
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● ఆర్‌జేడీ సత్యనారాయణ రెడ్డి
ఆదిలాబాద్‌టౌన్: పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేయాలని వరంగల్ ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, సెక్టోరియల్ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి ప్రగతి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. అలాగే విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను పరి శీలించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా తరగతులు బోధించాలని, ప్రతిరోజు రెండు మూడు తరగతులను పరిశీలించాలని సూచించా రు. పర్ఫామెన్స్ విధంగా చూస్తే జిల్లాల పరంగా ఆదిలాబాద్ వెనుకబడి ఉందని తెలిపారు. సమావేశంలో డీఈవో ప్రణీత, ఏడీ వేణుగోపాల్ గౌడ్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి కందుల గజేందర్, సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ, సుజాత్ ఖాన్, నారాయణ, శ్రీకాంత్ గౌడ్, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment