● పదవుల విషయంలో పలువురిలో అసంతృప్తి ● ప్రాధాన్యత ఇవ్వలే
● పార్టీ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షులుగా తొలిసారి ఇద్దరిని నియమిస్తూ నిర్ణయం తీసుకోవడంపై కార్యకర్తల్లో విస్మయం వ్యక్తమవుతుంది. మొదట ముగ్గురిని నియమించాలని భావించినప్పటికీ ఈ విషయంలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇద్దరితో సరిపెట్టినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ప్రస్తుతం పట్టణ అధ్యక్షులుగా వేదవ్యాస్, గండ్రత్ మహేందర్ ఉన్నారు.
● నేరడిగొండ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాబ్లే సంతోష్ సింగ్ రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మండల అధ్యక్షులకు కనీస మర్యాద, సమాచారం ఇవ్వకుండా అవమానించడం బాధకు గురి చేసిందని, విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని సంతోష్ సింగ్ తన రాజీనామా పత్రంలో పేర్కొన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నారని అందులో పేర్కొనడం గమనార్హం.
● నెల క్రితం కొన్ని మండలాలకు అధ్యక్షులను నియమిస్తూ పార్టీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అయితే ఈ నియామకాలు ఏకపక్షంగా సాగాయని పలు మండలాల్లో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా పార్టీలో పాత నాయకులను విస్మరించి కొత్తవారికి అవకాశం కల్పించారని పలువురు ఆరోపించారు. భీంపూర్ మండల బీజేపీ నూతన అధ్యక్షుడు అంకం అశోక్‌ను మార్చాలంటూ పార్టీ క్యాడర్ మండలానికి వచ్చిన ఎంపీ గోడం నగేశ్‌కు వినతి పత్రం అందజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బేల మండలంలో బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆ నాయకుడిని మండల అధ్యక్షుడిగా నియమించడం అభ్యంతరాలకు దారి తీసింది.
● బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గుడిహత్నూర్‌కు చెందిన బ్రహ్మానంద్‌ను మరోసారి కొనసాగిస్తూ ఇటీవల పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పార్టీలో సీనియర్ నాయకులు ఈ ని యామకంపై నారాజ్‌గా ఉన్నారని ప్ర చారం సాగుతోంది. ప్రధానంగా జిల్లా అధ్యక్ష నియామకానికి సంబంధించి కనీసం పార్టీలో అభిప్రా య సేకరణ చేయలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని సీనియర్లు వాపోతున్నారు.
సాక్షి,ఆదిలాబాద్: బీజేపీలో లుకలుకలు బయట ప డుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కలిగి ఉండటం, ప్రస్తుతం పదవీకాలం ముగిసినప్పటికీ గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ, బల్దియాలో కౌన్సిలర్లుగా పలు వు రు కాషాయ పార్టీ నుంచి గెలుపొందారు. ప్రసు తం స్థానిక సంస్థల ఎన్నికల ముందు పటిష్టంగా ఉండాల్సిన పార్టీలో అంతర్గతంగా విభేదాలు బయటపడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఎంపీ గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ ఈ పరిస్థితులను చక్కదిద్ది పార్టీ లో సమన్వయం తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
విభేదాలు ఇలా..
ఇదివరకు పార్టీ అధ్యక్ష పదవిని సీనియర్ నేతలు చిట్యాల సుహాసినిరెడ్డి, ఆదినాథ్, వేణుగోపాల్, జ్యోతిరెడ్డి ఆశించారు. అయితే అనూహ్యంగా ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అనుచరుడు బ్రహ్మానంద్‌ను పార్టీ నియమించడంపై అప్పట్లోనే ఈ సీనియర్ నే తలు నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా జిల్లా అధ్యక్షుడిగా తిరిగి ఆయననే కొనసాగించడం, ఈ నిర్ణయంపై తమకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం, పోటీ ఆసక్తిపై అడగకపోవడంపై వారు పెద వి విరుస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను విస్మరించి ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదన్న విమర్శలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ నేతలు ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో సైలెంట్ కావడం, పలు కార్యక్రమాల్లో అంటిముట్టనట్లు వ్యవహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల వరకు పట్టణ అధ్యక్షుడిగా కొనసాగిన లాలామున్నా కొంతకాలంగా ము ఖ్య నేతకు దూరంగా ఉంటూ వచ్చారనే ప్రచారం పార్టీలో ఉంది. తాజాగా మున్నాను మరోసారి పట్ట ణ అధ్యక్షుడిగా కొనసాగించకుండా పార్టీలో వేరే వారికి అవకాశం కల్పించారు. మొత్తంగా పార్టీలో సీనియర్ నేతలకు, ముఖ్య నేత మధ్య సఖ్యత లే దన్న ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే కార్యకర్తలు ప్రస్తుతం ఇటు పార్లమెంట్ పరిధిలో, అటు నియోజకవర్గ స్థా యిలో ఏమైనా పనుల కేటాయింపులోనూ నేతలు తమను విస్మరిస్తున్నారనే అసంతృప్తి వారిలో ఉంది. అంతేకాకుండా పార్టీలో ఒక నాయకుడికి ఎలాంటి పదవులు లేకున్నప్పటికీ ముఖ్య సమావేశాల్లో ఆయనను వేదికలపై కూర్చోబెట్టడం, రాష్ట్రనేతలను కలిసినప్పుడు కూడా అత ను వెంట ఉండటంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆ నాయకుడిని తూర్పారా బడుతూ పార్టీ నాయకులే పోస్టులు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ప్రస్తుతం బీజేపీలో అంతర్గతంగా సాగుతున్న ఈ కలహాలు ఎప్పుడో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment