పోస్టర్ ఆవిష్కరణ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఈ నెల 23న హీరాసుక జయంతిని ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు.
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
నాణ్యమైన విద్యాబోధన చేయాలి
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. గురువారం జైనథ్ మండలంలోని కెనాల్ మేడిగూడ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల చదువును పరిశీలించి రాత నైపుణ్యం బాగుందని అభినందించారు. పిల్లలచే హిందీ అక్షరాలు చదివించారు. ‘బడి కోసం నా వంతు‘ కార్యక్రమం ద్వారా వసతులు సమకూర్చుకోవడం అభినందనీయమన్నారు. ఆమె వెంట కాంప్లెక్స్ హెచ్‌ఎం సంజీవరెడ్డి, సెక్టోరియల్ అధికారి సుజాత్ ఖాన్, డీఈవో సీసీ రాజేశ్వర్, హెచ్‌ఎం వినోద్‌రావు, ఉపాధ్యాయులు ఉన్నారు.
న్యూస్‌రీల్
కుష్ఠురహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: కుష్ఠురహిత సమాజ ని ర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జి ల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ గజానన్ అన్నారు. స్పర్శ్ కుష్ఠు నివారణ పక్షోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని తాటిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఎ లాంటి అంగవైకల్యం రాదన్నారు. అన్ని ప్ర భుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అపోహలు వీడి స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకో వాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూ టీ పారామెడికల్ అధికారులు వామన్‌రావు, రమేశ్, సీవో రణిత పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
పోస్టర్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment