● పంచాయతీలకే తాగునీటి పథకాల పర్యవేక్షణ ● కేంద్ర, రాష్ట్
కైలాస్‌నగర్/ఇంద్రవెల్లి: మార్చి ఇంకా రానే లేదు.. అప్పుడే భానుడి ప్రతాపం మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మ రోవైపు భూగర్భజలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఎండలు ముదిరే కొద్ది జిల్లాలో నీటి సమ స్య తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ప్రజల దాహార్తి తీర్చేలా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం ఇప్ప టి వరకు ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించనట్లు తెలు స్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 12వరకు అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. నీటి ఎద్దడి తలెత్తే ఆవాసాలు, మరమ్మతులకు గురైన నీటి వనరులను గుర్తించారు. అయితే వాటిని బాగు చేసేందుకు పంచాయతీల్లో నిధులు లేకపోవడం గమనా ర్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు విడుదల చేస్తే తప్ప నీటి సమస్య తీరదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జీపీల్లో నిధుల కటకట..
ప్రజలకు అవసరమైన తాగునీటిని ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా అందజేస్తున్నారు. అయితే సరఫరాలో అంతరాయంఏర్పడితే స్థానికంగా ఉన్న నీటి వనరుల ద్వారా అందించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలదే. చెడిపోయి న పైపులైన్లు, చేతి పంపులు, వాటర్ ట్యాంక్‌లు, విద్యుత్ మోటార్ల మరమ్మతులను వేసవి రాకముందే చేపట్టా ల్సి ఉంటుంది. అయితే ఏడాదిగా జీపీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కా వడం కాలేదు. దీంతో ఆయా పనులు చేపట్టడం పంచాయతీలకు భారంగా మారుతోంది. అత్యవసర పరిస్థితుల్లో కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ప డాల్సి వస్తోంది. విధి లేని పరిస్థితుల్లో తమ జే బుల్లోంచి చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.
గతేడాది నిధులే విడుదల కాలే...
గతేడాది వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేలా ప్ర భుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించి ఎస్‌డీఎఫ్ కేటాయిస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి నివేదిక అందజేశారు. వాటికనుగుణంగా ఆయా గ్రామాల కు నిధులను మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలి పింది. ఈక్రమంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి వనరుల మరమ్మతులు చేపట్టారు. చేదబావులు, బోరుబావులు ఎండిపోయినట్లయితే ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేశారు. స్థానిక వనరులకు ప్రత్యేక పైపులైన్లు కూడా వేశారు. కొత్తగా బోర్లు సైతం వేయించారు. విద్యుత్ మోటార్లకు మరమ్మతులు చేయించారు. జిల్లా వ్యాప్తంగా రూ.3.65 కోట్ల వ్యయంతో 614 పనులు చేశారు. ఇందులో రూ.1.50 కోట్లతో కూడిన బిల్లులను ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఏడాది గడిచినా ఇంకా విడుదల కాలేదు. దీంతో ప్రస్తుతం పనులు చేయాలంటే అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
పంచాయతీలదే బాధ్యత..
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీలదే. చేతి పంపులు, విద్యుత్ మోటార్లు, బోరుబావుల మరమ్మతులు చేపట్టి ప్రజలకు నీటి సమస్య రాకుండా వారే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆర్‌డబ్ల్యూఎస్ పరంగా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గతేడాది చేసిన పనులకే ఇంకా బిల్లులు విడుదల చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల 10 రోజుల పాటు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి నీటి ఎద్దడి తలెత్తే గ్రామాలను గుర్తించాం.
– చంద్రమోహన్, ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. దీంతో ఈ నెల 3నుంచి 12వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. నీటి ఎద్దడి తలెత్తే ఆవాసాలు, వేసవిలో సమస్యాత్మకంగా మారే నీటి వనరులను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 208 చేతిపంపులు ఉపయోగంలో లేనట్లు నిర్ధారించారు. ఎండలు ముదిరేకొద్ది మరో 327 చేతిపంపుల్లో నీరు రాని పరిస్థితి తలెత్తే అవకాశమున్నట్లుగా తేల్చారు. అలాగే సింగిల్ ఫేజ్ విద్యుత్ మోటార్లు 45 పనికిరాకుండా పోగా, సీజనల్‌గా 113 మోటార్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నట్లుగా గుర్తించారు. ఇక త్రీఫేజ్ విద్యుత్ మోటార్ల పరంగా ఏడు పనిచేయని పరిస్థితిలో ఉండగా ఐదు సమస్యాత్మకంగా మారే అవకాశమున్నట్లుగా గుర్తించి అధికా రులకు నివేదించారు. వీటితో పాటు జిల్లాలోని 88 చేదబావులు ఎండల తీవ్రతతో అడుగుంటిపోయే పరిస్థితి ఉందని గుర్తించారు.
● పంచాయతీలకే తాగునీటి పథకాల పర్యవేక్షణ ● కేంద్ర, రాష్ట్
Comments
Please login to add a commentAdd a comment