ఎదులాపురం: ఎన్నికల కోడ్ అనంతరం ప్ర జా సమస్యలపై ఉద్యమిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిల్లాకు తీరని అన్యాయం చేసిందన్నా రు. ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వేలైన్, విమానాశ్రయం ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ తెరి పించడం వంటి ప్రధాన హామీలతో జిల్లావాసులను ఏళ్లుగా మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అనంతరం ఆయా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామన్నా రు. కార్యక్రమంలో నాయకులు రా ములు, అరుణ్‌కుమార్, నర్సింగ్‌రావు, మహబూబ్‌ఖాన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment