పంటలకు రక్షణ.. పక్షులకు ప్రాణాంతకం
పంట రక్షణ చర్యలు పక్షుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈ సీజన్‌లో రైతులు జొన్న, మొక్కజొన్న, గోదుమ పంటలు సాగు చేశారు. పంట రక్షణ కోసం ఇలా వలలు అమర్చడంతో నిత్యం వందలాది పక్షలు వాటిలో చిక్కుకుని చనిపోతున్నాయి. రామచిలుకలు, గద్దలు, గుడ్లగూబలతో పాటు అరుదైన పక్షులు సైతం తనువు చాలిస్తున్నాయి. దృష్టి సారించాల్సిన అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి
పంటలకు రక్షణ.. పక్షులకు ప్రాణాంతకం
Comments
Please login to add a commentAdd a comment