వాతావరణం
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
తలమడుగు మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం సుదర్శన మహాయజ్ఞం నిర్వహించారు.
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది.
మళ్లీ కంప్యూటర్ విద్య
పాఠశాలల్లో మళ్లీ కంప్యూటర్ విద్య అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేసింది.
9లోu
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
8లోu
వలలు తొలగించారు.. పక్షులను రక్షించారు
ఇంద్రవెల్లి: పంటల రక్షణ కోసం రైతులు ఏర్పాటు చేసిన వలలకు చిక్కుకుని చనిపోతున్న పక్షులపై ‘సాక్షి’లో సోమవారం ‘పంటలకు రక్షణ.. పక్షులకు ప్రా ణాంతకం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు. మండల కేంద్ర శివారుతో పాటు అంజీ, మామిడిగూడ గ్రామాలను సందర్శించారు. రైతులు పంటల రక్షణ కోసం ఏర్పాటు చేసిన వలలను తొలగించారు. ఈ సమయంలో పలు పక్షులు అందులో చిక్కుకొని ఉండగా వాటిని రక్షించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఎఫ్‌ఎస్‌వో చంద్రారెడ్డి మాట్లాడుతూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆయన వెంట ఎఫ్‌బీవోలు నిషంత్, పద్మజ, నికిత, అఖిల్ తదితరులున్నారు.
ఆ నిర్మాణ పనులకు.. బ్రేక్
కైలాస్‌నగర్: మున్సిపల్ నుంచి అనుమతులు లేకుండా పట్టణంలోని ఓంకార్‌మాల్ జిన్నింగ్‌మిల్లులో అక్రమంగా కమర్షియల్ కాంప్లెక్స్ భవన నిర్మాణం చేపడుతుండడాన్ని వివరిస్తూ ‘దర్జాగా.. అక్రమం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి బల్దియా అధికారులు స్పందించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది రాజన్న, క్రాంతి సోమవారం జిన్నింగ్‌మిల్లులోని అక్రమ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు నిలిపివేయాలని పేర్కొంటూ భవన యజమానికి నోటీసు అందజేశారు. కాగా, అనుమతుల్లేకుండా ఎలాంటి కట్టడాలు చేపట్టవద్దని కమిషనర్ పేర్కొన్నారు.
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
ఆదిలాబాద్‌టౌన్: ఇసుక అక్రమార్కులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. పెన్‌గంగ నుంచి ఇసుక అక్ర మ రవాణాకు సంబంధించి ‘తోడేస్తున్నారు..’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు పోలీసు అధికారులు స్పందించారు. పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. బేలలోని కాంగర్‌పూర్ సమీపంలోని ఘాట్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు డీఎస్పీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే మైనింగ్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పెన్‌గంగ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మొదటిసారి జరిమానా విధిస్తామని, రెండోసారి పట్టుబడితే ఇసుక దొంగతనం కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఎక్కడైనా ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో జైనథ్ సీఐ సాయినాథ్, బేల ఏఎస్సై లింగన్న, కానిస్టేబుళ్లు దత్తు, వెంకటేశ్ పాల్గొన్నారు.
సాలెగూడకు.. ట్యాంకరొచ్చింది
ఇంద్రవెల్లి: మండలంలోని తేజాపూర్ గ్రామపంచాయతీ పరిధి సాలెగూడలో తాగునీటి ఇక్కట్లపై ‘సాక్షి’లో సోమవారం ‘గొంతెండుడేనా.., సాలెగూడలో నీటిగోస’ శీర్షి కన ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించా రు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ భానుకుమార్, ఎంపీవో జీవన్‌రెడ్డి ఉదయాన్నే గ్రామాన్ని సందర్శించారు. తాగునీటి కోసం గ్రామస్తుల ఇక్కట్లను పరిశీలించారు. వెంటనే ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ప్రారంభించారు. అధికారులు మాట్లాడుతూ, వేసవి ముగిసేంత వరకు నిరంతరం ట్యాంకర్ల ద్వా రా నీటిని సరఫరా చేస్తామన్నారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శి పూర్ణ, మాజీ సర్పంచ్ కామేశ్వరి ఉన్నారు.
పత్తి కొను‘గోల్‌మాల్’పై తనిఖీలు
ఆదిలాబాద్‌టౌన్: పత్తి కొనుగోళ్ల గోల్‌మాల్ వ్యవహారంలో ‘తిలా పాపం.. తలాపిడికెడు’ శీర్షికన ఈనెల 14న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజర్షిషా స్పందించారు. విచారణ అధికారులుగా నియమితులైన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌స్వామి, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్‌లు ఇచ్చోడ వ్యవసాయ కార్యాలయంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. టీఆర్‌లను స్వా ధీనం చేసుకున్నారు. ఇచ్చోడ ఏవో కై లాస్, పలువురు ఏఈవోలను విచారించారు. వారి నుంచి వివరాలు సేకరించారు. ఇచ్చోడతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో టీఆర్ బుక్‌లను పరిశీలించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పేర్కొన్నారు.
ఎఫెక్ట్..
వాతావరణం
వాతావరణం
వాతావరణం
వాతావరణం
Comments
Please login to add a commentAdd a comment