ఇంద్రవెల్లి: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహా ల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యంపై వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంద ని ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. మొత్తం 100 మంది విద్యార్థినుల రక్తనమానాలు సేకరించారు. విద్యార్థినులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యులు పూజిత, సీహెచ్‌వో సందీప్, పీహెచ్‌ఎన్ జ్యోతి, హెల్త్ సూపర్‌వైజర్ నరేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment