అర్జీలిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి
● ప్రజావాణికి 69 దరఖాస్తులు
● స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: భూ సమస్య పరిష్కరించాలని ఒకరు.. పింఛన్ అందడం లేదని ఇంకొకరు.. రైతుభరోసా సాయం కోసం మరొకరు.. ఇలా తమ సమస్యల గోడును బాధితులు కలెక్టర్ రాజర్షి షాకు వినిపించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో బాధితుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. వాటిని అధికారులకు అందజేస్తూ పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ వారం మొత్తం 69 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్‌కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. బాధితుల్లో కొందరి నివేదన..
అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి
నా పేరు సిర్రా దేవేందర్. ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శిని. రిమ్స్‌లోని మలేరియా విభాగంలో రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉండగా పీహెచ్‌సీల్లో పనిచేసే ముగ్గురిని డీఎంహెచ్‌వో అక్కడికి డిప్యూటేషన్‌పై నియమించారు. దీంతో వారు వంతుల వారీగా విధులకు హాజరవుతున్నారు. ముగ్గురు పనిచేయాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. అది కూడా సమయపాలన పాటించడం లేదు. అక్రమ డిప్యూటేషన్లతో అటు మండల ప్రజలకు ఇటు రిమ్స్‌కు వచ్చే రోగులకు సరైన సేవలు అందడం లేదు. అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలని కలెక్టర్‌కు విన్నవించాను.
అర్జీలిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి
Comments
Please login to add a commentAdd a comment