వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
బేల: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశామని జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ జైవంత్‌రావు చౌహాన్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని సిర్సన్న గ్రామంలో రూ.1.54కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సబ్‌స్టేషన్‌తో సిర్సన్న, సింగాపూర్, అవాల్‌పూర్ రెవెన్యూ గ్రామ శివారుల్లో వ్యవసాయ సాగు కోసం రైతుల సౌలభ్యానికి మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌టీ డీఈ ప్రభాకర్, ఆదిలాబాద్ డివిజన్ డీఈ హరికృష్ణ, ఏఈలు శ్రావణ్‌కుమార్, సంతోష్, లైన్ ఇన్‌స్పెక్టర్ రమేశ్, ఏఎల్‌ఎం మహేష్, తదితరులు పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్ ప్రారంభిస్తున్న
ఎస్‌ఈ జైవంత్‌రావు చౌహాన్
Comments
Please login to add a commentAdd a comment