ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి
తాంసి: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని అదనపు ఎస్పీ సురేందర్‌రావు అన్నారు. జాతీయ సైన్స్‌డే పురస్కరించుకుని మండలంలోని కప్పర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం సైన్స్‌ఫేర్ ఏర్పా టు చేశారు. ఈసందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎగ్జిబిట్లను సందర్శించి విద్యార్థుల ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రాధిక, ప్రధానోపాధ్యాయుడు ఆనంద్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment