కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ రూరల్ మండలం నిఘా న్‌ఘాట్‌లోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు మౌలిక వసతులు కల్పించాల ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరుకు సోమవారం కాలనీవాసులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేళ్లుగా పేదలు అక్కడ గుడిసెల్లో నివసిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయమన్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటివి కల్పించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment