సీఎంను కలిసిన డీసీసీబీ చైర్మన్
కైలాస్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మంగళవా రం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టెస్కాబ్ చైర్మన్‌తో పాటు రా ష్ట్రంలోని ఆయా సహకార బ్యాంకుల చైర్మన్లతో కలిసి హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాయంలో సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. తమ పదవీ కాలం మరో ఆరునెలల పాటు పొడిగింపుపై హ ర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలి పారు. జిల్లాలో సాంకేతిక కారణాలతో రుణ మాఫీ కాని రైతుల రుణాలు మాఫీ చేసేలా చూడాలని విన్నవించగా, సీఎం సానుకూల త వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment