రాష్ట్రస్థాయి పోటీలు విజయవంతం చేయాలి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న ఖేలో ఇండియా ఉషూ రాష్ట్ర స్థాయి పోటీల ను విజయవంతం చేయాలని జిల్లా గిరిజన క్రీడ ల అధికారి కోరెడ్డి పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఈ పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అమెచ్యూర్ ఉషూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఉమర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అజ్మీరా గణేశ్, వేముల సతీశ్, సంఘం ఆర్గనైజింగ్ చైర్మన్ అన్నారపు వీరేశ్, శృతి, సాయికుమార్, హ్యాండ్ బాల్ సెక్రెటరీ హరిచరణ్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పాల్, శివప్రసాద్, శివకుమార్, ప్రణయ్ కుమార్, మాధవి, వనిత, దివ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment