భూకబ్జాలపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

భూకబ్జాలపై ఉక్కుపాదం

Published Fri, Feb 14 2025 11:15 PM | Last Updated on Fri, Feb 14 2025 11:15 PM

-

కై లాస్‌నగర్‌ : ఆదిలాబాద్‌ పట్టణ పరిధిలో పెరుగుతున్న భూకబ్జాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న ఆక్రమణలను సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్‌ రాజర్షిషా గురువారం రాత్రి మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ ఆక్రమణల తీరుపై ఆరా తీసి వాటికట్టడికి అనుసారించాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. భూకబ్జాలు, ఆక్రమణలపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా 94921 64153 టోల్‌ఫ్రీ నంబర్‌ కేటాయించారు.

‘అంతర్గత మూల్యాంకన విధుల నుంచి తప్పించాలి’

కైలాస్‌నగర్‌: పదోతరగతి అంతర్గత మా ర్కుల మూల్యాంకన విధుల నుంచి అన్ని ఉ పాధ్యాయ సంఘాల మండల, జిల్లా, రాష్ట్ర నాయకులను తప్పించాలని టీయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌. శ్రీకాంత్‌, ఎం.జలంధర్‌రెడ్డి డిమాండ్‌ చేశా రు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఉన్న కమిటీ సభ్యులను యూటీఎఫ్‌ సంఘ బాధ్యులనే ఉద్దేశంతో విఽ దుల నుంచి తొలగించి ఫైరవీకారులను రివైజ్డ్‌ లిస్టులో చేర్చారన్నారు. ప్రభుత్వం ఈఏడాది గ్రే డింగ్‌ విధానాన్ని రద్దు చేసి మార్కుల విధానాన్ని అమలు చేస్తున్నందువల్ల పైరవీల మేరకు కొన్ని సంఘాల బాధ్యులను కమిటీల్లో ఉంచారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంఘబాధ్యులెవరూ విధుల్లో ఉండకుండా చూడాలని కోరారు.

‘చలో హైదరాబాద్‌’ విజయవంతం చేయండి

ఎదులాపురం: ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హమీలను వెంటనే అమలు చేయాలని డి మాండ్‌ చేస్తూ సీపీఐ (ఎంఎల్‌)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించను న్న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని కుమురం భీమ్‌ భవనంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పా ర్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్‌ నారాయణ, నాయకులు సుభాష్‌, నర్సింగ్‌, దేవిదాస్‌, హరీష్‌, గణేశ్‌, దత్తు, మారుతి, సుంగు, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement