కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం●
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
కై లాస్‌నగర్: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ పట్టభద్రు ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూ రి నరేందర్‌రెడ్డి ప్రచార సభలో పాల్గొన్నా రు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవుడు వేరు, రాజకీయం వేరని అన్నారు. బీజేపీ.. దేవుడిపై, కులమతాలపై రాజకీ యం చేస్తుందన్నారు. మోదీ బీసీ కాదన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కొందరు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కులమేంటని అడుగుతున్నారన్నారు. దేశ కోసం సర్వం త్యాగం చేసిన మోతీలాల్ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు రా హుల్‌గాంధీ అని గుర్తు చేశారు. పట్టభద్రులంతా నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్సీఅభ్యర్థి నరేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ మల్లేశ్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీధర్, ఆత్రం సుగుణ, పార్లమెంట్ కోఆర్డినేటర్ నరేశ్‌జా దవ్, మాజీ ఎమ్మెల్యే సక్కు, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గోవర్ధన్‌రెడ్డి, ఆనంద్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: నకిలీ బాబాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి అన్నారు. టూటౌన్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నకిలీ బాబాల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment