సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల్లో సాంకేతిక ప రిజ్ఞానం పెంపొందించాలని డీఈవో ప్రణీ త అన్నారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ, అటల్ ఇన్నోవేషన్ పథకం కింద ప్రభుత్వం 19 పాఠశాలలకు ల్యాప్‌టాప్‌లు అందజేసినట్లు తెలిపారు. అలాగే ఐసీటీ పీఎంశ్రీ పథకం కింద 24 పాఠశాలలు ఎంపిక కాగా, పైలెట్ ప్రాజెక్ట్ కింద 13 పాఠశాలల కు ట్యాబ్‌లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నా రు. వీటిని అకాడమిక్ పాఠ్యంశాల కోసం ఉపయోగించాలని సూచించారు. ఇందులో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, సెక్టోరియల్ అధికారులు సుజాత్‌ఖాన్, నారాయణ, భాస్కర్, ఆయా పాఠశాలల ప్రధానో పాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment