చని డీఆర్డీవో రవీందర్ రాథోడ్ అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఆ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వెయ్యి రోజుల కార్యక్రమ నిర్వహణపై జిల్లాలోని ఏపీఎంలు, సీసీలు, మండల సమాఖ్య ఆఫీస్ బేరర్లకు పట్టణంలోని టీటీడీసీలో బుధవారం అవగాహన కల్పించా రు. కార్యక్రమ లక్ష్యాలు, విధానాలపై ఏపీడీ గంగన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. ఇందులో డీపీఎం హేమలత తదితరులు పాల్గొన్నారు.
చిల్డ్రన్ ఓపీ వద్ద వైద్యుల కోసం నిరీక్షిస్తున్న
తల్లిదండ్రులు, చిన్నారులు
కష్టపడి చదవాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు కష్టపడి చది వి పదో తరగతిలో మంచి ఫలితాలు సా ధించాలని ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మా ల్వియా అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా వారికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఈవో ప్రణీత, ఉపాధ్యాయులు ఉన్నారు.
జిల్లాలో ఆదివాసీ, గిరిజనులు అధికంగా ఉంటారు. ఈ ప్రాంతంతో పాటు మహారాష్ట్ర వాసులకు రిమ్స్ పెద్ద దిక్కుగా ఉంది. సుస్తీతో ఇక్కడికి వచ్చే రోగులు వైద్యుల రాకకోసం నిరీక్షించాల్సిన దుస్థితి. ఉద యం 9గంటలకు విధులకు హాజరై సాయంత్రం 4 గంటలవరకు వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. ఇందులో కొంత మంది మాత్రమే సక్రమంగా వి ధులు నిర్వహిస్తుండగా, చాలా మంది పది దాటినా విధులకు హాజరు కారు.. మధ్యాహ్నం పన్నెండు తర్వాత కనిపించరు. బయోమెట్రిక్ హాజరు ఉన్నా వీరిలో మార్పు రావడం లేదు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ను బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు ‘సాక్షి’ విజిట్ చేసింది. 9.30 గంటల వరకు కూడా ఏ ఒక్క వైద్యుడు ఆస్పత్రికి చేరుకో లేదు. 10 గంటల తర్వాత ఒకరిద్దరు రావడం కని పించింది. డాక్టర్ల రాక కోసం రోగులు గంటల తరబడి నిరీక్షించారు. అప్పటి వరకు పీజీ విద్యార్థులు, హౌజ్ సర్జన్‌లు పేషెంట్లను పరీక్షించారు.
10 గంటల వరకు కానరాని వైద్యులు..
● గైనిక్ వార్డులో ఉదయం 9.30 తర్వాత కూడా డాక్టర్లు రాలేదు. సిబ్బంది మాత్రమే అందుబా టులో ఉన్నారు.
● మెడికల్ వార్డులో హౌజ్‌సర్జన్, పీజీ విద్యార్థులు ఉన్నారు. డ్యూటీ డాక్టర్లు కానరాలేదు. ఆర్థోపెడి క్ వార్డులోనూ వైద్యులు కనిపించలేదు.
● రోగులకు మందులు పంపిణీచేసే ఫార్మసిలోనూ అదే పరిస్థితి. ఫార్మసిస్టులు 9.30 వరకు రాలేదు. 9.45గంటలకు ఒకరు వచ్చారు. అప్పటివరకు అటెండర్ మాత్రలు సరిచేస్తూ కనిపించాడు. మందుల కోసం రోగులు వేచి ఉన్నారు.
● ఏఆర్టీ సెంటర్‌కు వైద్యులు, సిబ్బంది 9.45 గంటల వరకు చేరుకోలేదు. గది ఎదుట రోగులు నిరీక్షించారు.
● ఆప్తమాలజీకి సంబంధించి ఒక హౌజ్ సర్జన్ రో గులకు పరీక్షలు చేస్తూ కనిపించారు. రెండు వి భాగాలు ఉన్నప్పటికీ ఆయన ఒక్కరే అందుబా టులో ఉన్నారు. అప్పటికే పదుల సంఖ్యలో రో గులు ఉన్నారు. టెక్నీషియన్లు కూడా సమయపాలన పాటించలేదు. శిక్షణ విద్యార్థులు రోగులకు కంటి పరీక్షలు నిర్వహిస్తూ కనిపించారు.
● మలేరియా విభాగంలో సిబ్బంది 10 గంటల వరకు రాలేదు. ఓపీలో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించే సిబ్బంది లేకపోవడంతో గంటల తరబడి రోగులు, గర్భిణులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచే తమ వంతు కోసం గది ముందుర పడిగాపులు కాశారు.
● డెంటల్ విభాగంలో వైద్యులు రాకపోవడంతో పదుల సంఖ్యలో రోగులు అక్కడ ఉన్న కుర్చీల్లో నిరీక్షించారు. ఈ డాక్టర్లు కూడా 10 గంటల వరకు రాలేదు.
● చిల్డ్రన్ ఓపీలో 9.45 గంటల తర్వాత ఒక హౌ జ్ సర్జన్ విధులకు హాజరయ్యారు. పిల్లలకు వైద్య పరీక్షలు చేయించేందుకు తల్లిదండ్రులు గది ఎదుట బారులు తీరినప్పటికీ వైద్యులు కనిపించలేదు.
● ఆర్‌బీఎస్‌కే విభాగంలో ముగ్గురు సిబ్బంది మా త్రమే ఉన్నారు. బ్లడ్‌బ్యాంక్‌లో శిక్షణ పొందే విద్యార్థులతో పాటు ఒక ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉన్నారు. 10 గంటల వరకు మెడికల్ ఆఫీసర్ విధులకు హాజరు కాలేదు.
● 10 గంటల సమయంలో ఎమర్జెన్సీ ఇన్‌వార్డును పరిశీలించగా.. వైద్యులు కనిపించారు. రోగులకు వైద్య సేవలు అందించారు.
● ట్రామాకేర్‌లో 10గంటల వరకు వైద్యులు రాలేదని రోగులు తెలిపారు. హౌస్‌సర్జన్ మాత్రమే వచ్చి పరీక్షలు చేశారని పేర్కొన్నారు.
● గైనిక్ ఇన్‌వార్డులో ఒక పీజీ వైద్యురాలు మాత్ర మే అందుబాటులో ఉన్నారు. 10 గంటలు దాటినా మిగతా వైద్యులు రాలేదని అక్కడి సిబ్బంది తెలిపారు.
ఫారెస్ట్‌లో ఫైర్‌లైన్స్
అడవిలో వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. మూడేళ్లుగా కూలీల ద్వారా ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తోంది.
8లోu
న్యూస్‌రీల్
ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్‌లో వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. మేమింతే.. మారమంతే అన్న చందంగా మారింది చాలా మంది పరిస్థితి. సమయ పాలన విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పది దాట నిదే రావడం లేదు.. అలాగే పన్నెండయిందంటే చాలు ఉండడం లేదు. రూ.లక్షల్లో వేతనం తీసుకుంటున్నా ప్రైవేట్ ప్రాక్టీస్‌కే ప్రాధాన్యమిస్తున్నారు. రిమ్స్‌లో వైద్య సిబ్బంది సమయపాలనపై బుధవారం ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. చాలా మంది విధులకు ఆలస్యంగా రావడం.. నిర్దే శిత సమయానికి ముందే ఇంటి బాట పట్టడం కనిపించింది. – ఆదిలాబాద్‌టౌన్
మారని తీరు..

పది దాటనిదే రారు.. పన్నెండైందంటే ఉండరు

పది దాటనిదే రారు.. పన్నెండైందంటే ఉండరు

పది దాటనిదే రారు.. పన్నెండైందంటే ఉండరు

పది దాటనిదే రారు.. పన్నెండైందంటే ఉండరు

పది దాటనిదే రారు.. పన్నెండైందంటే ఉండరు

పది దాటనిదే రారు.. పన్నెండైందంటే ఉండరు

పది దాటనిదే రారు.. పన్నెండైందంటే ఉండరు
Comments
Please login to add a commentAdd a comment