ప్రజలు ‘కేసీఆర్ ప్రభుత్వాన్ని’ కోరుకుంటున్నారు
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ‘జోగు’ ● ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ ప్రజలు మరో సారి కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామ న్న అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. అనంతరం గంగపుత్ర శివాలయంలో పూజలు చేసి అన్నదానం ప్రారంభించారు. ఈద్గా మై దానంతో పాటు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కలు నాటారు. పార్టీ కార్యాలయంలో ఒక్కో కార్యకర్తకు మూడు మొక్కలు అందించి నాటాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పదేళ్లలో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజ య్, నారాయణ, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బాని, సాజి తోద్దీన్, స్వరూప రాణి, మమత, కరుణ, తదితరులు పాల్గొన్నారు. అలాగే జైనథ్‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నాయకులు నారా యణ, లింగారెడ్డి, వెంకటరెడ్డి, గణేశ్‌యాదవ్ తదితరులున్నారు.
చిత్రం గీసి.. శుభాకాంక్షలు తెలిపి
తాంసి: కేసీఆర్ జన్మదినం సందర్భంగా మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన చిత్రకారుడు గట్టు రాజు స్వయంగా మాజీ సీఎం చిత్రపటాన్ని పెన్సిల్‌తో గీశాడు. ఇలా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ప్రజలు ‘కేసీఆర్ ప్రభుత్వాన్ని’ కోరుకుంటున్నారు
Comments
Please login to add a commentAdd a comment