అక్రమాలు నిజమే.. | - | Sakshi
Sakshi News home page

అక్రమాలు నిజమే..

Published Thu, Feb 13 2025 9:15 AM | Last Updated on Thu, Feb 13 2025 9:15 AM

అక్రమ

అక్రమాలు నిజమే..

● జిల్లాలో పత్తి కొనుగోళ్లలో గోల్‌మాల్‌ ● నిర్ధారించిన అధికారులు ● వరంగల్‌ రీజియన్‌లో ఏడుగురిపై వేటు ● అందులో ఆదిలాబాద్‌ మార్కెట్‌ కార్యదర్శిపై కూడా.. ● టీఆర్‌లలో తేడాల ఆధారంగా చర్యలు ● అక్రమాలపై ముందే చెప్పిన ‘సాక్షి’

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాలో పత్తి కొనుగోళ్లలో అక్రమాలు నిజమే అని తేలింది. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు పలువురిపై వేటు వేశారు. వ రంగల్‌ రీజియన్‌ పరిధిలో ఏకంగా ఏడుగురిని సస్పెండ్‌ చేయగా అందులో ఆదిలాబాద్‌ మార్కెట్‌ కార్యదర్శి కూడా ఉండడం గమనార్హం. ఈ అక్రమాలపై ‘సాక్షి’ సైతం వరుస కథనాలను ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

అక్రమాల తీరిది..

ఒక రైతుకు చెందిన వ్యవసాయ భూమిని మరో రైతు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. వచ్చిన దిగుబడిని మార్కెట్లో సీసీఐకి విక్రయించి మద్దతు ధర పొందాంటే పట్టా రైతుభూమికి సంబంధించి క్రాప్‌ బుకింగ్‌లో పేరు నమోదై ఉండాలి. దాని ఆధారంగా కౌలు రైతు తాను సాగు చేయగా వచ్చిన దిగుబడిని మద్దతు ధరకు అమ్ముకునేందుకు తన పేరిట పత్రం జారీ చేయాలని వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకుంటాడు. ఆ ప్రకారం కౌలు రైతుకు వ్యవసాయ శాఖ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుంది. ఆ పత్రాన్ని మార్కెటింగ్‌ అధికారులకు ఇస్తే ఆ దిగుబడిని సీసీఐకి విక్రయించుకునేందుకు వారు టెంపరరి రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌) జారీ చేస్తారు. అయితే వ్యవసాయ శాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలకు, మార్కెటింగ్‌ అధికారులు ఇచ్చిన ఇలాంటి టీఆర్‌లలో భారీ తేడాలు ఉన్నట్లు రాష్ట్ర మార్కెటింగ్‌ అధికా రులు విచారణలో తాజాగా గుర్తించారు.

సస్పెన్షన్‌ వేటు..

ఈ విచారణ ఆధారంగా రాష్ట్ర మార్కెటింగ్‌ అధికా రులు మంగళవారం వరంగల్‌ రీజియన్‌ పరిధిలో ఏడుగురు మార్కెట్‌ కార్యదర్శులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అందులో ఆదిలాబాద్‌ సెక్రెటరి మధుకర్‌ కాంబ్లే కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇది సంచలనం కలిగిస్తుంది. ఆదిలాబాద్‌ మార్కెట్లో ఈ టీఆర్‌లు ఈ ఏడాది వేలాదిగా జారీ అయ్యాయి. మొత్తంగా వీటి జారీలో భారీగా అవకతవకలు చోటు చేసుకు న్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్ని అక్రమాలు బయటకొస్తాయో చూడాల్సిందే. కాగా వ్యవసాయ శాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలతో పోల్చితే మార్కెటింగ్‌ శాఖ జారీ చేసిన టెంపరరి రిజిస్ట్రేషన్‌ పత్రాలలో వ్యవసాయ భూమి విస్తీర్ణం పరంగా ఎక్కువగా చూపించడం ద్వారా ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. అధిక దిగుబడిని దళారులు సీసీఐకి మద్దతు ధరతో విక్రయించడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని తేలు స్తోంది. రాష్ట్ర మార్కెటింగ్‌ అధికారులు మాత్రం ఈ పత్రాల పరంగా తేడా ఉన్నట్లు స్పష్టం చేసినప్పటికీ ఆ తేడా ఏ విధంగా ఉందనేది పేర్కొనలేదు. ఇదిలా ఉంటే జిల్లా మార్కెటింగ్‌ అధికారుల నుంచి రాష్ట్ర మార్కెటింగ్‌ అధికారులు ఎలాంటి నివేదిక కోరనట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయిలోనే ఈ అక్రమాన్ని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు జిల్లా అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

వేలాది టీఆర్‌ల జారీ..

జిల్లాలోని ఇతర మార్కెట్లలో కూడా ఇలాంటి అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర మార్కెటింగ్‌ అధికా రులు వాటిపై కూడా దృష్టి సారిస్తారా అనేది ప్రస్తు తం చూడాల్సిందే. ఈ సీజన్‌లో జిల్లా పరంగా ఐదు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఆదిలాబాద్‌, బోథ్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, జైనథ్‌ పరిధిలో 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సీసీఐ రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసింది. అయితే ఆదిలాబాద్‌ మార్కెట్లోనే సీసీఐ పత్తి కొనుగోళ్లు పెద్ద మొత్తంలో జరిగాయి. దీంతో మార్కెటింగ్‌ అధికారులు ఈ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

జిల్లాలో ఈ సీజన్‌లో పత్తి కొనుగోళ్ల వివరాలు

మొత్తం కొనుగోలు చేసిన పత్తి

27,07,479 క్వింటాళ్లు

సీసీఐ కొనుగోలు చేసింది

25,41,278 క్వింటాళ్లు

ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసింది 1,67,017 క్వింటాళ్లు

మద్దతు ధర (క్వింటాలుకు)

రూ.7,421 (రూ.100 తగ్గింపు తర్వాత)

జారీ అయిన టీఆర్‌ల సంఖ్య

సుమారు 5వేల వరకు

ఆదిలాబాద్‌ మార్కెట్‌లో టీఆర్‌లు : 3,457జారీ

రాష్ట్ర అధికారులే విచారణ చేశారు

పత్తి పంట ద్రువీకరణ పత్రాలు, టెంపరరి రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌)లలో తేడాలు ఉన్నట్లు రాష్ట్ర అధికారులు విచారణలో నిర్ధారించి నేరుగా చర్యలు తీసుకున్నారు. జిల్లా మార్కెటింగ్‌ కార్యాలయం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి నివేదిక కోరలేదు. రాష్ట్ర అధికారులు ఏవిధంగా విచారణ జరిపారు. నిర్ధారణ ఎలా చేసుకున్నారో అనే విషయాలు మా దృష్టిలో లేవు.

– గజానంద్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
అక్రమాలు నిజమే..1
1/3

అక్రమాలు నిజమే..

అక్రమాలు నిజమే..2
2/3

అక్రమాలు నిజమే..

అక్రమాలు నిజమే..3
3/3

అక్రమాలు నిజమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement